E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode April 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందును దాచిన ఇంట్లోకి వెళ్లిన నందు  

Brahmamudi Serial Today Episode April 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందును దాచిన ఇంట్లోకి వెళ్లిన నందు  
Advertisement

Brahmamudi serial today Episode: రాజు, లక్కీ భయంతో డోర్ వేసుకుని లోపల కూర్చుని ఉంటారు. నందు, వెంకట్‌ వెళ్లి బయటి నుంచి డోర్‌ కొడుతుంటారు. ఆ సౌండ్‌కు రాజు, లక్కీ భయపడతారు. లక్కీ మావ అంతా అయిపోయిందిరా ఇక మనం దొరికేసినట్టే అంటూ భయపడుతుంటారు. ఓరేయ్‌ నువ్వు కంగారు పడకు నీ భయమే మనల్ని పట్టించేలా ఉంది నేను మేనేజ్‌ చేస్తాను నువ్వు చూస్తూ ఉండు అంటూ వెళ్లి డోర్‌ తీస్తుంటారు. అప్పుడే వెంకట్‌కు ఎవరో ఫోన్‌ చేసి రోజా గురించి చెప్తుంటే పక్కకు వెళ్లిపోతాడు. డోర్‌ తీసిన రాజు, లక్కీ వెంకట్‌ లేకపోవడం చూసి ఊపిరి పీల్చుకుంటారు. లక్కీ హమ్మయ్య మీ తమ్ముడు లేడు మావ అంటాడు. రాజు నువ్వు నోర్మూయ్‌ రా అంటాడు.

దీంతో నందు ఏంటి మీలో మీరే గుసగుసలాడుకుంటున్నారు అని అడగ్గానే.. అంటే ఎవరో తెలియని అమ్మాయి ఇలా గుమ్మం ముందు నిలబడితే ఎవరా అని మాట్లాడుకుంటున్నాము అని రాజు చెప్పగానే.. మీలో మీరు మాట్లాడితే ఎలా తెలుస్తుంది. మిమ్మల్ని ఎక్కడో చూశానే అనగానే.. లక్కీ అయ్యో మర్చిపోయారా..? మేడం ఆరోజు మేము నగలు తాకట్టు పెట్టబోతుంటే మీరు కొంతమంది రౌడీలను తీసుకొచ్చారు అని చెప్పగానే.. ఎస్‌ గుర్తుకు వచ్చింది. అంటూ నందు చెప్పగానే.. ఇప్పుడెందుకు వచ్చారు మేడం అని రాజు అడగ్గానే.. నందు తాను ఇందును వెతుక్కుంటూ వచ్చానని ఫోటో చూపిస్తుంది. ఫోటో చూసిన రాజు, లక్కీ షాక్‌ అవుతారు. ఏమైంది మేడం అని అడగ్గానే.. ఇందును ఎవరో కిడ్నాప్‌ చేశారు అని నందు చెప్పగానే.. అమ్మో కిడ్నాపా..? కిడ్నాప్‌ అంటే సినిమాల్లో చూడటమే కానీ నిజంగా ఇప్పుడే వింటున్నాము అంటాడు లక్కీ..

Advertisement

దీంతో మీకు ఒక వేళ ఇన్మఫర్మేషన్‌ వస్తే పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి చెప్పండి అనగానే.. రాజు ఓకే మేడం ఏదైనా సమాచారం వస్తే ఇస్తాం అని చెప్పగానే.. నందు ఓకే అంటూ వెళ్లిపోతుంది. నందు బయటకు వెళ్లగానే.. వెంకట్ ఎదురుగా వచ్చి నందు నా గర్ల్‌ఫ్రెండ్‌ ఎక్కడ ఉందో తెలిసిపోయింది అని చెప్పగానే.. ఎక్కడ ఉంది అని నందు అడగ్గానే.. బంజారాహిల్స్‌లో ఒక రెస్టారెంట్‌లో ఉంది అని చెప్పగానే.. అని నీ గర్ల్‌ఫ్రెండ్‌ చెప్పిందా అంటూ నందు అడగ్గానే.. కాదు నా ఫ్రెండ్‌ చెప్పాడు.. ఫ్లీజ్‌ నందు వెళ్దాం పద అంటూ వెంకట్‌, నందును తీసుకుని బంజారాహిల్స్‌ వెళ్లిపోతాడు. అక్కడ రోజా వేరే ఎవరితోనో ఉండటం చూసి వెంకట్‌ గుండెపగిలి బాధపడుతుంటాడు. నందు ఓదారుస్తుంది.

మరోవైపు రాజు, లక్కీ చెస్‌ ఆడుతుంటే ఇందు మెల్లగా వెళ్లి వాళ్ల ఫోన్‌ తీసుకుని లాక్‌ ఓపెన్ చేసి స్వాతికి ఫోన్‌ చేస్తుంది. అప్పుడే రాజు ఒరేయ్‌ లక్కీ ఫోన్‌ తీసుకో ఒకసారి ఫోన్‌ చేద్దాం అని చెప్పగానే.. లక్కీ వెళ్లి ఫోన్‌ చూసి ఇక్కడ లేదని చెప్తాడు. ఇందు ఫోన్‌ చేయడం చూసి ఓరేయ్‌ ఫోన్‌ మాట్లాడుతుందిరా..? అంటూ భయంగా చెప్పగానే.. రాజు, లక్కీ లాక్‌ ఓపెన్‌ చేసి వెళ్లి ఇందు చేతిలో ఫోన్‌ లాక్కుంటారు. రాజు కోపంగా బుద్దుందా నీకు ఏం చేస్తున్నావు.. అని తిట్టగానే.. ఇందు మా చెల్లెలికి ఫోన్‌ చేస్తున్నాను అని చెప్పగానే.. రాజు కోపంగా ఏంటి నీ చెల్లెలికి ఫోన్‌ చేస్తున్నావా..? అంత అర్జంట్‌గా ఫోన్‌ చేయాల్సిన అవసరం ఏంటి..? అని అడగ్గానే.. కనీసం తనకైనా నేను సేఫ్‌గానే ఉన్నానని చెబుదామని అంటూ ఇందు చెప్పగానే..

Advertisement

రాజు కోపంగా చూడు నువ్వు వచ్చింది పిక్నిక్‌ కాదు.. మేము కిడ్నాప్‌ చేస్తే ఇక్కడ ఉన్నావు.. అనగానే. అలా అనకు ప్లీజ్ ఒక్కసారి నేను నా చెల్లెలితో మాట్లాడతాను.. అని చెప్పగానే.. రాజు చూడు నీకు ఇక్కడ ఏం తక్కువ చేస్తున్నాము… టైంకు అన్నం పెడుతున్నాము.. నీళ్లు ఇస్తున్నాము.. కట్లు కూడా విప్పేశాము.. అని చెప్పగానే.. అసలు అన్నం పెడితే సరిపోతుందా..? అని ఇందు అనగానే.. అన్నం కాకపోతే చెప్పు బిర్యానీ తీసుకొస్తాం అంటూ లక్కీ చెప్పగానే.. రాజు కోపంగా లక్కీని తిట్టి.. ఇందును తిడతాడు.  ఈ డబ్బు కోసం నేను చాలా కష్టపడుతున్నాను అంటూ సాహు గురించి చెప్పబోతూ ఆగిపోతాడు. ఇద్దరి మధ్య గొడవ జరగుతుంది. రాజు, ఇందుకు వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతాడు.

మరోవైపు గార్డెన్‌లో అపర్ణ, ఏడుస్తూ దీని అంతటికి కారణం నేనే అంటూ బాధపడుతుంది. దీంతో స్వాతి, అపర్ణను ఓదారుస్తుంది. అంత చాలా ధైర్యవంతురాలు.. దేవుడు అక్కకు హెల్ప్‌ చేస్తాడు అంటూ చెప్పగానే.. అపర్ణ మాత్రం దేవుడు లేదు.. ఎవ్వరూ లేరు. నా చేతులారా నేనే ఇందుకు ఇలా అయ్యేలా చేశాను అంటూ బాధపడుతుంది. అప్పుడే నందు వచ్చి నేను ఉండగా అక్కకు ఏమీ కానివ్వను అంటూ వస్తుంది. ఎలాగైనా అక్కను కనిపెడతానని ధైర్యం చెప్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×