BigTV English
Advertisement

Prabhas : సైలెంట్ గా పని కానిచ్చేసిన డార్లింగ్.. ‘ఫౌజీ ‘ కోసం పక్కా ప్లాన్..

Prabhas : సైలెంట్ గా పని కానిచ్చేసిన డార్లింగ్.. ‘ఫౌజీ ‘ కోసం పక్కా ప్లాన్..

Prabhas : పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒకవైపు వరుస సినిమాలను లైన్లో పెడుతూ ఒక్కో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు ఐదు సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది ముందుగా రాజా సాబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ తర్వాత ఫౌజీ మూవీని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ మూవీ పూజా కార్యక్రమాలతో లాంచ్ అయిన విషయం తెలిసిందే.. ఈ మూవీ గురించి నెట్టింట రోజుకో వార్త వినిపిస్తుంది. తాజాగా మరో న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ మూవీలో ప్రభాస్ లుక్ ఇదే అంటూ ఓ వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది.. తాజాగా ఫౌజీ రిలీజ్ డేట్ పై అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి.


‘ఫౌజీ’ షూటింగ్ పూర్తి..

ప్రభాస్ గత ఏడాది కల్కి మూవీతో ప్రేక్షకులను పలకరించాడు ఆ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఆయన బిజీగా వరుస సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. రాజా సాబ్ తర్వాత ఫౌజీ మూవీలో నటిస్తున్నాడు. దర్శకుడు హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఎటువంటి ఆర్భాటాలు లేకుండా మొదలైంది. అలాగే షూటింగ్ పూర్తి చేసుకుందని టాక్..


రిలీజ్ అయ్యేది అప్పుడే..?

ప్రభాస్ సినిమాలు పక్కా ప్లాన్ ప్రకారమే థియేటర్లలోకి వచ్చేస్తుంటాయి. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభాస్ బల్క్ డేట్స్ కేటాయించగా… ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తైందనే టాక్ వినిపిస్తోంది. రాబోయే 2 నెలల్లో మ్యాగ్జిమమ్ షూటింగ్ పూర్తి చేయాలని టీం భావిస్తోందట. వచ్చే ఏడాది ఏప్రిల్ మొదటి వారంలో ఈ మూవీ థియేటర్లలోకి రాబోతుందని ఓ వార్త షికారు చేస్తుంది. ప్రభాస్ సరసన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ మూవీ షూటింగ్లో జాయిన్ కాక ముందే ‘ఫౌజీ’ షూటింగ్ పూర్తి చేయాలని ప్రభాస్ అనుకుంటున్నారట.. ఈ చిత్రానికి దాదాపు రూ.600 కోట్ల నుంచి రూ.700 కోట్ల మధ్యలో బడ్జెట్ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.

Also Read: రాఖీ స్పెషల్.. టాలీవుడ్ లో సిస్టర్ సెంటిమెంట్ సినిమాలు..

ప్రభాస్ పాత్ర ఇదే.. 

1940ల కాలం నాటి నేపథ్యంలో స్టోరీ సాగనుండగా… ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అప్పటి కాలానికి తగ్గట్లుగా సెట్స్ వేయాల్సి ఉన్నందున భారీ బడ్జెట్ అవుతుందని టాక్.. ఇక ఇందులో బాలీవుడ్ యాక్టర్స్ అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తితో పాటు సీనియర్ హీరోయిన్ జయప్రద కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతంమారుతి డైరెక్షన్లో ‘ది రాజా సాబ్’ ఈ ఏడాది డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఫౌజీ షూటింగ్ పూర్తి చేసేలా కనిపిస్తుంది.. ఆ తర్వాత స్పిరిట్, సలార్ 2, కల్కి 2 మూవీస్ ట్రాక్లోకి ఎక్కనున్నాయి..

Related News

Deepika Padukone: బాలీవుడే కాదు హాలీవుడ్ కూడా.. వివక్షపై దీపిక సంచలన కామెంట్స్!

Raj Tarun : కొత్త అవతారం ఎత్తబోతున్న హీరో.. రిస్క్ అవసరమంటావా..?

Srinivas Reddy: చైతూ కోసం 10 నెలల కష్టం వృధా.. ఆ సూపర్ హిట్ సీక్వెల్ పై డైరెక్టర్ కామెంట్!

Janhvi Kapoor : ఇది నా అదృష్టం, జాన్వి పాపా పెద్ది కన్సర్ట్ లో ఎంత ముద్దుగా మాట్లాడిందో

Ram Charan: నా కల నిజం అయిపోయింది, కన్సర్ట్ లో రామ్ చరణ్ అదిరిపోయే ఎంట్రీ

SSMB29 : మొత్తానికి మహేష్ బాబు అప్డేట్ ఇచ్చాడు, గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ పై మహేష్ రియాక్షన్.

Gouri G Kishan : నాకు మారి సెల్వరాజ్ సార్ ఫోన్ చేశారు, ఇష్యూ గురించి ఏం చెప్పారంటే?

The Great Pre wedding show: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాపై బెల్లంకొండ రియాక్షన్, మొదటి సెలబ్రిటీ సపోర్ట్

Big Stories

×