BigTV English

OTT Movie : పని మనిషితో యజమాని యవ్వారం… ఇంటి పని కోసం పిలిచి ఇదేం పని సామీ… క్లైమాక్స్ ట్విస్ట్‌కు ఫ్యూజులు అవుట్

OTT Movie : పని మనిషితో యజమాని యవ్వారం… ఇంటి పని కోసం పిలిచి ఇదేం పని సామీ… క్లైమాక్స్ ట్విస్ట్‌కు ఫ్యూజులు అవుట్
OTT Movie : ఒక లో బడ్జెట్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిముంబైలోని ధనవంత కుటుంబంలో పనిచేసే పనిమనిషి రత్నా, ఆమె యజమాని అశ్విన్ ప్రేమ చుట్టూ తిరుగుతుంది. ఇది 2018లో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది. న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్, లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ వంటి అంతర్జాతీయ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడి, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా అనేక అవార్డులను కూడా గెలుచుకుంది. వీటిలో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో GAN ఫౌండేషన్ అవార్డ్, నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిల్మ్ ఉన్నాయి. ఈ సినిమా పేరు ఏమిటి ? స్టోరీ ఎలా ఉంటుంది ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే .. 

స్టోరీ ఏమిటంటే

రత్నా 19 ఏళ్ల వయసులో వివాహం తర్వాత నాలుగు నెలల్లోనే ఒక ప్రమాదంలో భర్తను కోల్పోతుంది. ఆ తరువాత ముంబైలో రిచ్ ఫ్యామిలి కుటుంబంలో డొమెస్టిక్ హెల్పర్ గా పనిచేస్తూ తన కుటుంబానికి ఆసరాగా ఉంటుంది. ఆమె ఫ్యాషన్ డిజైనర్‌గా మారాలనే కలతో, రాత్రి ఇంగ్లీష్ క్లాసులకు హాజరవుతూ తన ఆశయాలను సాధించేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఆమె పనిచేసే ఇంట్లో అశ్విన్ అనే ఆర్కిటెక్ట్, న్యూయార్క్‌లోని జీవితాన్ని వదిలి ముంబైకి తిరిగి వస్తాడు. అతను అరేంజ్డ్ మ్యారేజ్‌చేసుకునే ప్రయత్నంలో ఉంటాడు. కానీ అతని వధూవు సబీనా మోసం చేసినట్లు తెలిసి, పెళ్లిని రద్దు చేసుకుంటాడు. ఇంటికి తిరిగి వచ్చిన అశ్విన్ డిప్రెస్షన్‌లో ఉంటాడు. రత్నా అతని బాధను గమనించి అతన్ని ఓదార్చడానికి ప్రయత్నిస్తుంది. 
 
ఈ సమయంలో వారి మధ్య ఒక బంధం ఏర్పడుతుంది. అయితే అంతస్తులు ఈ సంబంధాన్ని అయోమయంలో పడేస్తాయి.  వీళ్ళు ఒకే ఇంట్లో రెండు వారాలు గడపడంతో, రత్నా, అశ్విన్ మధ్య ఆకర్షణ పెరుగుతుంది. రత్నా అశ్విన్‌ను ‘సర్’ అని పిలవడం మానేసి, రూఫ్‌టాప్‌లో కూర్చొని జీవితం, కలల గురించి మాట్లాడుకుంటారు. ఒక రాత్రి వీళ్ళు కిస్ కూడా చేసుకుంటారు. కానీ రత్నా వెంటనే తనని కంట్రోల్ చేసుకుంటుంది. ఈ సంబంధం సాధ్యం కాదని చెబుతుంది. అశ్విన్ ఆమెను డేట్‌కు పిలిచినప్పుడు, రత్నా ఉద్యోగం వదిలేసి తన సోదరి ఇంటికి వెళ్లిపోతుంది. చివరికి వీళ్ళ ప్రేమ ఏమవుతుంది ?
రత్నా తన ఫ్యాషన్ డిజైనర్‌ కలను సాధిస్తుందా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి. 

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘సర్’ (Sir) 2018లో విడుదలైన హిందీ రొమాంటిక్ చిత్రం. దీనిని రోహెనా గెరా దర్శకత్వంలో ఇంక్‌పాట్ ఫిల్మ్స్ నిర్మించింది. ఇందులో టిల్లోటమా షోమ్ (రత్నా), వివేక్ గొంబర్ (అశ్విన్), గీతాంజలి కుల్కర్ణి (లక్ష్మీ), రాహుల్ వోహ్రా (సపోర్టింగ్ రోల్) ప్రధాన పాత్రల్లో నటించారు. 1 గంట 39 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా IMDbలో 7.7/10 రేటింగ్ పొందింది. జూన్ 2018లో థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.


Related News

kantara Chapter 1 OTT: భారీ డీల్ కుదుర్చుకున్న కాంతార 2.. ఎన్ని కోట్లో తెలుసా?

OTT Movie : శవాన్ని దాచడానికి మాస్టర్ ప్లాన్… చెఫ్‌తో పెట్టుకుంటే ఇదే గతి… గ్రిప్పింగ్ కన్నడ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఇంట్లో ఎవరూ లేని టైంలో బాయ్ ఫ్రెండ్‌తో… తల్లి చెప్పిందేంటి, ఈ పాపా చేస్తుందేంటి మావా ?

OTT Movie : ఏడుగురిని పెళ్లాడి, ఒక్కొక్కరిని ఒక్కో స్టైల్‌లో ఘోరంగా చంపే లేడీ కిల్లర్… పెళ్లంటేనే గుండె జారిపోయేలా చేసే మూవీ

OTT Movie : ఈ ఊర్లో ఫ్యామిలీకో సైకో… అడుగు పెడితే చావును వెతుక్కుంటూ వచ్చినట్టే… ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా ఉండే థ్రిల్లర్

Big Stories

×