E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode July 11th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: లక్కీ, రేఖ కొడుకే అన్న నిజం తెలుసుకున్న రాజు 

Brahmamudi Serial Today Episode July 11th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: లక్కీ, రేఖ కొడుకే అన్న నిజం తెలుసుకున్న రాజు 
Advertisement

Brahmamudi serial today Episode: ఫుల్లుగా మందు తాగి తనకు తల్లిదండ్రులు లేరని బాధపడుతున్న లక్కీని రాజు తన బైక్‌ మీద రూంకి తీసుకెళ్లి పడుకోబెట్టి వెళ్లబోతుంటే.. లక్కీ ఒరేయ్‌ మామ నువ్వు చాలా మంచోడివి.. మీ అమ్మానాన్నలను బాధపెట్టకు.. నా కన్నతల్లి ఎవరో ఆంటోని గానికి తెలుసు.. కానీ వాడు నిజం చెప్పడం లేదు.. నేను బతికి ఉండగా మా అమ్మను చూస్తానా..? ఒక్కసారి అమ్మా అని పిలవాలని ఉందిరా.. అంటూ ఎమోషనల్‌ అవుతుంటే.. రేయ్‌ నువ్వు ఇప్పుడు పడుకోరా… నేను వెళ్తాను అంటూ  లక్కీని పడుకోబెట్టి బయటకు వెళ్లిపోతాడు. అప్పుడే ఆంటోని స్కూటీ మీద ఎక్కడికో వెళ్లడం రాజు చూసి వెనకే ఫాలో అవుతాడు.

ఆంటోని వెళ్లి రేఖను కలుస్తాడు. వాళ్లిద్దరు కలుసుకోవడం చూసిన రాజు షాక్‌ అవుతాడు. రేఖ పిన్నిని ఆంటోని కలవడం ఏంటి..? అనుకుంటాడు. వాళ్లిద్దరు మాట్లాడుకోవడం రాజు దూరం నుంచి వింటుంటాడు. రేఖ కోపంగా ఆంటోనిని తిడుతుంది. రేయ్‌ నేను ఎప్పుడూ ఫ్రీగా ఉంటాను అనుకుంటున్నావా..? ఎందుకు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్‌ చేసి నన్ను కలుస్తానంటావు.. అనగానే అంటోని అదేంటి మేడం నా అవసరాలు నాకు ఉంటాయి కదా..? అనగానే.. నీ అవసరాల కోసం నన్ను డిస్టర్బ్‌ చేస్తావా..? ఎప్పుడో నేను చేసిన చిన్న తప్పు అడ్డం పెట్టుకుని ఇప్పుడు ఇలా చేస్తావా..? అనగానే.. అది చిన్న తప్పేంటి మేడం అది ఇప్పుడు పెరిగి ఎంతో పెద్దది అయింది. మీ కడుపును పుట్టిన బిడ్డను నా చేతుల్లో పెట్టి వదిలించుకున్నారు. అయినా అంతటితో అయిపోలేదు కదా..? మీరు పెళ్లి చేసుకుని హ్యాపీగా బతికేస్తున్నారు అనగానే.. రాజు షాక్‌ అవుతాడు.

Advertisement

ఆంటోని మాత్రం రేఖతో బేరం ఆడుతుంటాడు. ప్రతిసారి అవసరాల కోసం మిమ్మల్ని అడగడం ఎందుకని.. ఒకేసారి సెటిల్‌ చేసుకుందామని అనుకున్నాను అని చెప్పగానే.. అయితే ఒక లక్ష ఇస్తాను తీసుకెళ్లు అని చెబితే.. లక్ష సరిపోవని.. 50 లక్షలు ఇస్తే సరిపెట్టుకుంటాను అని చెప్పగానే.. రేఖ బెదిరిస్తుంది. ఇవ్వకపోతే ఏం చేస్తావు అంటుంది. దీంతో ఏం చేస్తాను నువ్వు నా చేతుల్లో పెట్టిన ప్రాణం ప్రతి నిమిషం మా అమ్మ ఎవరు అంటూ నన్ను వేధిస్తున్నాడు.. పాపం వాడి పేరులో లక్కీ ఉంది కానీ వాడి జీవితంలో లక్కీ లేదు మేడం.. అని చెప్పగానే.. రాజు షాక్‌ అవుతాడు. ఈ లక్కీ రేఖ కొడుకా..? అనుకుంటాడు. ఆంటోని మాత్రం రేఖను లక్కీ పేరు చెప్పి బ్లాక్‌ మెయిల్‌ చేస్తుంటాడు. రేఖ అయోమయంలో పడిపోతుంది. ఆంటోని రేఖకు వారం రోజుల టైం ఇచ్చి వెళ్లిపోతాడు. రేఖ అయోమయంలో చూస్తుంటే..వెనక నుంచి  చప్పట్లు కొడుతూ రాజు వెళ్తాడు.

రాజును చూసిన రేఖ షాక్‌ అవుతుంది. రాజు మాత్రం నీకు పెళ్లికి ముందు ఇంత చరిత్ర ఉందా..? అనగానే.. ఏయ్‌ ఏం మాట్లాడుతున్నావు.. నాకు చరిత్ర ఉండటం ఏంటి..? అనగానే.. ఇంకా బుకాయించకండి పిన్ని నేను ఆంటోని గాడు మాట్లాడింది మొత్తం విన్నాను.. పిన్ని ఇంతకీ నీ కొడుకెవరో నీకు తెలుసా..? అదే ఆ ఆంటోని గాడు చెప్పిన లక్కీగాడు. ఎవడో కాదు నా ఫ్రెండ్‌ లక్కీ ఉన్నాడు కదా..? వాడే అనగానే.. రేఖ గుర్తు చేసుకుంటుంది. రాజు ఇప్పుడు నేను వాడికి మీ విషయం చెబితే ఎంత సంతోషిస్తాడో తెలుసా..? వాడు నీ కోసం ఎంత ఎమోషనల్‌ అవుతున్నాడో తెలుసా..? ఇంతకు ముందు కూడా అమ్మ గురించి ఆలోచిస్తూ ఫుల్లుగా తాగేశాడు.. అంటూ చెప్తూ.. మీరు సూటిగా లక్కీ విషయం చెప్పి ఇంట్లో వాళ్లను క్షమించమని అడగండి.. మీరు నిజాన్ని ఒప్పుకోకపోతే నేనే అందరి ముందు నిజం బయటపెట్టాల్సి వస్తుంది అంటూ బెదిరిస్తాడు రాజు. రేఖ భయంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Advertisement

ఇంట్లో ఇందుకు అందరూ కాఫీ, జ్యూస్‌ తీసుకురమ్మని పనులు చెప్తుంటే.. ఇందు సరే అంటూ వెళ్తుంటే.. నందు వచ్చి ఆక్కా ఆగు అంటూ మీకందరికీ చేతులు లేవా..? అంటూ నిలదీస్తుంది. రోజూ వీళ్లను పశువులను మేపినట్టు ఎందుకు మేపుతున్నావు అనగానే.. ఐశ్వర్య కోపంగా ఏయ్‌ ఏం మాట్లాడుతున్నావు.. అంటూ కోపంగా దగ్గరకు వెళ్తే.. నిజంగా చెప్పాలంటే మీకంటే పశువులే బెటర్‌ అంటూ నందు అంటుంది. స్వాతి మెల్లగా అపర్ణతో ఏంటి నాన్నమ్మ నందు అక్క మరీ ఇంత ఫైర్‌గా ఉంది అనగానే.. దీన్ని చిన్నప్పుడే వీళ్లు భరించలేకపోయారు. ఇప్పుడు ఎలా తట్టుకుంటారు..? వీళ్లకు సరైన మొగుడు ఇదే అంటుంది. ఐశ్వర్య కోపంగా నీ కథలు నాతో కాదు.. అంటూ వార్నింగ్‌ ఇస్తుంటే..

రాత్రి ఇచ్చిన వార్నింగ్ గుర్తు లేదా..? నీకు అంటూ చెప్తుంటే.. భ్రమరాంబ కోపంగా ఏంటి ఐశ్వర్యనే కొడతావా..? అనగానే.. ఐశ్వర్యనే కాదు నిన్ను కూడా కొడతాను.. మీకు మళ్లీ చెప్తున్నాను.. మా అక్కకు ఏ పని చెప్పినా మిమ్మల్ని వదలను.. మీ పనులు మీరే చేసుకోవాలి అంటూ వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో భ్రమరాంబ కోపంగా నీ సంగతి రేఖకు చెప్తాను ఉండు అనగానే.. చెప్పుకో నాకేం భయం అంటూ తిడుతుంది. ఇంతలో రేఖ ఆలోచిస్తూ కిందకు వస్తుంది. ఐశ్వర్య, భ్రమరాంబ దగ్గరకు వెళ్లి రేఖకు నందు గురించి చెప్తుంటారు. నువ్వే దీన్ని ఏమైనా చేయాలి. లేకపోతే మేము దీన్ని భరించలేము అనగానే.. మీరు ఎన్నైనా చెప్పుకొండి.. నన్నేం చేయలేదు అనగానే.. భ్రమరాంబ, ఐశ్వర్య, నందు, ఇందు మాట్లాడుతుంటే.. రేఖ మాత్రం రాజు చెప్పిన మాటలే గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోతుంది.

రేఖ సైలెంట్ గా వెళ్లిపోవడంతో అందరూ షాక్‌ అవుతుంది. దీంతో నందు మీ రేఖ ఆంటీ నన్ను ఏమీ అనలేక తోక ముడుచుకుని వెళ్లిపోయింది. ఇక నుంచి మా అక్కకు ఎవరు పని చెప్పినా వాళ్ల టాపు లేచిపోద్ది అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది. మరోవైపు రాజు, లక్కీకి ఫోన్‌ చేసి అర్జెంట్‌గా కలవమని చెప్తాడు. లక్కీ వెంటనే రాగానే.. ఏంటని అడుగుతాడు. ఎందుకు అర్జెంట్‌గా రమ్మన్నావు అంటూ అడగ్గానే.. మీ అమ్మ గురించి నీకు ఈరోజు తెలిసిపోతుందిరా..? అని చెప్పగానే.. లక్కీ ఆశ్చర్యపోతాడు. నీకెలా తెలుసు..? మా అమ్మ ఎలా ఉంటుంది..? ఎక్కడ ఉంటుంది..? చెప్పరా ఇప్పుడే వెల్లి కలుస్తాను.. అంటూ ఆత్రుతగా అడిగితే రాజు నాకు అవేమీ తెలియదురా… అంటాడు.. ఇంతలో ఈరోజు బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

బుల్లితెరపై లెనిన్ సినిమా ఎప్పుడంటే?

Illu Illaalu Pillalu Ramaraju : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. రామరాజు అవుట్..

Podarillu Today Episode : చక్రీ పై మహా సీరియస్.. మాధవ్ కీలక నిర్ణయం..? కన్నాకు జోడీ దొరికేసిందోచ్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. బాలు కౌంటర్స్ అదుర్స్.. సుమతి పెళ్లి ఫిక్స్..

Illu Illalu Pillalu Today Episodes: సాగర్ పై నర్మదకు అనుమానం.. ఇదేంటి ప్రేమ.. విశ్వ పై బూతుల వర్షం..

Karthika Deepam 2 Serial Today Episode August 27th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: అందరి ముందు నిజం చెప్పిన జ్యోత్స్న      

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. అడ్డంగా బుక్కయిందిగా.. అవని కాపురంలో చిచ్చు..

Thursday Movies in Tv : మూవీ లవర్స్ కు పండగ.. టీవీల్లోకి హిట్ సినిమాలు..

Big Stories

Advertisement
×