Brahmamudi serial today Episode: ఇంతలో ప్రిన్సిపాల్ ఎందుకు ఇలా వచ్చారు అని అడుగుతుంది. యామిని యాక్సిడెంట్ గురించి చెప్పి కొంచెం చేంజ్ కావాలని ఇలా తీసుకొచ్చానని చెప్తుంది. ఇంతలో ప్రిన్సిపాల్ ఒక ఫోటో తీసుకొచ్చి రామ్ నీకు వీళ్లందరూ గుర్తున్నారా..? అని అడుగుతుంది. లేదు మేడం నాకెవ్వరూ గుర్తు రావడం లేదు నాకు అంతా కొత్తగానే కనిపిస్తున్నారు అంటాడు రాజ్. దీంతో యామిని బావ ఇది నువ్వు ఇది నేను.. ఇదేమో మన ఫ్రెండ్ లాస్య, ఇదిగో ఇది పూజిత వీడు లడ్డుగాడు బావ చాలా అల్లరి చేసేవాడు అని చెప్తుంటే.. కిటికీలోంచి చూస్తున్న కావ్య.. ఆయనకు గతం గుర్తు లేదని నీకు నచ్చిన గతాన్ని గుర్తు చేస్తూ ఒక బొమ్మలా ఆడుకుంటున్నావు యామిని నిన్ను వదిలిపెట్టను అని మనసులో అనుకుంటుంది. రాజ్ సారీ యామిని నిజంగానే వీళ్లెవరూ నాకు గుర్తు రావడం లేదు. అని చెప్పగానే.. యామిని పర్లేదులే బావ నువ్వు వీళ్లందరినీ గుర్తు పట్టమని ఫోర్స్ చేయడం లేదు. జస్ట్ నీకు ఓల్డ్ మెమెరీ గుర్తు రావడం కోసం ఇక్కడికి తీసుకువచ్చాను అనగానే.. ప్రిన్సిపాల్ సైగ చేయగానే.. యామిని బావ ఇక మనం వెళ్దామా అంటుది.
రాజ్ సరే అంటూ బయటకు రాగానే.. యామిని బావ నీకు ఇక్కడ ఇంకో సర్‌ఫ్రైజ్ ఉంది అంటూ అక్కడే తన కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారు అంటూ వాళ్ల దగ్గరకు తీసుకెళ్లి పరిచయం చేస్తుంది. వాళ్లు ఏవేవో మాట్లాడుతుంటే.. రాజ్ మాత్రం తనకు ఏదీ గుర్తు రావడం లేదని ఇక వెళ్దామా..? అని రాజ్ అడగ్గానే.. సరే వెళ్దాం కానీ మీ మామ్ డాడీ గురించి అడిగావు కదా..? వాళ్లను కలుద్దామా..? అంటుంది.. రాజ్ కూడా ఎగ్జైటింగ్ గా సరే అంటాడు. దూరం నుంచి చూస్తున్న కావ్య ఇదేదో పెద్ద ప్లాన్ వేసింది ఫాలో కావాలి అనుకుంటుంది. యామిని ఒక దగ్గరకు తీసుకెళ్లగానే.. రాజ్ ఇక్కడికి తీసుకొచ్చావేంటి అని అడుగుతుంది. దీంతో యామిని బావ ఇది మన ఫాం హౌస్ అని చెప్పి రెండు సమాధుల దగ్గరకు తీసుకెళ్తుంది. ఈ సమాధులను చూస్తుంటే నీకేమైనా గుర్తు వస్తుందా..? బావ అని అడుగుతుంది. లేదని రాజ్ చెప్పగానే.. నీకు చెప్పాను కదా మీ మామ్ డాడ్ ని పరియచం చేస్తానని అదిగో వీళ్లే.. అంటూ చెప్పగానే.. దూరం నుంచి చూస్తున్న కావ్య మా అత్తయ్య మామయ్యలను నీ స్వార్థం కోసం చంపేస్తావా అనుకుంటుంది.
మనం చిన్నపిల్లల్లా ఉన్నప్పుడే మీ అమ్మా నాన్నా యాక్సిడెంట్‌లో చనిపోయారు. మా అమ్మా నీకు సొంతం మేనత్త అందుకే నిన్ను సొంత కొడుకులా పెంచింది అని యామిని చెప్పగానే.. రాజ్ మా అమ్మా నాన్నా చనిపోయారన్న ఆలోచన కానీ, దానికి సబంధించిన జ్ఞాపకాలు కానీ ఏవీ గుర్తు రావడం లేదు అంటాడు. దీంతో యామిని ఇన్నేళ్లు కలిసి పెరిగిన నేనే నీకు గుర్తు రావడం లేదు. కానీ ఎప్పుడో చనిపోయిన మీ అమ్మా నాన్నాలు ఎలా గుర్తుకు వస్తారు బావ. నువ్వుంటే మా మామ్ డాడ్‌కు చాలా ఇష్టం. మనిద్దరికి కూడా ఒక్కళ్లంటే ఒక్కరికి చాలా ఇష్టం పెరిగింది. ఆ ఇష్టంతోనే ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ ఆరు నెలల క్రితం జరిగిన యాక్సిడెంట్ వల్ల మళ్లీ నేను నీకు అన్ని కొత్తగా పరిచయం చేయాల్సి వస్తుంది అంటూ చెప్పగానే.. కావ్య మాత్రం ఆరు నెలల క్రితం యాక్సిడెంటా..? చిన్నప్పుడే అమ్మా నాన్నా చనిపోవడం ఏంటివన్ని.. ఆయన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావే అని తిట్టుకుంటుంది. ఇంతలో రాజ్ నాకు తల నొప్పిగా ఉంది అని చెప్పగానే.. సరే బావ ఈ పూల దండ మీ అమ్మా నాన్నలకు వేయి అని యామిని చెప్పగానే.. పూల దండ వేయబోయి రాజ్ ఆగి యామిని నాకేమీ గుర్తు రావడం లేదు. మనం ఇక్కడి నుంచి వెళ్దాం పద అంటాడు. దూరం నుంచి చూస్తున్న కావ్య.. ఆయన్ని నీ సొంతం చేసుకోవడం కోసం ఎన్ని నాటకాలు ఆడుతున్నావే అని తిట్టుకుంటుంది. నీ నాటకం ఆయన తెలుసుకోకపోవచ్చు కానీ నీ నుంచి ఆయన్ని ఎలా కాపాడుకోవాలో.. ఎలా రక్షించుకోవాలో నాకు బాగా తెలుసు అనుకుంటుంది. రాజ్ ఇంతలో పూల దండ పక్కన పడేసి వెళ్లిపోతాడు.
ఇంతలో కావ్యకు అప్పు ఫోన్ చేస్తుంది. అక్కా నా పని అయిపోయింది అని చెప్పగానే.. ఇక్కడ నా పని కూడా అయిపోయింది అని చెప్పగానే.. కలిశావా వాళ్లను అని అప్పు అడగ్గానే.. కలవడమే కాదు.. చాలా తెలుసుకున్నాను. నువ్వు ఇంటికి రా.. అన్ని మాట్లాడుకుందాం అంటుంది.
దుగ్గిరాల ఇంటికి పిచ్చాసుపత్రి నుంచి డాక్టర్లు వస్తారు. అందరూ బాధగా కూర్చుని ఉంటే.. పేషెంట్ ఎక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న పేషెంట్ ఎక్కడ అంటూ హడావిడి చేస్తుంటే.. ప్రకాష్ ఎవరు మీరంతా అని అడగ్గానే.. మానసిక సమస్యతో ఇబ్బంది పడుతున్న పేషెంట్ మీ ఇంట్లో ఇబ్బంది పెడుతుంది అన్నారు. ఇంతకీ పేషెంట్ ఎక్కడ అని అడుగుతారు. దీంతో సుభాష్ మీకు ఫోన్ చేసింది ఎవరు అని అడుగుతాడు. రుద్రాణి నేనే అన్నయ్యా అని చెప్తుంది. సుభాష్ కోపంగా నీకసలు బుద్దుందా..? ఇలాంటి పని చేసి ఇంటి పరువు తీస్తావా..? అనగానే.. రుద్రాణి పరువు తీస్తుంది నేను కాదు అన్నయ్యా.. అదిగో వస్తుందిగా ఈ ఇంటి ముద్దుల కోడలు ఆవిడ తీస్తుంది అని చెప్తుంది. ఏంటి కావ్య అలా చూస్తున్నావు.. రాజ్‌ను తీసుకొస్తానని చెప్పావు రాజ్ ఎక్కడున్నాడు. అలిగి కారులో కూర్చున్నాడా..? కనీసం నువ్వైన చూశావా..? అంటూ వెటకారంగా అడుగుతుంది.
దీంతో కావ్య చూశాను అంటుంది. దీంతో రుద్రాణి అదేంటో నీ కళ్లకే కనిపిస్తున్నాడు.. మాకు కళ్లకు కనిపించడం లేదేంటి..? మా కళ్లేమైనా పాడయ్యాయా..? సరే నువ్వు చూసిన ఆ రాజ్ ఎక్కడున్నాడు అని అడుగుతుంది. కావ్య ఏం చెప్పకుండా అలాగే ఉండిపోతుంది. ఎందుక ఏం చెప్పడం లేదు అని అడుగుతుంది రుద్రాణి. దీంతో కావ్య ఆయన బతికే ఉన్నాడు.. తప్పకుండా ఆయన ఒక రోజు మీ ముందుకు వస్తాడు. అని చెప్తుంది. దీంతో ఎప్పుడొస్తాడో చెప్పు అని రుద్రాణి అడగ్గానే.. సరిగ్గా ముఫ్పై రోజుల్లో తీసుకొస్తాను అని చెప్తుంది. దీంతో తీసుకురాకపోతే ఏంటి అని రుద్రాణి అడగ్గానే.. తీసుకురాకపోతే మీరు ప్లాన్ చేసినట్టుగానే ఆయన ఫోటోకు దండేసి దీపం పెట్టి.. నన్ను హాస్పిటల్‌కు పంపించి మీరే ఈ ఇంట్లో రాజ్యమేలుకోండి అని చెప్పి వెళ్లిపోతుంది కావ్య. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?