E-Paper
Advertisement

Brahmamudi Serial Today May 17th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రుద్రాణి ప్లాన్‌ సక్సెస్‌ – ఇంట్లో ఉండకుండా ఆఫీసుకు బయలుదేరిన కావ్య

Brahmamudi Serial Today May 17th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రుద్రాణి ప్లాన్‌ సక్సెస్‌ – ఇంట్లో ఉండకుండా ఆఫీసుకు బయలుదేరిన కావ్య
Advertisement

Brahmamudi serial today Episode: అప్పు ఆఫీసుకు వెళ్తుంటే ధాన్యలక్ష్మీ వచ్చి ఆపేస్తుంది. దీంతో ఇంద్రాదేవి ధాన్యలక్ష్మీని తిడుతుంది. అఫీసుకు వెళ్తుంటే ఆపుతున్నావేంటి…? ఏదైనా ఉంటే  ఇంట్లో ఉన్నప్పుడు అడగలేవా..?  అంటుంది. దీంతో ధాన్యలక్ష్మీ నేను కూడా ఈ ఇంట్లో ఏ శుభకార్యం జరగలేదనే తనను ఆగమన్నాను అత్తయ్యా అంటుంది. ఇప్పుడు ఏం జరిగిందని అలా కోపంగా ఉన్నావు అంటుంది అపర్ణ. దీంతో ధాన్యలక్ష్మీ మీ అందరికీ పైకి కనిపించే నవ్వులే కనిపిస్తున్నాయి కానీ నా కొడుకు అనుభవిస్తున్న బాధ ఎవ్వరికీ తెలియడం లేదు అని చెప్తుంది.

దీంతో కళ్యాణ్‌ నేను ఎక్కడ బాధపడుతున్నాను అమ్మా సంతోషంగానే ఉన్నాను కదా అంటాడు. ధాన్యలక్ష్మీ కోపంగా చాల్లే నోరు మూయ్‌.. నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో రాత్రి నేను కళ్లారా చూశాను అంటుంది. దీంతో ఇప్పుడు దానికి గొడవ చేయాలనుకుంటున్నావా..? అని కళ్యాణ్‌ అడగ్గానే.. నిజం తెలుసుకోవాలనుకుంటున్నాను అంటుంది ధాన్యలక్ష్మీ.. ఇంద్రాదేవి కల్పంచుకుని ఆఫీసుకు వెళ్తున్న అమ్మాయిన ఆపి గొడవ చేయాలనుకోవడం ఏంటి.? అసలు నీకేం కావాలి అని అడుగుతుంది. దీంతో నా కొడుక్కు న్యాయం కావాలి. వాడు సక్రమంగా కాపురం చేయాలి. పిల్లలను కనాలి అదే నాకు కావాలి. అదేమో ఉద్యోగం పేరుతో పగలు రాత్రి తేడా లేకుండా తిరుగుతుంది. వీడేమో దాని కోసం పస్తులు పడుకుంటున్నాడు. ఇలా అయితే వీళ్లు ఎప్పుడు కాపురం చేస్తారు ఎప్పుడు పిల్లలను కంటారు అంటూ నిలదీస్తుంది. అయితే ఇప్పుడు వాళ్లు ఏం చేయాలని కోరుకుంటున్నావు అని సుభాష్ అడగ్గానే.. అప్పు పోలీస్‌ జాబ్‌ మానేయాలి.. ఈ ఇంటి కోడలుగా బుద్దిగా ఇంట్లో ఉండి నా కొడుకు ఆలనా పాలనా చూసుకోవాలి. అని చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు. అందరూ ధాన్యలక్ష్మీని తిడతారు. ధాన్యలక్ష్మీ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కళ్యాణ్‌ను అపర్ణ అభినందిస్తుంది. ఓరేయ్‌ కళ్యాణ్‌ ఆడదాని మనసు తెలుసుకుని ప్రవర్తించే మొగుడు దొరకడం చాలా అదృష్టం మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండండి అని చెప్తుంది.

Advertisement

 

రుద్రాణి ఆఫీసులో ఉన్న సతీష్‌కు ఫోన్‌ చేసి నువ్వే ఎలాగైనా కావ్యను శంషాబాద్‌ బ్రాంచ్‌కు రమ్మని కాల్ చేయ్‌ అని చెప్తుంది. సతీస్‌ బయపడుతుంటే లక్ష రూపాయలు తీసుకున్నావు ఈ చిన్న పని చేయలేవా..? అంటూ రుద్రాణి తిట్టగానే.. సతీస్‌ సరే మేడం అంటూ కాల్ కట్‌ చేస్తాడు. కావ్య ఆఫీసుకు వెళ్లడానికి రెడీ అవుతుంది. ఇంతలో సతీష్‌  కాల్ చేసి మేడం మీరు అర్జెంట్‌గా ఆఫీసుకు రావాలి అని చెప్తాడు. కావ్య ఎందుకు అని అడగ్గానే.. నిన్న రావాల్సిన రా మెటిరీయల్‌ రాలేదు మేడం ప్రొడక్షన్‌ ఆగిపోయింది అని సతీష్‌ చెప్పగానే.. అదేంటి రా మెటీరియల్‌ డెలివరీ చేసినట్టుగా నాకు మెసేజ్‌ వచ్చింది అని కావ్య అడగ్గానే. సెక్యూరిటీ క్లియరెన్స్‌ లో ఏదో ప్రాబ్లమ్‌ వచ్చి బయటే ఆగిపోయింది మేడం అని సతీష్‌ చెప్పగానే సెక్యూరిటీ క్లియరెన్సా..?  వాళ్లెందుకు ఆపుతారు.. నేను సెక్యూరిటీ ఇంచార్జ్‌ కిషోర్‌తో మాట్లాడతాను అని చెప్పగానే.. మేడం ఆయన  లీవ్‌లో ఉన్నాడు అని చెప్పగానే అయితే ఫోన్‌ చేస్తాను అంటుంది కావ్య ఆయన ఫోన్‌ స్విచ్చాప్‌ లో ఉంది మేడం అని సతీస్ చెప్పగానే కావ్య సరే వస్తున్నాను అని చెప్తుంది. చాటు నుంచి వింటున్న రుద్రాణి హ్యాపీగా ఫీలవుతుంది. కిందకు వెళ్లిన కావ్యను ఆఫీసుకు వెళ్లకుండా అందరూ కలిసి ఆపేస్తారు. ఇక కోడలిని ఆపగలిగాము కానీ కొడుకు ఇంకా రాలేదేంటి అత్తయ్యా అంటుంది అపర్ణ. వస్తాడులే ఆ యామినిని దాటుకుని వచ్చేసరికి టైం పడుతుంది కదా అని చెప్తుంది ఇంద్రాదేవి.

Advertisement

కావ్య ఆగిపోవడంతో రూంలోకి వెళ్లి రుద్రాణి ఇరిటేటింగ్‌ గా ఫీలవుతుంది. ఇంతలో యామిని కాల్ చేసి కావ్యను పంపించేశారా.. అని అడుగుతుంది. కుదరలేదు.. నేను ప్లాన్‌ చేశాను మా అన్నయ్యలు ఫెయిల్ చేశారు అని చెప్తుంది. దీంతో యామిని కోపంగా రుద్రాణిని తిడుతుంది. దీంతో ఆ ప్లాన్‌ ఫెయిల్‌ అయితేనేం మరో ప్లాన్‌ ఉంది. అని రాజ్‌ ఇక్కడిక రాగానే కావ్య పెళ్లి బట్ట్లో ఉన్న ఫోటో చూపిస్తాను అని చెప్తుంది. ఇదంతా చాటు నుంచి స్వప్న వింటుంది. అమ్మా నా అత్తా వెనకుండి కైకేయిలా ఇంత నాటకం నడిపిస్తున్నావా..? నా చెల్లెలు ఫోటో రాజ్‌కు  చూపించి ఇరికించాలి అనుకుంటున్నావా..? నిన్నెలా ఇరికిస్తానో చూడు అని మనసులో అనుకుంటుంది.

రాజ్‌ కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. ఇంతలో రాజ్‌ వచ్చి అపర్ణ దగ్గర సిగ్గు పడుతుంటే.. లేటుగా రావడమే కాకుండా మళ్లీ సిగ్గు పడుతున్నావా..? అంటుంది. నా ప్రాబ్లమ్స్‌ నాకున్నాయి.. నువ్వే అర్థం చేసుకోవాలి కదమ్మా అంటాడు రాజ్‌. ఇంతలో కావ్య వచ్చి మళ్లీ ఎందుకొచ్చావు అని అడుగుతుంది. నిన్నే చెప్పాను కదా..? ఇవాళ వస్తానని అనగానే కావ్య ఇదేదో నీ సొంతిల్లులా మాట్లాడుతున్నావేంటి అంటుంది. మీ వాళ్లందరూ దత్తత తీసుకుంటున్నారు తెలుసా..? అంటాడు ఇంతలో రుద్రాణి వచ్చి గతం మర్చిపోయిన క్యారెక్టర్‌ మర్చిపోలేదు అంటుంది. రుద్రాణి మాటలకు రాజ్‌ షాక్‌ అవుతాడు.  ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Tags

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×