BigTV English

Brahmamudi Serial Today December 10th: ‘బ్రహ్మముడి’ సీరియల్:    ధాన్యలక్ష్మీని రెచ్చగొట్టిన రుద్రాణి, రాహుల్‌ – రాజ్‌ను రెండు కోట్లు అడిగిన రాహుల్‌

Brahmamudi Serial Today December 10th: ‘బ్రహ్మముడి’ సీరియల్:    ధాన్యలక్ష్మీని రెచ్చగొట్టిన రుద్రాణి, రాహుల్‌ – రాజ్‌ను రెండు కోట్లు అడిగిన రాహుల్‌

Brahmamudi serial today Episode: వంటింట్లో పడుకున్న కావ్యను అపర్ణ తిడుతుంది. రాజ్‌ను పిలిచి నీ భార్య నీ గదిలో కాకుండా కిచెన్‌లో పడుకుంటే రూంలోకి తీసుకెళ్లకుండా పరాయిదానిలా చూస్తావా..? పట్టించుకోవా..? అంటూ నిలదీస్తుంది. ఎవరైనా చూస్తే ఎంత అవమానంగా ఉంటుందో తెలుసా..? మీ తాతయ్య నాన్నమ్మ కావ్యకు మాటిచ్చి తీసుకొచ్చారు. నువ్వెంత అవమానించినా.. ఆ పెద్ద వాళ్ల మాట కాదనలేక తిరిగి వచ్చింది అని అపర్ణ చెప్తుంది. దీంతో ఏయ్‌ నేను నిన్ను రూంలోకి రావొద్దన్నానా..? అని రాజ్‌ అంటే రమ్మని చెప్పారా..? అని కావ్య అడుగుతుంది. వస్తే వద్దంటానని ఎలా అనుకున్నావు అని అడుగుతాడు రాజ్‌.


రాకపోతే రమ్మంటారని కూడా ఆశపడలేదు అంటుంది కావ్య. రాకపోతే రమ్మని అనను.. వస్తే పొమ్మని అనను. ఇది తాతయ్య నిర్ణయం కాదని అనలేను అంటాడు రాజ్‌. దీంతో ఒరేయ్‌ ఇలా వంకరటింకరగా మాట్లాడకు నీ గదికి తీసుకెళ్లు అంటుంది అపర్ణ. ఆవిడ గారు చిన్నపిల్లేం కాదు తనను ఎత్తుకెళ్లి తీసుకెళ్లడానికి.. చేయి పట్టి నడిపించుకు వెళ్లడానికి రమ్మను అంటూ రాజ్‌ వెళ్లిపోతాడు. వెళ్లమని అపర్ణ చెప్పగానే కావ్య వెళ్తుంది. రూంలో రాజ్‌ బెడ్‌ మీద మధ్యలో ప్లాస్టర్‌ వేస్తాడు. ఏంటని కావ్య అడగ్గానే బెడ్‌ మీద ఆ సగం నీకు ఈ సగం నాకు నా భాగంలోకి నువ్వు రావొద్దు.. నీ సగంలోకి నేను రాను అని చెప్తాడు రాజ్‌. ఏవండి ప్రపంచంలో ఎవరైనా ఇలా సగం సగం చేస్తారా..? పడకగదిని సగం సగం పంచుకున్న ఘనత కూడా మీదే అంటుంది.

అవును నాదే అంటూ రాజ్‌ పడుకుంటాడు. కావ్య పడుకుని రాజ్‌ను రొమాంటిక్ గా చూస్తూ రాజ్ మీద నుంచి వాటర్‌ బాటిల్‌ అందుకోవడానికి ప్రయత్నిస్తుంటే రాజ్‌ తిడతాడు. ఎందుకు మీదకు వస్తున్నావు అంటాడు. వాటర్‌ బాటిల్‌ కోసం వస్తున్నాను అంటుంది. కోపంగా మనసును ముక్కలు చేయడం.. బెడ్‌ను ముక్కలు చేయడం మీ అంతట మీరు పిలిచే లోగా నేను ఈ బెడ్‌నే ముట్టుకోను అంటుంది. హమ్మయ్యా అయితే థాంక్స్‌ నీ సెల్ఫ్‌ రెస్పెక్ట్‌ నాకు నచ్చింది. ఏదో ఒక రోజు నేను పిలిచే లోగా ఇటువైపు చూడకు అంటాడు. అయితే ఏదో ఒక రోజు పిలుస్తావన్న మాట అంటుంది కావ్య. అంతలేదు ఏదో తాతయ్య నువ్వే నా భార్యవు అన్నాడు కాబట్టి ఇంత వరకు జరగనిచ్చాను అంటాడు రాజ్‌.


రుద్రాణి ఆలోచిస్తూ ఉంటే రాహుల్‌ వెళ్లి ఏంటి మమ్మీ ఇంకా పడుకోలేదా.? అని అడగ్గానే ఈ ఇంట్లో నేను ఎప్పుడు సంతోషంగా పడుకున్నాను అంటుంది. అవునులే పొద్దున్నే ఎవరినో ఒకరిని టార్చర్‌ చేయాలి కదా..? అంటాడు. దీంతో రుద్రాణి తిడుతుంది. అయినా తాతయ్య మనకు కూడా ఆస్థిలో వాటా ఇస్తానన్నాడు కదా..? ఇంకా ఆలోచించడం దేనికి అని అడుగుతాడు. మీ తాతయ్య ఇప్పుడు ఐసీయూలో ఉన్నాడు. ఆయన బతికి వస్తే ప్లాన్‌ ఏ అమలు చేస్తాను. రాలేదంటే ప్లాన్‌ బీ అమలు చేస్తాను. రేపు చెక్‌ తీసుకుని రాజ్‌ దగ్గరకు వెళ్లి నువ్వు కొత్తగా బిజినెస్‌ చేయాలనకుంటున్నట్టు చెప్పి రెండు కోట్ల రూపాయలు ఇవ్వని అడుగు అని చెప్తుంది.

రాజ్‌ నాకు రెండు కోట్ల రూపాయలు ఎందుకు ఇస్తాడు మమ్మీ అంటాడు. ఇవ్వడని నాకు తెలుసు కానీ ఆ ఇవ్వని చెక్‌ తీసుకెళ్లి ధాన్యలక్ష్మీ దగ్గర మంట పెట్టొచ్చు అని తన ప్లాన్‌ చెప్తుంది రుద్రాణి.  మరుసటి రోజు రాజ్‌, ప్రకాష్‌ వర్క్‌ చేసుకుంటుంటే రాహుల్‌ వెళ్లి రెండు కోట్లకు చెక్‌ ఇవ్వమని అడుగుతాడు. రాజ్‌, ప్రకాష్‌ షాక్‌ అవుతారు. ఎందుకని అడుగుతారు. డైమండ్‌ బిజినెస్‌ పెట్టాలనుకుంటున్నాను అని చెప్తాడు రాహుల్‌. అందులో నీకు ఎక్స్‌ఫీరియెన్స్‌ లేదు కదా.. అంటాడు ప్రకాష్‌. అసలు నీకు కష్టపడాలని ఉంటే ఏదైనా ఉద్యోగం చేసి నీ భార్యను అమ్మను పోషించుకో అంటాడు. ఇంతలో రుద్రాణి అచ్చి ప్రకాష్‌కు తిడుతుంది.

నువ్వు మధ్యలో అడ్డుపడకు అన్నయ్య అంటుంది. నువ్వు పొద్దున్న లేస్తే ఎన్నో విషయాలు మర్చిపోతావు అటువంటి నువ్వే బిజినెస్‌ చూసుకోవడం లేదా..? అంటూ నిలదీస్తుంది. నా కొడుకు బాగుపడాలని ఎవ్వరికీ లేదు.. వాడు జీవితాంతం ఇలా కింది స్థాయిలోనే ఉండిపోవాలా..? అని నిలదీస్తుంది. ఇంతలో రాహుల్‌ అదంతా కాదు రాజ్‌ నువ్వు ఇస్తావా..? లేదా..? అంటూ అడుగుతాడు. రాజ్‌ ఇస్తానన్నా నేను ఇవ్వనివ్వను అంటాడు ప్రకాష్‌. అయితే ఏం చేయాలో నాకు తెలుసు అంటూ వెళ్లిపోతుంది రుద్రాణి.

ధాన్యలక్ష్మీ దగ్గరకు వెళ్లిన రుద్రాణి ఏడుస్తున్నట్లు నటిస్తుంది. రాజ్‌ను డబ్బులు అడిగిన విషయం చెప్తుంది. రాజ్‌ ఎందుకు డబ్బులు ఇవ్వనన్నాడు అని ధాన్యలక్ష్మీ అడిగితే మేమంటే చిన్నచూపు అందుకే ఇవ్వలేదని చెప్తుంది రుద్రాణి. రాహుల్‌ కూడా అమాయకంగా నటిస్తూ అత్తయ్యా ఈ టైంలో మీరే నాకు హెల్ప్‌ చేయాలి. ఆ రెండు కోట్లు మీరిప్పిస్తే నేను బిజినెస్‌ చేసుకుంటాను. ఫ్యూచర్‌లో కళ్యాణ్‌ను కూడా నా పార్టనర్‌ గా చేసుకుంటాను అంటూ ప్రాధేయపడతాడు. ధాన్యలక్ష్మీ చూద్దాం అనగానే రుద్రాణి, రాహుల్‌ తమ మాటలతో ధాన్యలక్ష్మీని రెచ్చగొడతారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Tags

Related News

Tv Actress: విడాకులు తీసుకొని విడిపోయిన బుల్లితెర జంట…పెళ్లైన నాలుగేళ్లకే?

Nindu Noorella Saavasam Serial Today September 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు నిజం చెప్పిన సరస్వతి   

Brahmamudi Serial Today September 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యకు అబార్షన్‌ చేయించనున్న రాజ్‌ –  ఆఫీసుకు వెళ్లిన సుభాష్‌   

Nindu Noorella Saavasam Serial Today September 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఆరు ఫోటో చూసిన మిస్సమ్మ

Brahmamudi Serial Today September 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజ్‌ను కన్వీన్స్‌ చేసిన కళ్యాణ్‌ – కావ్యకు దొరికిపోయిన రాజ్‌  

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌,  మిస్సమ్మను చాటుగా చూసిన మను

Brahmamudi Serial Today September 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సుభాష్‌తో రాజ్‌ గొడవ – నిజం తెలుసుకున్న కావ్య  

Today Movies in TV : సోమవారం సూపర్ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Big Stories

×