Aqib Javed: టీమిండియా వరుస ఓటములను చవిచూస్తున్న సంగతి తెలిసిందే. రెండు వారాల వ్యవధిలో రెండు సిరీస్ లు కోల్పోయింది. ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్ అయిన టీమిండియా… ఇంగ్లాండ్ చేతిలో 3-0 తేడాతో సిరీస్ కూడా కోల్పోయింది. శనివారం రోజున చిట్టచివరి టీ20 జరగనుంది. ఇందులో నువ్వు ఓడితే టీమిండియా కు మరో వైట్ వాష్ తప్పదు. ఇలాంటి క్రమంలో టీమిండియాను హేళన చేస్తూ పాకిస్తాన్ క్రికెటర్లు, మాజీలు రెచ్చిపోతున్నారు. లేటెస్ట్ గా పాకిస్తాన్ సెలక్టర్ ఆకిబ్ జావేద్ (Aqib Javed) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియా పతనం మొదలైందని… ఇక వాళ్లు గెలవడం కష్టమేనన్నారు. ఈ నేపథ్యంలో టీమిండియాను పాకిస్తాన్ ఎక్కడైనా ఓడించగలుగుతుందని వార్నింగ్ ఇచ్చారు. త్వరలో జరగబోయే ఏషియన్ గేమ్స్ లో కూడా టీమిండియా జట్టును చిత్తుగా ఓడిస్తామని వార్నింగ్ ఇచ్చారు ఆకిబ్ జావేద్.
వచ్చే సంవత్సరం జరిగే ఆసియా కప్ 2027, వన్డే వరల్డ్ కప్ 2027 లో కూడా టీమిండియాను ఓడించి ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు. తమ దెబ్బకు టీమిండియా ప్లేయర్లు డ్రెస్సింగ్ రూమ్ లోనే ఏడవాల్సి ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితులలో టీమిండియా కోరుకునే స్థితిలో లేదని.. ఇప్పుడే తాము దెబ్బ కొడతామని వార్నింగ్ ఇచ్చారు. గతంలో తమ పాకిస్తాన్ జట్టును టీం ఇండియా అత్యంత దారుణంగా ఓడించిందని.. ఇకపై ఆ పరిస్థితి ఉండబోతున్నారు. త్వరలోనే పాకిస్తాన్ కొత్త కెప్టెన్ గా బాబర్ ఆజం అన్ని ఫార్మాట్లకు బాధ్యతలు తీసుకుంటాడని.. అతడు వచ్చిన తర్వాత సీన్ వేరేలా ఉంటుందని వ్యాఖ్యానించారు పాకిస్తాన్ సెలక్టర్ ఆకిబ్ జావేద్ (Aqib Javed). బాబర్ సారధ్యంలోని పాకిస్తాన్… ఇకపై వరుస విజయాలతో దూసుకు వెళ్తుందన్నారు. ఆ దిశగా పాకిస్తాన్ క్రికెట్ జట్టును తయారు చేస్తున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ జాతీయ జట్టు సెలెక్టర్ ఆకిబ్ జావేద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
గతంలో టీమిండియా చేతిలో పాకిస్తాన్ చిత్తుగా ఓడింది. రెండు దేశాల మధ్య కేవలం గొడవల పరిస్థితుల నేపథ్యంలో ఐసీసీ నిర్వహిస్తున్న మ్యాచ్ లలో మాత్రమే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ క్రమంలో 2008 నుంచి రికార్డులు చూస్తే… ప్రతి మ్యాచ్ లో పాకిస్తాన్ పై టీమిండియానే విజయం సాధించింది. ఇటీవల కాలంలోనే ఆసియా కప్ 2025, చాంపియన్స్ ట్రోఫీ, టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లలో భాగంగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచులు జరిగాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టును చిత్తుగా ఓడించింది టీమిండియా.