Brahmamudi serial today Episode: రాత్రికి కావ్య తమ ఇంటి దగ్గరే ఉండమని రాజ్‌కు చెప్పడంతో రాజ్ గాలిలో తేలిపోతుంటాడు. దేవుడా నువ్వు ఉన్నావు స్వామి అంటూ తనలో తానే మాట్లాడుకుంటుంటాడు. ఇంతలో కావ్య వచ్చి రామ్ గారు ఇక్కడేం చేస్తున్నారు రండి అంటూ రూమ్‌లోకి తీసుకెళ్లి ఫైల్స్ రాజ్ ముందేసి ఇవే మీరు ఇవాళ స్టడీ చేయాల్సిన ఫైల్స్ అని చెప్తుంది. దీంతో రాజ్ ఇన్ని ఫైల్సా..? అంటూ దేవుడా నువ్వు లేవు స్వామి అంటూ మనసులో ఇరిటేటింగ్ గా ఫీలవుతుంటాడు. ఇంతలో కావ్య ఫైల్స్ అన్ని ఓపెన్ చేసి ఒక్కొక్క ఫైల్ గురించి వివరిస్తుంది. రాజ్ వింటుంటాడు. ఇంతలో కావ్య నిద్రపోతుంది. రాజ్ ఫైల్స్ అన్నీ చూస్తాడు. తెల్లారేసరికి రాజ్ కూడా నిద్రలోకి జారుకుంటాడు.
అపర్ణ, ఇంద్రాదేవి వచ్చి డోర్ తెరవగానే కావ్య ఒళ్లో రాజ్ తల పెట్టుకుని పడుకుని ఉంటారు. ఇంద్రాదేవి నవ్వుకుంటూ కళావతి, ఓరేయ్ మనవడా లేవరా..? అంటుంది. ఇద్దరూ నిద్ర లేచి సిగ్గుపడుతుంటారు. ట్రైనింగ్ అన్నారు ఇద్దరు ఏం చేస్తున్నారు అని ఇంద్రాదేవి అడగ్గానే.. అమ్మమ్మ నాకు ఆఫీసకు టైం అవుతుంది వెళ్లాలి అని చెప్పి వెళ్లిపోతుంది. రాజ్ కూడా తనకు ఆఫీసకు టైం అవుతుందని చెప్పి వెళ్లిపోతాడు.
అప్పు ఆఫీసుకు రెడీ అవుతుంది. ఇంతలో యామిని అరైంజ్ చేసిన మనిషి కాల్ చేసి తాను వాడికి డబ్బులు ఇద్దామనుకుంటున్నాను అవి మీ చేతుల మీదుగా ఇవ్వాలి అని చెప్తాడు. అప్పు తాను ఓ గంటలో ఆఫీసకు వస్తున్నానని కాల్ కట్ చేస్తుంది. ఇందులో కళ్యాణ్ వచ్చి ఏంటి పొట్టి పొద్దునే అంత చిరాకుగా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. ఏం లేదు కూచి మొన్న స్టేషన్ ముందు ఇద్దరు డబ్బుల గురించి గొడవ పడ్డారు. ఆ ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేశాను. ఇప్పుడు వాడు డబ్బులు ఇస్తాను అది నా చేతుల మీదుగానే ఇవ్వాలని అడిగాడు అని చెప్తుంది. దీంతో కళ్యాణ్ మీ పోలీసులు అందరూ ఇలాగే ఉంటారో.. నువ్వు మాత్రమే ఇలాగే ఉంటావో నాకు మాత్రం అర్థం కావడ లేదు పొట్టి అంటాడు కళ్యాణ్.
ఇప్పుడు ఏమైంది కూచి అని అప్పు అడుగుతుంది. దీంతో కళ్యాణ్ ఏం లేదు పొట్టి నువ్వు అందరి ప్లాబ్లమ్ సాల్వ్ చేస్తున్నావు కానీ నా ప్రాబ్లమ్ మాత్రం సాల్వ్ చేయడం లేదు అంటాడు. ఇప్పుడు నీకొచ్చిన ప్లాబ్లమ్ ఏంటి కూచి అని అడుగుతుంది అప్పు. ఏంటి ఏంటి నాకు ఏం ప్రాబ్లమ్ ఉందా..? కొత్తగా పెళ్లైన మొగుడు భార్యకు దూరంగా ఉండటం ఎంత నరకమో నీకేం తెలుసు పొట్టి ఒకసారి నా ప్లేస్‌లో ఉండి చూడు నా బాధేంటో తెలుస్తుంది అటూ కళ్యాణ్ బాధపడుతుంటే.. అప్పు మాత్రం పట్టించుకోకుండా నాకు డ్యూటీ టైం అవుతుంది నేను వెళ్తున్నాను అంటూ అప్పు వెళ్లిపోతుంది.
రాహుల్ గార్డెన్‌లో పని చేస్తుంటే స్వప్న వచ్చి చెత్తను ఇక్కడెందుకు వేస్తున్నావు అని అడుగుతుంది. అది పనోళ్లు తీస్తారులే అంటాడు రాహుల్. మరి నువ్వేంటి అని స్వప్న అడగ్గానే.. రాహుల్ నేనే తీస్తాను.. నేనే పనోడిని కదా అంటూ చెత్త తీసేస్తాడు. తర్వాత పని అయిపోయింది నేను వెళ్తున్నాను అంటూ వెళ్తుంటే స్వప్న కారు క్లీన్ చేయమని చెప్తుంది. అలాగే అన్ని పనులు స్వప్న దగ్గరుండి మరీ రాహుల్ చేత చేయిస్తుంది. ఇంతలో రుద్రాణి వచ్చి రాహుల్‌ను కోపంగా చూస్తుంది. దీంతో రాహుల్ బాధగా మమ్మీ అది మరీ బ్రహ్మ రాక్షసిలా ఉంది మమ్మీ నా చేత పనులననీ చేయించి నన్న చంపేసేలా ఉంది మమ్మీ అంటూ బాధపడుతుంటే కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు.
నువ్వు చేతులారా చేసుకున్నది నిన్ను వదిలిపెట్టదు అంటుంది రుద్రాణి. మమ్మీ నువ్వు కూడా అలాగే మాట్లాడతావేంటి..? నేనేమన్నా ఇలా అడ్డంగా దొరికిపోతానని ఎక్స్‌ఫెక్ట్ చేశానా..? అంటాడు రాహుల్. దొరక్కపోతే ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకున్నావా..? ఈడియట్.. మనలాగా ఆస్థి పిచ్చి ఉన్నవాళ్లకు ఆడదాని పిచ్చి ఉండకూడదురా ఉంటే అడ్డంగా ముంచేస్తారు అంటుంది రుద్రాణి. తప్పై పోయింది మమ్మీ ఈ ఒక్కసారికి నన్ను సేవ్ చేయ్ మమ్మీ అంటూ బతిమాలుతాడు రాహుల్. దీంతో రుద్రాణి సరే ఈ రోజు కంపెనీలో జరిగే మీటింగ్స్‌లో ఆ కావ్య పవర్స్ అన్ని పోతాయి. అప్పుడు వాళ్లు మనతో కాదు మనం వాళ్లతో ఆడుకోవచ్చు అంతవరకు ఓపిక పట్టు అని చెప్తుంది రుద్రాణి. సరే అంటాడు రాహుల్.
యామిని, సిద్దార్థ్‌కు ఫోన్ చేసి రాజ్ బోర్డు మీటింగ్‌కు వస్తున్నాడని చెప్తుంది. దీంతో సిద్దార్థ్ టెన్షన్ పడతాడు. వాడు చనిపోయాడు కదా..? వాడు ఉండగా నేను ఆ కంపెనీ వైపు కన్నెత్తి కూడా చూడలేను అంటూ భయపడతాడు. దీంతో యామిని నువ్వేం భయపడకు అంటూ రాజ్ గతం మర్చిపోయాడని.. రాజ్ నిన్ను ఏమీ చేయలేడని ధైర్యం చెప్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?