E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రికీ ఘోర అవమానం.. మాధవ్ పరువు పోయిందిగా.. పల్లీలు అమ్మేవాడిగా కన్నా..

Podarillu Today Episode : చక్రికీ ఘోర అవమానం.. మాధవ్ పరువు పోయిందిగా.. పల్లీలు అమ్మేవాడిగా కన్నా..
Advertisement

Podarillu Today Episode July 11th: చక్రి మహాలక్ష్మి అనుకుని అక్కడున్న ఒక ఆవిడతో నా మనసులోని మాట నీకు చెప్పాలనుకుంటున్నా అని అంటాడు. అయితే ఆ వెనకాల ఉన్న ఆవిడ నాకే చెప్పాలనుకుంటున్నాడు ఏమో అని చాలా సంతోషంగా ఉంటుంది. మీతో ఈరోజు ఇలా బయటకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చక్రి అనగానే ఆవిడ మురిసిపోతుంది. భార్యతో ఎవరో మాట్లాడుతున్నాడు అని అక్కడికొచ్చిన ఆమె భర్త చక్రి ప్రపోజ్ చేయగానే భుజం మీద చేయి వేసి ఎవర్రా నువ్వు నా భార్యకి ఐ లవ్ యు చెప్తున్నావు అని అంటాడు.. ఆ మాట వినగానే చక్రి ఒక్కసారిగా షాక్ అవుతాడు. నువ్వు ఎవర్రా నీ భార్య ఎవరు రా అని అడిగి మరి ఆ రౌడీని కొడతాడు. మా ఆవిడ ఆవిడ అని మహాలక్ష్మిని చూపిస్తాడు.

చక్రిని ఇరికించిన మహా..

మహాలక్ష్మి వెళుతుండగా చక్రి అక్కడికి వెనకాలే వెళ్ళిపోతాడు.. ఏంటండీ మీరు నన్ను ఒక్కడినే వదిలేసి ఇలా వచ్చేసారు అని చెక్రి అడుగుతాడు.. మీరు ఆవిడతో  ఏకాంతంగా మాట్లాడాలి అన్నారుగా.. మీరు ప్రశాంతంగా మాట్లాడుకోండి అని నేను వచ్చేసాను నాది తప్పు లేదు కదా అని మహాలక్ష్మి అమాయకంగా అంటుంది.. నేను ఏదో అనుకున్నాను కానీ మీరు ఇంకేదో చేసేసి వచ్చారుగా.. అని మహాలక్ష్మిని చక్రి అనగానే తను మాత్రం మీరు అనుకున్నట్లుగా ఏమి జరిగిందో లేదో నాకు తెలియదు అని అంటుంది.. మొత్తానికి మహాలక్ష్మి మాత్రం చక్రిని అడ్డంగా ఇరిగించేస్తుంది. తను ఏం చెప్పినా సరే మహాలక్ష్మి విని విననట్టుగా అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటుంది..

అయ్యో.. ఏంట్రా కన్నా..

Advertisement

మహాలక్ష్మి కన్నా కి అలాగే తనకు మాత్రమే ఐస్ క్రీమ్ తీసుకొని వస్తుంది. అక్కడి నుంచి తీసుకుని రావడంతో ఎక్కువగా కరిగిపోతుంది. ఈ క్రమంలో కన్నాకి ఐస్ క్రీమ్ ఇవ్వగానే అది కాస్త కరిగిపోయి జారిపడి కింద పడిపోతుంది. అప్పుడు కన్నా షర్ట్ మీద ఐస్క్రీమ్ వేసుకోగానే షర్ట్ అంత పాడైపోయింది అని ఆలోచిస్తూ ఉంటాడు. నేను షర్ట్ ని కడుక్కొని వస్తాను అని వాష్ రూమ్ కి వెళ్ళిపోతాడు కన్నా. మాధవ్ మనిషా ఇద్దరూ అక్కడికి వస్తారు. కన్న ఎక్కడికి వెళ్లారు అని వెతుకుతారు. అయితే మాధవ్ కన్నా కోసం చూస్తుండగా మహాలక్ష్మి ఐస్ క్రీమ్ మీద పడడంతో కడుక్కోడానికి వాష్ రూమ్ కి వెళ్ళాడు అని చెప్తుంది. మనిషా భార్య అంటే ఏంటి అని అడుగుతుంది.. మహాలక్ష్మి ఏదో ఒకటి మేనేజ్ చేసి చెప్తుంది..

కన్నాకు అడ్డంగా దొరికిపోయిన కేశవ..

కన్నా షర్టు మీద ఐస్ క్రీమ్ పడిపోయింది షర్ట్ అంతా తడిచిపోయింది అనుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటూ చాటుగా వస్తూ ఉంటాడు. అక్కడ కేశవ గొంతు వినిపించి ఆగుతాడు.. మళ్లీ మళ్లీ కేశవ మాట్లాడడంతో నిజంగానే మా కేశవ్ అన్నయ్య ఇక్కడికి వచ్చాడా అని అనుకుంటారు. తీరా చూస్తే కేశవ్ అనే వచ్చాడు అని కన్ఫామ్ చేసుకొని పరిగెత్తుకుంటూ ఈ విషయాన్ని వాళ్ళ అన్నయ్య వాళ్ళతో చెప్పాలని అనుకుంటాడు. అందరూ వచ్చారుగాని కేశవ కూడా వచ్చి ఉంటే బాగుండేది కదా అని మాధవ్ తెగ ఫీల్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే కన్నా అక్కడికి వచ్చి మీరు ఫీల్ అవ్వాల్సిన పని ఏమీ లేదు ఆయన కూడా తన గర్ల్ ఫ్రెండ్ తో ఇదే పార్కుకి వచ్చాడు చూపిస్తా రండి అని అంటాడు.

అడ్డంగా బుక్కయిన కేశవ..

Advertisement

కేశవాణి శైలు గట్టిగా పట్టుకొని భుజంపై పడుకుంటుంది. మొండోడైన కేశవ పట్టుకోకపోయిన పర్వాలేదు కదా ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారు కదా అని అంటాడు. ఆ మాటకి శైలు మాత్రం దిమ్మ తిరిగిపోయేలా సమాధానం చెబుతుంది. లవర్స్ అన్నాక ఇలానే ఉండాలి ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకో అని ఇంకాస్త గట్టిగా పట్టుకుని పడుకుంటుంది. వాళ్ళిద్దర్నీ చూసినా కన్నా అందరినీ అక్కడికి తీసుకొని వస్తాడు. అదే సమయంలో శైలుకి తన ఇంటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు కేశవ.. ముఖ్యంగా చక్రీ గురించి దారుణంగా మాట్లాడడంతో చాలా ఆవేశంగా ఉంటాడు చక్రి.. అక్కడున్న ప్రతి ఒక్కరి గురించి కేశవ వివరించి చెప్పడంతో.. అందరూ ఒక్కసారిగా కేశవ పై సీరియస్ అవుతారు.. ముఖ్యంగా చక్రీని బేవర్స్ గాడు అని అనడంతో ఇంకాస్త ఊగిపోతాడు.. ఎలాగైనా సరే వీడి ఇంటికి వస్తాడు కదా అప్పుడు వీడి గురించి తేలుస్తాను అని చక్రి అనుకుంటాడు.. ఇక అందరూ కేశవ మాట్లాడిన మాటలకి చాలా కోపంగా ఉంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: మీనాక్షిని ఘోరంగా అవమానించిన పల్లవి.. చక్రధర్ స్ట్రాంగ్ వార్నింగ్.. అశ్విన్ స్టోరీ ఇదే..

Related News

నిజమే గెలుస్తుంది.. మరో సంచలన పోస్ట్ తో యూట్యూబర్ నందన!

Telugu Tv Serials : బిగ్ షాక్.. ఆ ఛానెల్లో ఒకేసారి 4 సీరియల్స్ అవుట్..

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఇంటింటి రామాయణం అవుట్..

Podarillu Today Episode : కన్నా దూరమయ్యాడా..? మహాకు క్షమాపణ.. జమున ప్లాన్ ఇదా..?

Gundeninda GudiGantalu Today episode: హమ్మయ్య ప్రభా హ్యాపీ.. చింతామణికి దిమ్మతిరిగే షాక్..హైలెట్ ట్విస్ట్..

Illu Illalu Pillalu Today Episodes: కొడుకు కోసం రామరాజు కన్నీళ్లు.. దొరికిపోయిన అమూల్య.. శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 12th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ కు కార్తీక్ వార్నింగ్ – జ్యోత్స్న ఎక్కడికి వెళ్లినట్టు..?           

Intinti Ramayanam Today Episode: పల్లవి మాస్టార్ ప్లాన్.. రంగంలోకి పోలీసులు.. అవని, కమల్ అరెస్ట్..

Big Stories

Advertisement
×