Fire Accident: రాజస్థాన్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. జైపుర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ ఆసుపత్రి ఐసీయూ సెంటర్‌లో మంటలు చెలరేగాయి.ఈ ఘటనలో ఆరుగురు రోగులు స్పాట్ లో మృతి చెందారు. ఘటనలో ఐసీయూలో 11 మంది ట్రీట్మెంట్ పొందుతున్నట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. అసలు ఘటన ఎలా జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
సవాయ్ మాన్‌సింగ్ ఆసుపత్రిలో ఘోరం
జైపూర్‌లోని సవాయి మాన్ సింగ్ ఆసుపత్రిలోని ట్రామా ఐసీయూలో రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఐసీయూ అంతటా వ్యాపించాయి. ఈ ఘటనలో ఆరుగురు రోగులు మృతిచెందారు. మరో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రిలోని రెండో అంతస్తులోని ట్రామా ఐసీయూ సెంటర్ ఉంది.
మంటలు చెలరేగడంతో వెంటనే వాటిని కంట్రోల్ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశామని, అయినా జరగాల్సిన నష్టం జరిగిపోయిందని ట్రామా సెంటర్ ఇన్‌ఛార్జ్ తెలిపారు. ట్రామా సెంటర్‌లో రెండో అంతస్తులో రెండు ఐసీయూలు ఉన్నాయి.
ఐసీయూలో మంటలు, ఆరుగురు పేషెంట్లు మృతి
ఒకటి ట్రామా ఐసీయూ కాగా, మరొకటి సెమీ ఐసీయూ. ఈ ఘటన సమయంలో అక్కడ 24 మంది రోగులు ఉన్నారు. ట్రామా ఐసీయూలో 11 మంది, సెమీ ఐసీయూలో 13 మంది ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ కారంగా ఘటన చోటు చేసుకుందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.
ALSO READ: కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి
ఐసియులో ఉన్న రోగులను ఆసుపత్రి సిబ్బంది సకాలంలో స్పందించారు, దీనివల్ల చాలామంది బయటపడ్డారని అంటున్నారు. రోగులను ఐసీయూ నుండి బయటకు తీసుకొచ్చి వేరే ప్రదేశానికి తరలించారు. అప్పటికే ఆరుగురు పేషెంట్లు చనిపోయారని, మరో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉందన్నారు.
మరణించిన వారిలో ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిప్రమాదం సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘటన జరిగినట్టు తెలియడంతో అధికారులు ఆ కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. మంటలు అదుపులోకి రావడంతో సహాయక చర్యలు వేగంగా చేపట్టారు.
ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే రాష్ట్ర, కేంద్రమంత్రులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. స్వయంగా రోగులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రస్తుతం మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.
जयपुर के SMS हॉस्पिटल के ट्रॉमा सेंटर के लगी आग.#Jaipur pic.twitter.com/q9Q6OQfma8
— Dr. Ashok Sharma (@ashok_Jodhpurii) October 5, 2025
#WATCH | Jaipur, Rajasthan | A massive fire broke out in an ICU ward of Sawai Man Singh (SMS) Hospital, claiming the lives of six patients pic.twitter.com/CBM6vcTMfZ
— ANI (@ANI) October 5, 2025