kissik talks:బిగ్ టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కిసిక్ టాక్స్ లో ఈ వారం గెస్ట్ గా బిగ్‌బాస్ ఫేమ్ రోహిత్ నాయుడు ఎంట్రీ ఇచ్చాడు.తెలుగు ఆడియన్స్ ని ఎంతగానో ఎంటర్ టైన్ చేస్తున్న ఈ క్రేజీ రియాలిటీ షో నుండి ఊహించని విధంగా రోహిత్ నాయుడు ఎలిమినేట్ అయిన సంగతి తెల్సిందే.
అయితే హౌస్ లో రోహిత్ నాయుడు కి శాలిని కి మధ్య ఎదో సంథింగ్ సంథింగ్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొట్టగా ఇదే విషయం పై ఇలా ఓపెన్ అయిపోయాడు రోహిత్.అంతే కాదండోయ్ ..తనకి అసలు ఎలాంటి అమ్మాయి నచ్చుతుందో కూడా ఇలా వివరించాడు.
ఎలాంటి అమ్మాయిలు ఇష్టం
ముందుగా తనకు ఎలాంటి అమ్మాయిలు ఇష్టం అని అడిగిన ప్రశ్నకు రోహిత్ ఆన్సర్ ఇస్తూ జుట్టు పొడవుగా ఉండాలి లాంటి కండిషన్స్ తనకేమీ లేవని చెప్పాడు. అమ్మాయి క్యూట్‌గా, కొంచెం అల్లరి చేస్తూ సరదాగా ఉంటే చాలని తన మనసులో మాట బయటపెట్టాడు. అంతేకాదు, ఎవరైనా కోపంతో గట్టిగా అరిచినా వాళ్ళని కూల్ చేయడం, బుజ్జగించడం తనకు బాగా అలవాటు అని సరదాగా అన్నాడు.
ఇక శాలినిలో తనకు నచ్చే క్వాలిటీస్ గురించి చెప్తూ.. తను చాలా ఎమోషనల్‌గా రియాక్ట్ అవుతుందని అన్నాడు. ఏదైనా తప్పు జరుగుతుందని అనిపిస్తే, ముందు ఎవరున్నారు, సిట్యుయేషన్ ఏంటి అనేది అస్సలు పట్టించుకోకుండా తన ఒపీనియన్ నిర్మొహమాటంగా చెప్పేస్తుందని పొగిడేశాడు. అయితే శాలినిలో తనకు నచ్చని ఒక విషయం కూడా ఉందని చెప్తూ.. తను కొంచెం ఎక్కువగా గట్టిగా అరుస్తుందని పాయింట్ అవుట్ చేసుకొచ్చాడు రోహిత్.
చాలా మంచి లాజికల్ పాయింట్స్
ఇక శాలినికి చాలా మంచి లాజికల్ పాయింట్స్ ఉంటాయని, ఏదైనా డిస్కషన్ వచ్చినప్పుడు చాలా స్ట్రాంగ్‌గా తన వాదన వినిపిస్తుందని రోహిత్ చెప్పాడు. కానీ తను గట్టిగా అరవడం వల్ల అసలు చెప్పాలనుకున్న మేటర్ పక్కదారి పడుతుందని మనసులోని మాటని బయట పెట్టాడు.
తన పాయింట్ ఎంత గట్టిగా ఉన్నా ఆ అరుపుల వల్ల అవతలి వాళ్ళకి సరిగ్గా రీచ్ అవ్వడం లేదని, కొంచెం కూల్‌గా, నెమ్మదిగా మాట్లాడితే తన మాటలకు ఇంకా ఎక్కువ వాల్యూ ఉంటుందని మొదటి నుంచీ చెప్తూనే ఉన్నానని అన్నాడు. ఇప్పుడు శాలిని కూడా తనని తాను మార్చుకోవడానికి ట్రై చేస్తోందని చెప్పాడు.
నవ్వుతూ ఇన్ డైరెక్ట్ గా హింట్
ఇక వీళ్లిద్దరి మధ్య బాండింగ్ గురించి చెబుతూ ఫ్యూచర్‌లో కూడా ఇదే బంధాన్ని ఇలాగే కంటిన్యూ చేయాలని, అది ఫ్రెండ్‌షిప్ అయినా ఇంకేదైనా సరే ఇలాగే అందంగా ఉండాలని ,అయితే ఇప్పుడు తను సింగిల్ కాదని, ఆ విషయం తనకు బాగా తెలుసని నవ్వుతూ ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చేశాడు.
మొత్తానికి బిగ్‌బాస్ హౌస్ లోపల వీళ్లిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఎలాంటిదో చెప్పకనే చేశాడు రోహిత్.మొత్తంగా తన రిలేషన్‌షిప్ స్టేటస్‌పై రోహిత్ నాయుడు ఇచ్చిన హింట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. చూడాలి మరి ఈ బాండింగ్ పై శాలిని ఎలా రియాక్ట్ అవుతుందో !
ALSO READ:64 ఏళ్ల వయసులోనూ వర్మ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదేనా?