BigTV English
Advertisement

Pushpa 2 Day 5 collection : బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న పుష్ప రాజ్.. ఎన్ని కోట్లంటే?

Pushpa 2 Day 5 collection : బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న పుష్ప రాజ్.. ఎన్ని కోట్లంటే?

Pushpa 2 Day 5 collection : పుష్ప 2 సినిమా కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. డిసెంబర్ 5 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన భారీ యాక్షన్ మూవీగా వచ్చింది. మూడేళ్ల క్రితం సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప 1కి సీక్వెల్‌గా వచ్చిన పుష్ప 2 ది రూల్‌ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే రూ.600 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా బాహుబలి, ఆర్ఆర్ఆర్‌ రికార్డులను బద్ధలు కొడుతుందా అంటూ ఇండస్ట్రీ, అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన ఐదు రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద ఊచకోత మొదలైంది. అసలు ఈ ఐదు రోజులకు ఎన్ని కోట్లు రాబాట్టిందో ఒకసారి తెలుసుకుందాం..


గతంలో వచ్చిన పుష్ప సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీ వచ్చింది. పుష్ప 2 లో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్‌ రష్మిక మందన్న నటించారు. ఫాహద్ ఫాజిల్, అనసూయ, సునీల్, రావు రమేష్, జగపతిబాబు వంటి స్టార్స్ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్, పోస్టర్స్‌తో భారీ హైప్ రావడంతో ఇందుకు తగినట్లుగానే పుష్ప 2 థియేట్రికల్ , నాన్ థియేట్రికల్ రైట్స్‌కు విపరీతమైన పోటీ నెలకొంది.. ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి.. దాదాపు రూ. 620 కోట్ల టార్గెట్ తో ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 12 వేల స్క్రీన్ లలో రిలీజ్ అయ్యింది. ఇక ఆలస్యం ఎందుకు ఐదు రోజులకు గాను ఎంత వసూల్ చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం..

మొదటి రోజు నుంచి ఐదు రోజుల వరకు కలెక్షన్ల మోత మోగిపోతుంది. రోజు రోజుకు కలెక్షన్స్ పెరుగుతున్నాయి తప్ప ఎక్కడ తగ్గట్లేదు. ఐదు రోజుల వరకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 203 కోట్ల గ్రాస్.. రూ. 140 కోట్ల షేర్ సాధించింది పుష్ప 2. నైజాంలో రూ.62 కోట్లు, సీడెడ్‌లో రూ.22 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 15.10 కోట్లు, ఈస్ట్‌లో రూ.8.58 కోట్లు, వెస్ట్‌లో రూ. 6.79 కోట్లు, గుంటూరులో రూ. 11.14 కోట్లు, కృష్ణాలో రూ.8.91 కోట్లు, నెల్లూరులో రూ.5.05 కోట్ల చొప్పున వసూల్ చేసింది పుష్ప 2.. వరల్డ్ వైడ్‌గా ఐదో రోజు పుష్ప 2 రూ. 80 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి పుష్ప 2 రూ.821 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.. ఇప్పుడు మరో 150 కోట్లు పెరినట్లు తెలుస్తుంది. అంటే దాదాపు 1000 దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు దీనిపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.. మొత్తానికి ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తుంది. ఇక ఇదే జోష్ లో కొనసాగితే కల్కి రికార్డులను కొద్ది రోజుల్లోనే బ్రేక్ చేస్తుందని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్… గతంలో ఏ సినిమాకు లేని రికార్డులు ఈ మూవికి దక్కడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.  ఇక ఈ మూవీకి సీక్వెల్ గా మరో సినిమా రాబోతుందని డైరెక్టర్ సుకుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే..


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×