D Show Contestant :ఇప్పటికే ఏ రంగంలో అయినా సరే ఆడవారికి భద్రత లేదు అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే సినిమా సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వీరు ఏం చేసినా సరే క్షణాల్లో వైరల్ అవుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా వీరికి సంబంధించిన ఎన్నో విషయాలు ఇట్టే వైరల్ అవుతూ ఉంటాయి. ఇకపోతే ఆడవారి విషయంలో అయితే.. ఈ విషయం మరింత వేగంగా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పవచ్చు. ఇప్పటికే ఇలా చాలామంది మహిళలు సెలబ్రిటీల చేతుల్లో మోసపోవడం నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తోందని చెప్పవచ్చు. ఇదివరకే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani master) చేతిలో ఒక లేడీ కొరియోగ్రాఫర్ మోసపోగా.. మరొకవైపు హీరో రాజ్ తరుణ్(Raj Tarun) చేతిలో లావణ్య (Lavanya) అనే అమ్మాయి మోసపోయానని ఆరోపణలు చేస్తోంది. ఇకపోతే మరొకవైపు కొంతమంది యూట్యూబర్స్ చేతిలో మహిళలు మోసపోతున్నామంటూ పోలీసులను ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే.
ఢీ షో కంటెస్టెంట్ అభి భార్య ఆత్మహత్యాయత్నం..
అయితే ఇప్పుడు సడన్గా ఢీ షో కంటెస్టెంట్ అయిన అభి (Abhi ) చేతిలో ఒక అమ్మాయి మోసపోయానని చెప్పి ఏకంగా ఆత్మహత్యాయత్నం చేసి, ఇప్పుడు ప్రాణాలతో పోరాడుతోంది. అసలు విషయంలోకి వెళ్తే.. బుల్లితెర వేదికగా ప్రసారమవుతున్న బిగ్గెస్ట్ రియాలిటీ ఢీ డాన్స్ షోలో కంటెస్టెంట్ గా పాటిస్పేట్ చేశారు అభి. అయితే ఇతడు ఖమ్మం రూరల్ పొన్నెకల్ లో మంగళగిరి కావ్యకళ్యాణి అనే అమ్మాయిని వివాహం చేసుకొని.. ఆమెతో గత కొన్నాళ్లుగా కాపురం ఉంటున్నారట. అయితే సడన్గా ఆ అమ్మాయి ఒక సెల్ఫీ వీడియో ని షేర్ చేస్తూ..” నేను.. ఢీ కంటెస్టెంట్ అభిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. గత కొన్నాళ్లుగా కాపురం కూడా ఉంటున్నాం. అయితే ఇప్పుడు నన్ను కాదని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. ఇక దీనితో నేను చేసేదేమీ లేక ఆత్మహత్య చేసుకోబోతున్నాను.. సారీ అమ్మ.. సారీ నాన్న.. నా చావుకు కారణం వాడే” అంటూ ఫ్యాన్ కి ఒక చీరతో ఉరి వేసుకుంటున్న సెల్ఫీ వీడియోని ఆమె షేర్ చేసింది.
టూ టౌన్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన అభి..
అయితే ఈ విషయం కాస్తా ఆలస్యంగానే వెలుగులోకి రావడం గమనార్హం. ఇకపోతే వీడియో వైరల్ గా మారడంతో ముందుగానే టూ టౌన్ కి వెళ్లి అభి లొంగిపోయినట్టు సమాచారం. ఇకపోతే సూసైడ్ ప్రయత్నం చేసిన కావ్య కళ్యాణి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స తీసుకుంటుంది. ఈ విషయం తెలిసి పలువురు నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఢీ కంటెస్టెంట్ అభిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఏది ఏమైనా ఇలా ఆడవాళ్లు కొంతమంది సెలబ్రిటీల చేతుల్లో మోసపోవడంతో.. అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. సమాజానికి ఉపయోగపడాల్సిన ఇలాంటివారు ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటారో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి రోజుకొక వార్తలు అటు ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలపై విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తున్నాయని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
యువతి ఆత్మహత్యాయత్నం… ఢీ కంటెస్టెంట్ చేతిలో మోసపోయాను అంటూ సెల్ఫీ వీడియో#dhee #dheecontestants #VideoLeaked #viral #bigtvcinema pic.twitter.com/0ZRjdVYF6P
— BIG TV Cinema (@BigtvCinema) March 1, 2025