Jio Free Cloud Storage: రిలయన్స్ జియో టెలికాం రంగంలో కొత్త కొత్త ఆవిష్కరణలతో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకట్టుకునేందుకు అనేక ప్లాన్లను ప్రవేశపెడుతోంది. తాజాగా జియో తన వినియోగదారులకు ఒక అద్భుతమైన ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఇకపై రీఛార్జ్ ప్లాన్‌లతో పాటు ఉచిత AI క్లౌడ్ స్టోరేజ్‌ను అందించనున్నట్లు తెలిపింది. ఈ AI క్లౌడ్ స్టోరేజ్ సేవలు ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ కస్టమర్‌లకు అందుబాటులో ఉంటాయి. 2024 AGM సమయంలో ప్రకటించబడిన ఈ ఫీచర్, ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.
AI క్లౌడ్ స్టోరేజ్
జియో, తన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం ఈ AI క్లౌడ్ స్టోరేజ్ సేవను ప్రవేశపెట్టింది. దీని ద్వారా వినియోగదారులకు 100GB వరకు క్లౌడ్ స్టోరేజ్‌ను అందిస్తారు. ప్రస్తుతానికి, జియో కొన్ని రీచార్జ్ ప్లాన్లతో 50GB AI క్లౌడ్ స్టోరేజ్‌ను ఉచితంగా అందిస్తోంది.
AI క్లౌడ్ స్టోరేజ్‌ను ఎలా పొందాలి?
జియో వివిధ రీచార్జ్ ప్లాన్లలో AI క్లౌడ్ స్టోరేజ్‌ను ఉచితంగా అందిస్తోంది. ముఖ్యంగా, వార్షిక రీచార్జ్ ప్లాన్లు కొనుగోలు చేసే వినియోగదారులు 50GB వరకు స్టోరేజ్‌ను పొందవచ్చు.
Read Also: Ugadi Special Offer: ఉగాది ప్రత్యేక ఆఫర్..రూ.4 వేలకే …
AI క్లౌడ్ స్టోరేజ్ అందించే ప్రధాన ప్లాన్లు
-రూ. 999 ప్లాన్: 98 రోజుల చెల్లింపు కాలం + 50GB AI క్లౌడ్ స్టోరేజ్
-రూ. 899 ప్లాన్: 90 రోజుల చెల్లింపు కాలం + 50GB AI క్లౌడ్ స్టోరేజ్
-రూ. 1299 ప్లాన్: 50GB AI క్లౌడ్ స్టోరేజ్ + నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్
-రూ. 1029 ప్లాన్: 50GB AI క్లౌడ్ స్టోరేజ్ + అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్
ఈ ప్లాన్లు, వినియోగదారులకు అదనపు లాభాలను అందించడంతోపాటు డేటా స్టోరేజ్ సమస్యను పరిష్కరించేందుకు ఉపయోగపడతాయి.
AI క్లౌడ్ స్టోరేజ్ ప్రయోజనాలు
-AI క్లౌడ్ స్టోరేజ్ సేవ, వినియోగదారులకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి
-తక్కువ స్టోరేజ్ సమస్యకు పరిష్కారం – తక్కువ స్టోరేజ్ ఉన్న మొబైల్ వినియోగదారులకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను క్లౌడ్‌లో భద్రపరచుకోవచ్చు.
-ఎక్కడినుండైనా యాక్సెస్ – క్లౌడ్ స్టోరేజ్ ద్వారా, వినియోగదారులు ఎక్కడినుండైనా తమ డేటాను యాక్సెస్ చేసుకోవచ్చు.
-ఆన్‌లైన్ డేటా భద్రత – క్లౌడ్‌లో నిల్వ చేసిన డేటా సురక్షితంగా ఉంటుంది.
-పనితీరును మెరుగుపరచడం – ఫోన్ మెమరీలో నిల్వ తగ్గడం వల్ల ఫోన్ వేగం తగ్గుతుందనే భయం ఉండదు.
-కంప్యూటింగ్ పవర్‌తో కూడిన స్టోరేజ్ – AI ఆధారిత క్లౌడ్ స్టోరేజ్ అధునాతన ఫైల్ మేనేజ్‌మెంట్ ఫీచర్లను అందిస్తుంది.
టెలికాం రంగంలో వినూత్న సేవలు
జియో, టెలికాం రంగంలో ఈ కొత్త సాంకేతికతలను ప్రవేశపెట్టడం ద్వారా వినియోగదారులకు మరిన్ని సౌకర్యాలు లభించనున్నాయి. ఈ AI క్లౌడ్ స్టోరేజ్ సేవలను భారతదేశంలో మొట్టమొదటిసారిగా జియోనే అందించడం విశేషం..
మరిన్ని సేవలు
దీంతోపాటు జియో కస్టమర్లకు అందించే మరిన్ని సేవలను కూడా అందిస్తోంది. వాటిలో జియోఫైబర్, జియో టీవీ & జియో సినిమా ఇవి వినోదం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్లాట్‌ఫామ్‌లు. జియో ఫైనాన్స్, డిజిటల్ పేమెంట్ & ఫైనాన్షియల్ సేవలు అందుబాటులో ఉన్నాయి.