Serial Actor : బుల్లితెర పై ఎన్నో ఛానెల్స్ సీరియల్స్ ను ప్రసారం చేస్తున్నాయి. అందులో తెలుగు ఛానల్ అయినా స్టార్ మా ఎన్నో హిట్ సిరియల్స్ ని ప్రసారం చేస్తుంది.. ఇప్పుడు వరకు ఈ ఛానల్ లో వచ్చిన ప్రతి సీరియల్ మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి. ఇందులో సక్సెస్ఫుల్గా ప్రచారం అయ్యి రీసెంట్గా శుభం కార్డు పడిన సీరియల్ సత్యభామ.. ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రేమతో పాటు కుటుంబ విలువలకు ఇచ్చే గౌరవం గురించి ఇందులో చూపించారు.. కన్నతండ్రి కోసం ఓ కొడుకు పడే ఆవేదన ఈ సీరియల్ స్టోరీ.. ఇందులో హీరోయిన్ సత్యభామ పాత్రలో కన్నడ బ్యూటీ దెబ్జాని నటించింది. తన అందం, క్యూట్ నెస్ తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. హీరోయిన్ మెటీరియల్ అయిన ఈ అమ్మడు బుల్లితెరపై వరుస సీరియల్స్లలో నటిస్తూ బిజీగా ఉంది. ఈమె ఒక్క రోజుకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందా అని తెలుగు ప్రేక్షకుల్లో ఒక చర్చ నడుస్తుంది.. మరి ఈ ముద్దుగుమ్మ ఒక్క రోజుకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
కన్నడ బ్యూటీ రెమ్యూనరేషన్..
టాప్ హీరోల సినిమాలకు మించి సీరియల్స్ రేటింగ్ సాధిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. స్టార్ మా సీరియల్స్‌లో ఒకటైన సత్యభామకు మహిళా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇందులో సత్యగా లీడ్ రోల్‌లో నటించారు దేబ్జానీ మోదక్. ఈ సీరియల్కు ఈమధ్య శుభం కార్డు పడిందే.. భర్తను గొడవల నుంచి కాపాడుకునేలా తన వంతు ప్రయత్నం చేసే ఒక భార్య పాత్రలో ఈ అమ్మడు నటించింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ కూడా వచ్చింది. ఆ సీరియలు మంచి హిట్ అవడంతో ఈ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అయింది. రీసెంట్గా పూర్తయిన సత్యభామ సీరియల్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. ఈ సీరియల్ లో సత్య పాత్ర ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ సీరియల్ లో ఏమైనా నటించినందుకు గాను ఒక రోజుకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో అన్నది ఇక్కడ ఆసక్తిగా మారింది.. ఒక రోజుకు రూ. 20 వేల చొప్పున పారితోషికంగా తీసుకుంటున్నట్లుగా బుల్లితెర వర్గాల టాక్. దాదాపు నెలలో 25 రోజుల పైనే షూటింగ్‌లో పాల్గొనే దేబ్జానీ నెలకు సుమారు రూ. 7 లక్షల వరకు సంపాదిస్తున్నట్లుగా తెలుస్తోంది.. ప్రస్తుతం మరో రెండు సీరియల్లో ఏమైనా నటించబోతున్నట్లు తెలుస్తుంది.
Also Read :భారీ ధరకు కుబేర డిజిటల్ రైట్స్.. ఏ ఓటీటీలోకి వస్తుందంటే..?
దెబ్జానీ పర్సనల్ లైఫ్..
ఈ క్యూటీ బెంగాలీ ముద్దుగుమ్మ.. కోల్‌కతాలోని సెయింట్ జాన్స్ డియోసిసన్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. ప్లస్ 2 తర్వాత నటన వైపు రావడంతో కరస్పాండెన్స్ ద్వారా బీఏ ఇంగ్లీష్ హానర్స్ పూర్తి చేశారు దేబ్జానీ. 2013లో నాకౌట్ అనే బెంగాలీ సినిమాతో దేబ్జానీ వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. తర్వాత గ్యాంగ్‌స్టర్ కింగ్, క్లాప్ స్టిక్ వంటి సినిమాల్లో నటించారు. ఈ క్రమంలో బెంగాలీ సీరియల్స్‌లో అవకాశం రావడంతో అటు వైపు వెళ్లి బుల్లితెరపై స్టార్‌గా ఎదిగారు.. సౌత్ లో కూడా వరుసగా అవకాశాలు రావడంతో ముందుగా తమిళ చిత్రాలలో నటించింది. అనంతరం స్టార్ మాలో టెలికాస్ట్ అయిన ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్‌తో తెలుగువారిని పలకరించారు. ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ఒక సీరియల్ చేస్తుందని తెలుస్తుంది. అలాగే జెమినీలో కూడా రెండు మూడు సీరియల్స్ కి సైన్ చేసినట్లు తెలుస్తుంది.. త్వరలోనే ఆ సీరియల్స్ గురించి తెలిసే అవకాశం ఉంది..