Brahmamudi serial today Episode : జువ్వెల్లరీ డిజైన్స్ వేస్తున్న కావ్యకు రాజ్ గుర్తుకు వస్తాడు. ఇద్దరు సన్నిహితంగా ఉన్న పెయింటింగ్ గీస్తుంది కావ్య. అది చూసిన కనకం చూశావా? కావ్య పైకి నువ్వెంత బెట్టు చేస్తున్నా నీ మనసులో అల్లుడి గారి మీద ప్రేమ ఉంది అంటుంది. మరోవైపు ఏదో కంపెనీకి లెటర్ రాస్తున్న రాజ్ కూడా ఆ లెటర్ లో కళావతికి అని రాస్తాడు. అది గమనించిన ఇందిరాదేవి కావ్య మీద ప్రేమను బలవంతంగా మనసులో తొక్కి పెట్టినా ఎదో లాగా ఇలా బయటపడుతుందని చెప్తుంది. అక్కడ కనకం, ఇక్కడ ఇందిరాదేవి. ఇద్దరిని కన్వీన్స్ చేయాలని చూస్తారు.
కళ్యాణ్, అప్పు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అప్పు వచ్చి భోజనం చేయమని చెప్తుంది. దీంతో కళ్యాణ్ నాకేమొద్దు పొట్టి నేను అలిగాను అంటాడు. దీంతో అప్పు కోపంగా పిచ్చి గానీ లేసిందా నీకు నిన్న కోచింగ్ సెంటర్ కు వెళ్లి వచ్చిన్నప్పటి నుంచి ఇలా మాట్లాడుతున్నావు. అంటూ గద్దించగానే అవును ఇలాగే ఉంటాను. అటు మా ఇంట్లో వాళ్లు నా మాట వినరు. బయటి వాళ్లు నా మాట వినరు. ఆఖరికి ఈరోజు నువ్వు కూడా నా మాట వినడం లేదు. కట్టుకున్న భార్యని పోలీస్ చేయాలనుకోవడం కూడా తప్పా అని ప్రశ్నిస్తాడు కళ్యాణ్.
దీంతో అప్పు మెల్లగా తమ ఆర్థిక పరిస్థితి గురించి చెప్తుంది. అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తామని వివరంగా చెప్పగానే డబ్బు గురించి నీకెందుకు నేను చూసుకుంటాను అన్నానుగా అంటాడు కళ్యాణ్. దీంతో అప్పు నువ్వు కష్టపడుతుంటే నేను చూస్తూ ఉండగలనా? నువ్వు మీ ఇంట్లో రాజకుమారుడిలా పెరిగావు. ఇప్పుడు నా కోసం కష్టపడుతున్నావు అంటుంది. దీంతో భర్తగా నేను ఓడిపోతున్నానేమోనని నాకు బాధగా ఉంది కూచి. ఒక్కసారి నా వైపు నుంచి ఆలోచించు అంటూ కళ్యాణ్, అప్పును కన్వీన్స్ చేయగానే అప్పు సరే నీ ఇష్టం అని అన్నం తినిపిస్తుంది.
ఆఫీసుకు వెళ్తున్న రాజ్ అపర్ణ కోసం చూస్తాడు. అపర్ణ పూజా మందిరంలో పూజ చేస్తూ కిందపడిపోతూ ఉంటుంది. వెంటనే రాజ్ పరుగెత్తుకెళ్లి అపర్ణను కింద పడకుండా పట్టుకుంటాడు. హాల్లోకి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెడతాడు. ఎందుకు మమ్మీ రెస్ట్ తీసుకోమంటే ఈ పనులన్నీ చేస్తున్నావు అని అడుగుతాడు. దేవునికి చేసే పూజ పని కాదు రాజ్. మన భారాన్నంతా భగవంతుని మీద వేయడానికి మనకు ఉన్న సాధనం అదొక్కటే.
మనుషులు చేయలేని పని ఆయనకు అప్పజెప్పితే అది మంచిదైతే ఆ భగవంతుడే తీరుస్తాడు. అందుకే చేస్తున్నాను రాజ్ అంటుంది అపర్ణ. అయితే నువ్వు కొంచెం కోలుకునే వరకు ఎవరైనా దీపం వెలిగిస్తారులే మమ్మీ అంటాడు రాజ్ దీంతో అపర్ణ కోపంగా ఎవరు వెలిగిస్తారు. ఇంట్లో దీపం వెలిగించాల్సిన కోడలిని ఇంట్లోంచి వెళ్లగొట్టిన నువ్వే నాకు సలహాలు ఇస్తున్నావా? అంటూ నిలదీస్తుంది. ఎవరిని ఏమనాలో తెలియని నిస్సహాయత.
నీ వల్ల నా కోడులు మనసు విరిగిపోయింది. వెళ్లి దాన్ని ఓదార్చి తీసుకురారా అని నిన్ను పంపిస్తే దాని మనసు మరింత ముక్కలు చేసి వచ్చావు అంటూ అవేదన పడుతుంది అపర్ణ. దీంతో ఎంత బతిమాలిన రాని వాళ్ల గురించి వెళ్లిపోయిన వాళ్ల గురించి ఆలోచించడం అవసరమా మమ్మీ.. అంటూ మీరెంత చెప్పినా నేను ఇక కావ్యను తీసుకురావడం జరగదు అంటూ రాజ్ వెళ్లిపోతాడు.
కావ్య టైంకి డిజైన్లు ఇస్తుందా? లేదా అని సామంత్ కంగారు పడుతుంటాడు. అనామిక మాత్ర తనకు కావ్య మీద నమ్మకం ఉందని టైం లోపు మంచి డిజైన్స్ ఇస్తుందని చెప్తుంది. ఇంతలో ఆఫీసుకు వచ్చిన కావ్య సురేష్ పైన ఉన్నాడని తెలుసుకుని మీటింగ్ చాంబర్ కి వస్తుంది. కావ్యను చూసిన సామంత్, అనామిక టేబుల్ కింద దాక్కుంటారు. సురేష్ ఇక్కడికి రాకూడదని చెప్పి కిందకు తీసుకెళ్తాడు.
సామంత్ గిల్టీగా ఫీలవుతాడు. నా ఆఫీసులో నేను దాక్కునే పరిస్థితి వచ్చింది అంటాడు. అనామిక, సామంత్‌ను కూల్ చేస్తుంది. కిందకు వెళ్లి కావ్య దగ్గర డిజైన్స్ తీసుకున్న సురేష్ కావ్యను అక్కడి నుంచి పంపించి డిజైన్స్ తీసుకొచ్చి సామంత్ కు చూపిస్తాడు. డిజైన్స్ చూసిన సామంత్ షాక్ అవుతాడు. డిజైన్స్ చాలా బాగున్నాయని ఆ రాజ్ ఎంత పిచ్చొడు కాకపోతే ఇంత టాలెంట్ ఉన్న కావ్యను దూరం చేసుకుంటాడు అంటాడు సామంత్.
రాజ్ దగ్గరకు కొన్ని డిజైన్స్ తీసుకుని వస్తుంది శృతి. ఇవి మన వాళ్లు వేసిన డిజైన్స్ సార్ అని చెప్తుంది. ఆ డిజైన్స్ చూసిన రాజ్ చెత్తగా ఉన్నాయని ప్రతిష్టాత్మకంగా జరిగే ఎక్స్ ఫోకు ఇవి పంపిస్తే మన కంపెనీ పరువు పోతుందని కోప్పడతాడు. దీంతో శృతి ఇన్నాళ్లు మమ్మల్ని కావ్య మేడం గైడ్ చేసేదని ఇప్పుడు కూడా తనని పిలిపించండి అని ఉచిత సలహా ఇస్తుంది. దీంతో రాజ్, శృతిని తిడతాడు.
కళ్యాణ్ ఆటో నడపడం అప్పు చూస్తుంది. దగ్గరకు వెళ్లి నువ్వు చేస్తున్న పికప్ అండ్ డ్రాపింగ్ జాబ్ ఇదేనా అంటూ ప్రశ్నిస్తుంది. కళ్యాన్ పలకడు. దీంతో అప్పు ఎమోషనల్ అవుతుంది. ఎందుకు నాకు కూడా అబద్దం చెప్పావు అంటూ నిలదీస్తుంది. కళ్యాణ్ ఏదో చెప్పబోతుంటే ఏడుస్తూ ఇంటికి వెళ్తుంది. ఇంతటితో ఇవాళ్టీ బ్రహ్మముడి సీరియల్ ఏపిసోడ్ కు ఎండ్ కార్డు పడుతుంది