BigTV English

Brahmamudi Serial Today September 28th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ ను మెచ్చుకున్న రుద్రాణి –  రాజ్‌ ను గుర్తు చేసుకున్న కావ్య

Brahmamudi Serial Today September 28th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ ను మెచ్చుకున్న రుద్రాణి –  రాజ్‌ ను గుర్తు చేసుకున్న కావ్య

Brahmamudi serial today Episode :  ఉద్యోగులతో మీటింగ్‌ పెట్టుకున్న రాజ్‌ అందరినీ తిడతాడు. ఆఫీసు పనులు గాలికి వదిలేసి మీ ఇష్టారాజ్యంగా గేమ్స్‌ ఆడుతున్నారా. అంటూ  నేను తలుచుకుంటే పది నిమిషాల్లో మిమ్మల్నందర్నీ జాబ్‌ నుంచి తీసేస్తానని వార్నింగ్‌ ఇస్తాడు. పది సంవత్సరాలుగా మన కంపెనీకి వస్తున్న అవార్డు ఈ సారి కూడా మనకే రావాలని చెప్పి వెళ్లిపోతాడు.


మొదటిరోజు ఆఫీసుకు వెళ్లిన కావ్యను  మేనేజర్‌ పిలిచి పెద్ద టాస్క్‌ ఇస్తాడు. మన కంపెనీ పెద్ద కంపెనీతో కలిసి బిజినెస్‌ చేయబోతున్నామని అందుకోసం నువ్వు మంచి డిజైన్స్‌ వేసి ఇవ్వాలని చెప్పి అనామిక దగ్గరకు వెళ్తాడు. కావ్య డిజైన్స్‌ వేయడానికి ఒప్పుకుందని చెప్తాడు. అయితే ఈ విషయం కావ్యకు తెలియకుండా జాగ్రత్తగా ఉండమని మేనేజర్‌ కు చెప్తుంది అనామిక.

ఒక బాంకెట్‌ హాల్‌ లో సామంత్‌, రాజ్‌ ఎదురుపడతారు. సామంత్‌ రాజ్‌ను పలకరిస్తాడు. చాలా రోజుల తర్వాత కలుస్తున్నాము అంటూ ఎలా ఉన్నావు అని అడుగుతాడు. దీంతో రాజ్‌ ఇరిటేటింగ్‌ ఫీలవుతూ నేను ఆనందంగా ఉన్నానంటే మీకు ఆనందం దూరం అయిపోతుంది కదా అంటాడు. దీంతో సామంత్‌ మరేం  చేయమంటావు చెప్పు మనం చేసే బిజినెస్‌ అలాంటిది అంటాడు.


అయితే బిజినెస్‌ ఏదైనా కావొచ్చు దానికంటే ముందు మనం మనుషులం అన్న విషయం గుర్తించుకోవాలి. అందరూ సంతోషంగా ఉండాలన్న సంగతే మర్చిపోయినట్లు ఉన్నావు నువ్వు అంటాడు రాజ్‌. అవును రాజ్‌ కానీ నీలా ఉండటం అందరికీ సాధ్యం కాదు. సక్సెస్‌ అనేది నీతో ఇలా మాట్లాడిస్తుందని.. త్వరలోనే ఆ సక్సెస్‌ నాక్కూడా రాబోతుందని సామంత్‌ చెప్పగానే.. నువ్వు ఇంకా కలల ప్రపంచంలోనే విహరించు అంటూ రాజ్‌ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

కళ్యాణ్‌, అప్పును తీసుకుని సిటీలోనే బెస్ట్‌ కోచింగ్‌ సెంటర్‌ కు వెళ్తాడు. అప్పు ఇక్కడికి తీసుకొచ్చావేటని అడిగితే నువ్వు నీ లైఫ్‌ యాంబిషన్‌ నెరవేర్చుకోవాలంటే వీళ్ల హెల్ఫ్ ఎంతో అవసరం అని చెప్తాడు. ఇద్దరూ కలిసి లోపలికి వెళ్లి మాట్లాడతారు. కోచింగ్‌ సెంటర్‌ వాళ్లు ఫీజు గురించి చెప్పగానే అప్పు మేము తర్వాత వచ్చి కలుస్తామని కళ్యాణ్‌ ను తీసుకుని బయటకు వస్తుంది. ఎందుకు వచ్చావు అని అప్పును కళ్యాణ్‌ అడిగితే మన దగ్గర అంత డబ్బు లేదు కదా..? మనకు రోజు గడిస్తే చాలు అన్నట్లుగా ఉంది పరిస్థితి. కాబట్టి ఇప్పుడు నాకు కోచింగ్‌ ఏమీ వద్దులే కూచి అంటుంది అప్పు. కళ్యాణ్‌ నేను కష్టపడతాను అని చెప్పినా అప్పు వినదు.

    కంపెనీకి వచ్చిన  12 కోట్ల లాస్‌ గురించి రాజ్, సుభాష్‌కు చెప్తుంటాడు. ఇన్ని రోజులు కంపెనీ గురించి పట్టించుకోకపోయే సరికి మనకు రావాల్సిన ఆర్డర్స్‌ కూడా వెనక్కి వెళ్లిపోయాయి. మార్కెట్‌ లో మన కంపెనీపై  డౌన్‌ఫాల్‌ స్టార్ట్‌ అయింది అని రాజ్‌ చెప్తుంటే రుద్రాణి మధ్యలో అడ్డుపడి. నాకు అర్థమైంది రాజ్‌ నువ్వు ఇదంతా ఇంట్లో ఎందుకు చెప్తున్నావో అంటుంది. ఆ పన్నెండు కోట్ల నష్టం నా కొడుకు వల్ల వచ్చిందనేగా..? నువ్వు ఈ లెక్కలన్నీ మొదలుపెట్టింది అంటుంది.

ఇంతలో సుభాష్‌ నువ్వెందుకు భుజాలు తడుముకుంటున్నావు రుద్రాణి. ఇప్పుడు రాజ్‌ మాటల్లో రాహుల్‌ పేరు తీసుకొచ్చాడా అని అడుగుతాడు. ఎక్కడ కొడుకు బండారం బయటపడుతుందోనని మా అత్త రాజ్‌ మీద అరుస్తుంది అంటుంది స్వప్న. దీంతో  అత్తా ఇప్పటి వరకు ఈ లాస్‌ గురించి నేను ఆలోచించలేదు. కానీ  ఇప్పుడు అన్నీ లాగుతాను. ఎవరు ఎంత మింగారో మొత్తాన్ని కక్కిస్తాను. అంటూ వార్నింగ్‌ ఇస్తాడు రాజ్‌. చచ్చింది గొర్రె. ఇంత సేపు నీ కొడుకు సంగతి తెలిసినా నోరు విప్పలేదు. నువ్వే అనవసరంగా గెలుక్కున్నావు అంటాడు ప్రకాష్‌.

    అది సరే రాజ్‌ ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావో అది చెప్పు అని సుభాష్‌ అడుగుతాడు. దీంతో  డాడ్‌ ఈ సంవత్సరం జరగబోయే ఎక్స్‌ ఫోకు చాలా పెద్ద ఎత్తున్న ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ సారి మన కంపెనీ నుంచి మంచి డిజైన్స్‌ పంపించి అవార్డు తీసుకోగలిగితే  మళ్లీ మనం నెంబర్‌వన్‌ పొజిషన్‌ కు చేరుకోవచ్చు అని రాజ్‌ చెప్పగానే అంత బాగా డిజైన్స్‌ ఇప్పటికిప్పుడు ఎవరు వేస్తారు రాజ్‌ అంటూ సుభాష్‌.. కావ్య వల్లే అది సాధ్యం. ఎందుకంటే  కావ్య వేసే డిజైన్స్‌ చాలా ట్రెండీగా ఉంటాయని చెప్తాడు.

సుభాష్‌ మాటలకు రుద్రాణి కోపంగా కావ్య లేకపోతే మన కంపెనీకి అవార్డే రాదా అన్నయ్యా అని ప్రశ్నిస్తుంది. కావ్య కన్నా ముందు మన కంపెనీకి అవార్డు రాలేదా. అలాగే ఇక ముందు కూడా రాజ్‌ వచ్చేలా చేస్తాడు  అని రాజ్‌ను మెచ్చుకున్నట్లు మాట్లాడుతుంది రుద్రాణి. దీంతో అందరూ రుద్రాణిని తిడతారు. రాజ్ మాత్రం సమర్థిస్తాడు. ఎవరెన్ని చెప్పినా కావ్యను అడిగే పరిస్థితి లేదని.. అవసరం అయితే ఎంట్రీ నుంచి తప్పుకుంటాను కానీ కావ్యను అడగను అని చెప్పి నేనే ఏదో ఒకటి చేస్తాను అంటూ వెళ్లిపోతాడు.

మేనేజర్‌ చెప్పినట్టు డిజైన్స్‌ వేస్తున్న కావ్య కు సరిగ్గా డిజైన్స్‌ రాక పేపర్లు చించివేస్తుంది. అప్పుడే  రాజ్‌ చెప్పిన మాటలు కావ్య  గుర్తు చేసుకుంటుంది. రాజ్‌ తనకు ముద్దు పెట్టిన విషయం జ్ఞాపకం చేసుకుని బాధగా ఎంత మర్చిపోదామనుకున్నా ఆ జ్ఞాపకాలే వెంటాడుతున్నాయేంటి అనుకుంటుది. ఇంతలో కనకం వస్తుంది. కావ్య పేపరు మీద రాజ్‌, కావ్య ఫోటోలు వేసి ఉండటాన్ని చూసి కనకం నీ మనసు ఎక్కడుందో ఆ పేపరు చూస్తేనే అర్థం అవుతుంది అంటుంది.

ఎక్కడుంది అమ్మా అని కావ్య అడగ్గానే నువ్వు గీసిన పెయింటింగ్‌ చూడు అంటుంది. అది చూసి కావ్య ఎమోషన్‌ గా ఫీలవుతుంది. రాజ్‌ కూడా సేమ్‌ ఫీలింగ్‌ తో  ఉంటాడు. ఏదో కంపెనీకి లెటర్‌ రాయబోయి కళావతి అనే పేరు రాస్తాడు. ఇంతలో అక్కడికి ఇందిరాదేవి రాజ్‌ కావ్య పేరు రాయడం చూసి ఏం చేస్తన్నావు రాజ్‌ అని అడుగుతుంది. ఇంతటితో ఇవాళ్టీ బ్రహ్మముడి సీరియల్ ఏపిసోడ్‌ కు ఎండ్‌ కార్డు పడుతుంది.

Tags

Related News

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Big Stories

×