BigTV English

Acne and Garlic: పచ్చి వెల్లుల్లిని ముఖంపై ఉన్న మొటిమలపై రుద్దితే అవి తగ్గిపోతాయా?

Acne and Garlic: పచ్చి వెల్లుల్లిని ముఖంపై ఉన్న మొటిమలపై రుద్దితే అవి తగ్గిపోతాయా?

Does Rubbing Raw Garlic on Face Reduce Pimples: మొటిమలు ముఖ సౌందర్యాన్ని తగ్గిస్తాయి. మంట పెడుతూ, దురద పెడుతూ చికాకు కలిగిస్తాయి. యువత ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్న సమస్య మొటిమలు. మార్కెట్లో అనేక రకాల క్రీములు మొటిమలను తగ్గిస్తాయని అందుబాటులో ఉన్నాయి. కానీ అవన్నీ రసాయనాలతో కూడుకున్నవి. వాటిని వాడడం వల్ల ఉత్తమ ఫలితాలు కూడా రావడం లేదు. అయితే కొందరిలో మొటిమలు ఉన్నచోట వెల్లుల్లి రుద్దడం ద్వారా వాటిని తగ్గించుకోవచ్చనే వాదన ఉంది. ఇది ఎంతవరకు ఉపయోగకరమైన చిట్కానో తెలుసుకుందాం.


బ్యాక్టిరియాను చంపే వెల్లుల్లి
వెల్లుల్లి ఆరోగ్యకరమైన ఆహారంగానే చెప్పుకుంటారు.  దీనిలో అల్లిసిన్ అని పిలిచే రసాయనం ఉంటుంది. అల్లిసిన్‌కు యాంటీబయోటిక్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఎక్కువ. అంటే వెల్లుల్లి రసం బ్యాక్టీరియా పై దాడి చేసి చంపేస్తుంది. అందుకే మొటిమలకు అప్లై చేయడం వల్ల అక్కడున్న బ్యాక్టీరియాను చంపేస్తుందని భావన ఎక్కువ మందిలో వచ్చింది.

మొటిమలు ఎందుకు వస్తాయి?
సైన్స్ చెబుతున్న ప్రకారం వెల్లుల్లి మొటిమలపై అద్భుతంగా పనిచేస్తుంది. అయితే అది పూర్తిగా మొటిమలు రాకుండా అడ్డుకుంటుందని మాత్రం చెప్పలేము. వెల్లుల్లిని మొటిమలపై రుద్దడం వల్ల లేదా వెల్లుల్లి రసాన్ని మొటిమలకు రాయడం వల్ల అక్కడ బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గించవచ్చు. మొటిమలు కేవలం బ్యాక్టీరియాల వల్ల రావు. అక్కడ చర్మ రంధ్రాలు పూడుకుపోవడం వల్ల సెబమ్ ఉత్పత్తి అధికంగా ఉండడం వల్ల ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తుంది. బ్యాక్టీరియాల వల్లే మొటిమలు వస్తే వెల్లుల్లి రాయడం వల్ల తగ్గిపోతాయి. కానీ ఇక్కడ కారణం వేరే కాబట్టి వెల్లుల్లి రాయడం వల్ల మొటిమలు రాకుండా ఉంటాయని చెప్పలేము. కానీ మొటిమలు పెరగకుండా అక్కడ ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా, బ్యాక్టీరియా పెరగకుండా మాత్రం వెల్లుల్లి గుణాలు అడ్డుకుంటాయి.


Also Read: మధుమేహులు ప్రతిరోజూ ఈ పదార్థాలు ఆహారంలో ఉండేట్టు చూసుకోండి, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి

వెల్లుల్లిలో సల్ఫర్ సమ్మేళనాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మొటిమలపై మంట, నొప్పి వంటివి తగ్గడానికి సహాయపడతాయి. కాబట్టి మొటిమలపై వెల్లుల్లి గుజ్జును పెట్టడం వల్ల అక్కడ బ్యాక్టీరియా ఉత్పత్తి కాకుండా ఉంటుంది. కానీ మొటిమలు రాకుండా మాత్రం ఉండదు.

వెల్లుల్లి నేరుగా చర్మంపై పెట్టడం వల్ల చికాకుగా అనిపిస్తుంది. ఎందుకంటే వెల్లుల్లి చాలా ఘాటుగా ఉంటుంది. వెల్లుల్లి చర్మాన్ని తాకగానే అక్కడ మంట వంటి అనుభూతి కలుగుతుంది. కొంతమందికి వెల్లుల్లి వల్ల అలెర్జీ కూడా కలుగుతుంది. దద్దుర్లు, వాపు కూడా రావచ్చు. కాబట్టి మీకు వెల్లుల్లి నేరుగా చర్మం మీద పెడితే ఎలాంటి అనుభూతి కలుగుతుందో తెలుసుకోవడం కోసం ముందు చెయ్యికి వెల్లుల్లి రసాన్ని రాసి చూడండి. మీకు దురద, దద్దుర్లు వంటివి రాకపోతే మొటిమలకు అప్లై చేయవచ్చు. కేవలం మొటిమలు ఉన్న ప్రాంతంలోనే వెల్లుల్లి గుజ్జును అప్లై చేయండి. మిగతా చర్మానికి వెల్లుల్లి తగలకుండా చూసుకోండి.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×