BigTV English
Advertisement

Brahmamudi Serial Today October 30th: ‘బ్రహ్మముడి’ సీరియల్:   అరవింద్‌ తో డీల్‌ సెట్‌ చేసిన కావ్య – అనామికను దెబ్బ కొట్టేందుకు కావ్య ప్లాన్‌

Brahmamudi Serial Today October 30th: ‘బ్రహ్మముడి’ సీరియల్:   అరవింద్‌ తో డీల్‌ సెట్‌ చేసిన కావ్య – అనామికను దెబ్బ కొట్టేందుకు కావ్య ప్లాన్‌

Brahmamudi serial today Episode: అరవింద్‌ కంపెనీని వేలంపాటకు వెళ్లమని చెప్పిన కావ్య అక్కడ మీరు అనుకున్నదానికి కన్నా ఎక్కువ వచ్చేలా చేస్తానని చెప్పడంతో అరవింద్‌ హ్యాపీగా వెళ్లిపోతూ.. డోర్‌ దగ్గర ఎదురైన రాజ్‌ను విష్‌ చేసి వెళ్తాడు.  కావ్య క్యాబిన్‌ లోకి వచ్చిన రాజ్‌  ఈ ఆఫ్‌ డిన్నర్‌ గాడు ఎందుకొచ్చాడు అని అడుగుతాడు. అరవింద్‌ కంపనీని వేలం పాటలో కొనాలని డిసైడ్‌ అయినట్టు కావ్య చెప్తుంది. అయితే నష్టాల్లో ఉన్న కంపెనీని కొంటే మనం నష్టపోతామని రాజ్‌ హెచ్చిరస్తాడు. నేను ఆల్‌రెడీ డిసీజన్‌ తీసుకున్నాను.. ఆ ప్రొసీజర్‌ చూడండి అని కావ్య చెప్తుంది. రాజ్‌ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.


కావ్య ఆలోచిస్తూ స్వప్నకు ఫోన్‌ చేస్తుంది. కొత్త ఆఫీసు ఎలా ఉందని కావ్యను స్వప్న అడుగుతుంది. ఎలా ఉంటుంది. ఎప్పుడూ ఉండేలాగే ఉంటుంది. బలం పెరిగే కొద్దీ బాధ్యతలు కూడా పెరుగుతాయి కదక్కా.. అక్కా నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్‌ చేశాను అంటూ తన ప్లాన్‌ స్వప్నకు చెప్తుంది కావ్య. దీంతో సూపర్ ఐడియా కావ్య.. ఇక చూడు మా అత్తకు ఉంటుంది అని ఫోన్‌ కట్‌ చేస్తుంది స్వప్న.. పైన రాహుల్‌, రుద్రాణి చెస్‌ ఆడుతుంటే స్వప్న వెళ్లి డోర్‌ దగ్గర నుంచి చూస్తుంది. లోపల రుద్రాణి చెక్‌ చెప్పి  రాహుల్‌.. రణరంగంలోనైనా.. చదరంగంలోనైనా.. శత్రువు ఆలోచనను ఆరడుగుల ముందుగానే పసిగట్టాలి. లేకపోతే ఇలానే చనిపోతారు అంటుంది.

ఇంతలో బయట నుంచి స్వప్న.. కావ్యకు ఫోన్‌ చేసినట్టు నటిస్తూ.. ఏంటి కావ్య నువ్వు చెప్పేది నిజమా..? ఏంటి వేలం పాటలో అరవింద్‌ కంపెనీని కొంటే కోట్లలో లాభం వస్తుందా..? అని మాట్లాడినట్టు నటిస్తుంది. లోపల రాహుల్‌ అనుమానంగా  ఇది ఫోన్‌ మాట్లాడుతుందా..? మనకు ఇన్ఫర్మేషన్‌ ఇస్తుందా..? మమ్మీ అంటాడు. నువ్వుండరా అంటూ రుద్రాణి వింటుంది.  కానీ నాకో చిన్న డౌటు కావ్య.. ఆ కంపెనీ నష్టాల్లో ఉంది అంటున్నావు. మరి దాన్ని కొంటే నీకెలా లాభం వస్తుంది. ఏంటి ఆ అరవింద్‌ కంపెనీకి ఫారెన్‌ ఇన్‌వెస్టర్స్‌ ఉన్నారా..? ఓహో నాకు ఇప్పుడే అర్థం అయింది. నీ ఐడియా సూపర్‌ కావ్య. ఓకే బాయ్‌..  అంటూ తిరిగి లోపలికి చూసి.. మీరు ఇక్కడే ఉన్నారా..? నేను గమనించనే లేదు.. నేను మాట్లాడింది విన్నారా? ఏంటి అని అడుగుతుంది.


నువ్వు కావ్యతో మాట్లాడుతున్నావని అర్థం అయింది. కానీ ఏం మాట్లాడుతున్నావో  వినబడలేదు అంటూ.. అసలు ఏంటి విషయం అని అడుగుతుంది రుద్రాణి. స్వప్న చెప్పనని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. వెంటనే రుద్రాణి, అనామికకు ఫోన్‌ చేసి స్వప్న మాట్లాడింది చెప్పి ఆ కావ్యను దెబ్బకొట్టేందుకు నీకు మరో అవకావం అని రుద్రాణి చెప్పగానే అనామిక సరే ఆంటీ మొత్తం నేను చూసుకుంటాను అంటుంది. అదేంటి అనామిక ఆ అరవింద్‌ కంపెనీ చాలా నష్టాల్లో ఉంది అని సామంత్‌ అడుగుతాడు. దీంతో  సామంత్‌ ఆంటీ ఎం చెప్పారో విన్నావుగా.. ఆ కంపెనీకి ఫారిన్‌ ఇన్వెస్టర్లు ఉన్నారట.. అని సామంత్‌ ను కన్వీన్స్‌ చేసి అరవింద్‌ కంపెనీ కొనడానికి ఒప్పిస్తుంది.

దుగ్గిరాల ఇంట్లో అందరూ కూర్చుని భోజనం చేస్తుంటారు. అప్పుడే ఆఫీసు నుంచి వచ్చిన రాజ్‌ కోపంగా అందరినీ చూస్తూ..  అందరూ కలిసి భోజనం చేస్తున్నారా? చేయండి. రేపటి నుంచి మీ సీఈవో మిమ్మల్ని ప్రశాంతంగా భోజనం చేయనివ్వదులేండి అంటాడు. ఇప్పుడు ఏమైందిరా.. అంత కోపంగా ఉన్నావు అని అపర్ణ అడుగుతుంది. దీంతో రాజ్‌ తాతయ్యా మీరు నన్ను ఆఫీసులోంచి  తీసేసినా పర్వాలేదు. ఆ సీఈవో సీటులో కూర్చోబెట్టకపోయినా పర్వాలేదు కానీ.. అని రాజ్‌ ఏదో చెప్పబోతుంటే..  కట్టుకున్న భార్యను మాత్రం తీసేయాలి అంతే కదా  రాజ్‌ అంటుంది అపర్ణ.  మమ్మీ నేను చెప్పేది కాస్త వింటారా..? విషయం చిన్నది కాదు. తాతయ్య మీ మనవరాలు నష్టాల్లో ఉన్న అరవింద్‌ కంపెనీని కొనడానికి రెడీ అయింది.

అలా కొంటే మనకు కోట్లల్లో నష్టం వస్తుంది. మన కంపెనీ దివాలా తీస్తుంది అని రాజ్‌ చెప్పగానే.. కావ్య ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వేలం పాటలో పాల్గొనకుండా ఇప్పుడే అడ్డు పడాలి. అది గెలిస్తే మా నాన్న దానికి కిరీటం పెడతాడు.  అని రుద్రాణి మనసులో అనుకుని..  వాడు ఏదో చెప్తున్నాడు ఒకసారి వినొచ్చు కదా..? అంటుంది. ధాన్యలక్ష్మీ కూడా ఏదో లాస్‌ వస్తుందని రాజ్‌ చెప్తున్నాడు కదా? అంటుంది. అయినా సీతారామయ్యా ఏమీ విననట్టు భోజనం చేస్తుంటాడు. దీంతో రాజ్‌ ఇరిటేటింగ్‌ గా తాతయ్యా అని గట్టిగా అరుస్తాడు. దీంతో సీతారామయ్య భోజనం పూర్తి చేసి అందరూ సరిగ్గా వినండి.. నాకు కావ్య సమర్థత మీద నమ్మకం ఉంది. నష్టాల్లో ఉన్న కంపెనీని కొనాలనుకుంది అంటే దానికి ఏదో కారణం ఉంటుంది. కావ్య ఏ నిర్ణయం తీసుకున్నా.. అదేంటని ప్రశ్నించే అధికారం ఎవ్వరికీ లేదు. నేను అస్సలు ప్రశ్నించను అంటూ చెప్పి వెళ్లిపోతాడు సీతారామయ్య.

కళ్యాణ్‌కు ఫోన్‌ చేసిన లక్ష్మీకాంత్‌ నువ్వు రాసిన పాట ఎలా ఉందో ఒకసారి వినిపించు అంటాడు. సరేనని కళ్యాణ్‌ తన పాట వినిపిస్తాడు.  దీంతో నువ్వు కొట్టే బిల్డప్‌ చూసి పాట ఎంత బాగా రాస్తావో అనుకున్నాను. కానీ నీ పాట యావరేజే అంటూ ఓ 5వేలు పంపిస్తాను ఆ పాటను నాకు సెండ్‌ చేయ్‌ దానికి మెరుగులు దిద్దుతాను అంటాడు. అప్పు మాత్రం రైటర్‌ ను తిడుతుంది. వాడు నిన్ను వాడుకుంటున్నాడని చెప్తుంది. ఇక సీతారామయ్య, కావ్యకు ఫోన్‌ చేసి వేలంపాట గురించి అడిగి జాగ్రత్త గా చూసుకోమని చెప్తాడు.  ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Tags

Related News

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో.. కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం

Deepthi Manne: ‘జగద్ధాత్రి’ సీరియల్ హీరోయిన్‌ పెళ్లి సందడి షురూ.. హల్తీ ఫోటోలు వైరల్!

Illu Illalu Pillalu Today Episode: నర్మద, వేదవతి మధ్య గొడవ.. ధీరజ్ కు దిమ్మతిరిగే షాక్.. పారిపోయిన భాగ్యం..

Brahmamudi Serial Today November 6th:‘బ్రహ్మముడి’ సీరియల్‌: కూయిలీ గురించి నింజ తెలుసుకున్న రాహుల్‌

GudiGantalu Today episode: బాలు, మీనా మాటలతో షాక్.. ప్రభావతికి టెన్షన్ టెన్షన్.. సుశీల రాకతో హ్యాపీ..

Nindu Noorella Saavasam Serial Today November 6th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మ కడుపులో పిండాన్ని చంపలేమన్న చంభా

Intinti Ramayanam Today Episode: పల్లవిని అవమానించిన ఫ్రెండ్.. చక్రధర్ పై పల్లవి సీరియస్.. మీనాక్షికి షాక్..

Gundeninda Gudigantalu Prabhavathi : ప్రభావతిలో ఈ టాలెంట్ కూడా ఉందా..? కూతురు, కొడుకుతో కలిసే ఆ పని..

Big Stories

×