Kadapa crime news: కడప జిల్లా వేంపల్లెలో నిన్న రాత్రి ఉద్రిక్త పరిస్థితికి నెలకొంది. చింతల మడుగు పల్లికి చెందిన యువతి మిస్స్ అయ్యింది. గొర్రెలు కాసేందుకు అడవులకు వెళ్లిన యువతిపై ఐదుమంది యువకులు అత్యాచారానికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయిని రేప్ చేసి చంపేశారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే అడవి మొత్తం గాలించిన యువతి ఆచూకి దొరకలేదు. పోలీస్ స్టేషన్ బయట రోడ్డుపై తల్లిదండ్రులు నిరసన తెలిపారు. నిందితుడిని అప్పగించాలంటూ కుటుంబ సభ్యలు పోలీస్ స్టేషన్ పై దాడికి దిగారు.
యువతిపై అత్యాచారం..
వేంపల్లెలో యువతి మిస్సింగ్ ఘటనలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిన్న ఉదయం గొర్రెలు మేపేందుకు అడవిలోకి వెళ్ళిన యువతి.. మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోవడంతో.. ఒక్కసారిగా ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు సమీపంలోని అడవిలో వెతకడం ప్రారంభించారు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది యువతి కోసం అడవిలోకి వెళ్ళిన యువకులు ఎవరు..
రిమ్స్‌కు హాస్పిటల్‌కు తరలించిన స్థానికులు..
గొర్రెలు మేపుతున్న యువతిని ఐదు మంది యువకులు ఫాలో అవుతు అడవి లోనే దుశ్చర్యకు పాల్పడినట్లు సమాచారం. మద్యాహ్నం నుంచి యువతి కోసం రాత్రి వరకు అడవి మొత్తం గాలించి చివరికి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. చివరికి రాత్రి 11 గంటల సమయంలో యువతి నడవలేని స్థితిలో ఆమెను చూసి.. అక్కడి నుంచి వెళుతున్న ఒక రైతు గుర్తించి కుటుంబం సభ్యులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులతో ఘటనా స్థలానికి చేరుకొని రిమ్స్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. యువతి ఒంటిపై ఘాయాలతో పాటు బట్టలు సైతం చిరిగినట్లు గుర్తించారు. అడవిలో ఒక యువకుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు..
Also Read: భారతీయులకు UAE బంపర్ ఆఫర్
రిమ్స్‌లో చికిత్స పొందుతున్న యువతి ఆరోగ్యం కుదుట పడ్డాక పూర్తి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పట్టుబడిన యువకులు ఎవరు ఎందుకు అడిలోకి వచ్చారు యువతితో ఆ యువకుల్లో ముందుగా పరిచయం ఉందా పోలీస్ విచారణలో వెలుగు చూడాలి..