Telugu Serials : బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్న వాటిలో సీరియల్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ప్రతి తెలుగు ఛానెల్స్ కొత్త సీరియల్స్ ను ప్రసారం చేస్తుంటాయి. అవి ఒకదాని మించి మరొకటి పోటీ పడీ స్టోరీలు ఉంటాయి. అందుకే జనాలు సీరియల్స్ అంటే ఊగిపోతున్నారు. ఇకపోతే టీవీ సీరియల్స్ లో నటిస్తున్న నటీనటులు తమ తోటి నటులనే ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు వున్నారు. టీవీ సీరియల్స్ లో నటిస్తూ తోటి నటులనే ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు ఎవరో ఒకసారి తెలుసుకుందాం..
స్టార్ మాలో గతంలో ప్రసరమైన సక్సెస్ ఫుల్ సీరియల్ చంద్రముఖి అందరికి గుర్తు ఉంటుంది. కన్నడ నటి అయిన మంజలు చంద్రముఖి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పటికి నిరుపమ్ కూడా సీరియళ్లకు కొత్తే. అలా చంద్రముఖి సీరియల్ జరుగుతుండగానే వీరి మధ్య ప్రేమ చిగురించింది. అలా ఇద్దరు పెళ్లి పీటలు ఎక్కారు. పరిటాల నిరుపమ్,మంజుల ఒకరికొకరు ఇష్టపడి పెద్దల అంగీకారంతో పెళ్లిచేసుకున్నారు. ఇప్పుడు వీరిద్దరి దాంపత్యానికి గుర్తుగా ఒకబాబు ఉన్నాడు. మీరిద్దరూ వరుసగా సినిమాలు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు..
అపరంజి, అనుబంధాలు,ఇద్దరమ్మాయిలు తదితర సీరియల్స్ లో నటించిన సీనియర్ హీరోయిన్, వెండితెర హీరోయిన్ సుహాసిని తనతో కలిసి నటించిన ధర్మను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు వీరిద్దరూ సీరియల్స్ తో బిజీగా ఉన్నారు. సుహాసిని సీరియల్స్ తో పాటుగా బుల్లితెర పై ప్రసారం అవుతున్న షోలలో సందడి చేస్తుంది..
కుంకుమపువ్వు, ఇద్దరమ్మాయిలు అభిషేకం వంటి సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. పలు సీరియల్స్ లో నటించిన సిద్ధార్థ వర్మ, ప్రముఖ నటి విష్ణు ప్రియను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు. ప్రస్తుతం వీరిద్దరూ కూడా సీరియల్స్ తో బిజీగా ఉన్నారు.
‘ఉయ్యాలా జంపాల’ సీరియల్ తో తెలుగు టీవీ ఆడియన్స్ కి పరిచయమాయ్యాడు అమర్ దీప్.. సిరిసిరి మువ్వలు సీరియల్ తో మంచి పేరు సంపాదించుకున్నాడు. అలా ఒక్క సీరియల్ తో తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు అమర్. తేజస్విని గౌడ కూడా సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను మెప్పించింది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వరుస సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. దీప్ ఈమధ్య సినిమాల్లో హీరోగా కూడా నటిస్తున్నాడు.
Also Read: గురువారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వాటిని మిస్ అవ్వొద్దు..
వీళ్ళతో పాటుగా హరిత జాకీ కూడా ప్రేమ పెళ్లి చేసుకున్నారు.. వీళ్లే కాదు ఇంకా పలువురు బుల్లితెర సెలబ్రిటీలు సీరియల్స్ ద్వారా ప్రేమించుకుని జీవితంలో పెళ్లి తో ఒక్కటయ్యారు.. ప్రియతమ్ అనగానే ముందుగానే గుర్తొచ్చేది ఈటీవీ లో ప్రసారమైన మనసు మమత సీరియల్ లోని రాజా పాత్ర. అలా ప్రియతమ్ తన నటన తో ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు.