Amaravati: ఏపీ రాజధాని అమరావతిలో పనులు ఎంతవరకు వచ్చాయి? ఈ ఏడాది చివరినాటికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్ ఓపెన్ కానుందా? ప్రస్తుతం డెకరేషన్ పనుల్లో కార్మికులు నిమగ్నమయ్యారా? ఎమ్మెల్యే టవర్‌లో లోపలి దృశ్యాలు కళ్లు చెదిరేలా ఉన్నాయా? అవుననే అంటున్నారు చాలామంది అధికారులు.
రాజధాని అమరావతిలో ప్రభుత్వం తలపెట్టిన పనులు ఒకొక్కటిగా పూర్తి అవుతున్నాయి. వైసీపీ అధికారంలోకి రాకముందే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్ల నిర్మాణం దాదాపు 80 శాతం పూర్తి అయ్యాయి. మిగతా పనులు కూటమి అధికారంలోకి రాగానే శర వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం టవర్లలో డెకరేషన్ పనులు జరుగుతున్నాయి.
టవర్‌లో లోపలి దృశ్యాలు బయటకు వచ్చాయి. విశాలమైన గదులు, మోడ్రన్ టెక్నాలజీ వంటి అందులో కనిపించాయి. పూజా గదికి వెళ్లే ముందు ఎల్ఈడీ స్క్రీన్ సైతం ఏర్పాట్లు చేశారు. ఫ్యాన్లు, ఏసీలను బిగించేశారు. మరో రెండు మూడు నెలల్ల ఆయా పనులు పూర్తి కావచ్చని సంబంధిత కాంట్రాక్టర్ చెబుతున్నాడు.
ఈ ఏడాది చివరలో శాసనసభ్యుల టవర్‌ని ప్రారంభిస్తారా? లేక అసెంబ్లీ నిర్మాణం పూర్తి అయిన తర్వాత అంతా ఒకేసారి ఓపెన్ చేస్తారా? అనేది ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్. ఎందుకంటే నేతలు టవర్స్‌లోకి దిగితే ఆ ప్రాంతం రద్దీగా మారుతుందని, నిర్మాణాల యాక్టివిటీ పెరుగుతోందని అంటున్నారు. ఎమ్మెల్యే టవర్‌తోపాటు ఐఏఎస్ అధికారుల రెడీ అయితే రెండు ఒక్కసారి ఓపెన్ చేస్తారని అంటున్నారు.
ALSO READ: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇంటికిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి
కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ టవర్ల పనులు పెండింగ్‌లో పడ్డాయి. ఈ టవర్లపై ఇప్పటివరకు రూ.444.05 కోట్లు వెచ్చించింది సీఆర్‌డీఏ. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారుల టవర్స్.. సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన 12 అంతస్తులతో 18 టవర్లు రెడీ అవుతున్నాయి.
తొమ్మిది నెలల్లోగా ఆయా టవర్లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఈ టవర్లపై ఇప్పటి వరకు సీఆర్‌డీఏ రూ.444.05 కోట్లు వెచ్చించింది. ప్రభుత్వం నిర్ధేశించిన గడువులో దాదాపు ఆరునెలలు గడిచాయి. కేవలం మరో మూడు నెలలు మాత్రమే ఉన్నాయి. ఈలోగా టవర్స్ పనులు పూర్తికావడం ఖాయమని అంటున్నారు.
రాజధాని నిర్మాణ పనులు రేయింబవళ్లు తేడా లేకుండా పనులు జరుగుతున్నాయి. నిలిచిపోయిన ప్రభుత్వ భవనాలు, రోడ్ల నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వేలాది మంది కార్మికులు పనుల్లో నిమగ్నమయ్యారు. బెంగాల్, తెలంగాణ, బీహార్, ఒడిశా కార్మికులు ఉన్నారు.
సీడ్ యాక్సెస్ రహదారి పక్కన భూగర్భ విద్యుత్ కేబుళ్ల ఏర్పాటుకు హెచ్‌డీపీఈ సిలికాన్ పైపుల నిర్మాణం జరుగుతోంది. ఉద్ధండరాయునిపాలెం వద్ద సీడ్ యాక్సెస్ రహదారి పక్కన గుత్తేదారు సంస్థ ఆయా పనులను చేపట్టింది. ఐదు పైపులను ఒకదానిపై ఒకటి లేయర్లుగా అమర్చుతున్నారు.
వంద శాతం పూర్తి అయిన MLA MLC భవనాల్లో ఒక్కటి…
భవనం యొక్క లోపలి దృశ్యాలు.. 👇👇#ChandrababuNaidu #AndhraPradesh #TDPTwitter pic.twitter.com/labXZ8ckfT
— 𝗧𝗗𝗣 𝗧𝗿𝗲𝗻𝗱𝘀 (@Trends4TDP) July 7, 2025