Elon Musk 14th child Shivon Zilis | ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మరోసారి తండ్రి అయ్యారు. ఆయన సహజీవన భాగస్వామి షివోన్ జిలిస్ ఆ బిడ్డకు తల్లి. ఎలాన్ మస్క్ కు చెందిన న్యూరోలింక్ సంస్థలో ఎగ్జిక్యూటివ్ అయిన షివోన్ జిలిస్.. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. తమ కొత్త బిడ్డకు “సెల్డాన్ లైకుర్గస్” అని పేరు పెట్టినట్లు తెలిపారు. “ఎలాన్‌తో మాట్లాడాను. మా కుమారుడు సెల్డాన్ లైకుర్గస్ (Seldon Lycurgus) గురించి ప్రపంచానికి స్వయంగా తెలియజేయాలని నిర్ణయించుకున్నాం” అని షివోన్ తన సోషల్ మీడియా చేసిన ఓ పోస్ట్ ద్వారా ప్రపంచానికి తెలియజేశారు. తమ మూడో బిడ్డ ఆర్కాడియా పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ పోస్టుకు హార్ట్ ఎమోజీతో మస్క్ రిప్లై ఇవ్వడం విశేషం.
షివోన్ జిలిస్‌తో సహజీవనం చేస్తున్న మస్క్ ఇప్పటికే ఆమెతో ముగ్గురు పిల్లలను కలిగి ఉన్నారు. అయితే ఇప్పుడు సెల్డాన్ జన్మించడంతో వారివురి సంతాన సంఖ్య నాలుగుకి పెరిగింది. అయితే ఈ నాలుగో బిడ్డ ఎప్పుడు జన్మించాడో షివోన్ స్పష్టం చేయలేదు.
ఇప్పటివరకు ఎలాన్ మస్క్‌కు 12 మంది అధికారికంగా సంతానం ఉన్నారు. మొదటి భార్య జస్టిన్‌కు జన్మించిన తొలి బిడ్డ అనారోగ్య కారణాలతో 10 వారాలకే మృతి చెందింది. తర్వాత ఆ జంట ఐవీఎఫ్ పద్ధతిలో ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చారు. 2008లో వారిద్దరూ విడిపోయారు. తర్వాత బ్రిటిష్ నటి తాలులాహ్ రిలేను మస్క్ వివాహమాడారు, కానీ వారికి సంతానం లేదు. అనంతరం కెనడియన్ గాయని గ్రిమ్స్‌తో వివాహేతర సంబంధం నెరిపారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు తన ప్రతిష్ఠాత్మక సంస్థ న్యూరోలింక్‌లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న షివోన్ జిలిస్‌తో సహజీవనం చేస్తున్నారు. వీరికి ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉండగా, తాజాగా ఈ జంట నాలుగో బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మొత్తం పిల్లల సంఖ్య 13.
Also Read: అమెరికా ప్రెసిడెంట్‌గా మస్క్.. ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలు ఆయన చేతుల్లోనే
మస్క్ ధృవీకరించని మరో బిడ్డ కూడా
ఇటీవల అమెరికాకు చెందిన యువ రచయిత్రి ఆష్లీ సెయింట్ క్లెయిర్ ఒక సంచలన విషయాన్ని బహిర్గతం చేశారు. తన బిడ్డకు ఎలాన్ మస్క్ తండ్రి అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “ఐదు నెలల క్రితం నేనో బిడ్డకు జన్మనిచ్చాను. నా చిన్నారికి ఎలాన్ మస్క్ తండ్రి. మా బిడ్డ గోప్యత, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇంతకు ముందు ఈ విషయాన్ని బహిర్గతం చేయలేదు. కానీ కొన్ని మీడియా సంస్థలు ఈ విషయాన్ని బయటపెట్టాలని ప్రయత్నించాయి. అందుకే నేనే ఇప్పుడు వెల్లడిస్తున్నాను. మా సంతానం సురక్షిత వాతావరణంలో జీవించాలని నేను కోరుకుంటున్నాను. మా గోప్యతకు ఎవరూ భంగం కలిగించకుండా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను” అని ఆష్లీ తన పోస్టులో పేర్కొన్నారు. ఆ తర్వాత మరో పోస్ట్ చేసి తాను సోషల్ మీడియా నుంచి కొంతకాలం విరమించుకుంటున్నట్లు ఆమె తెలిపారు. అయితే ఈ విషయంపై ప్రస్తుతానికి ఎలాన్ మస్క్ నుంచి ఎలాంటి స్పందన లేదు.
ఈ విషయం నిజమైతే, 53 ఏళ్ల మస్క్ 31 ఏళ్ల ఆష్లీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లే. కానీ మస్క్ ఆష్లీ క్లెయిర్ కు పుట్టిన బిడ్డకు తనే తండ్రినని ఇంతవరకు చెప్పలేదు. పైగా ఆమె సోషల్ మీడియా అకౌంట్లో కొన్నేళ్ల క్రితమే ఒక వ్యక్తితో తన గురించి తన సంతానం గురించి చేసిన పోస్ట్ ని బహిర్గతం చేస్తూ. . ఆమె వ్యాఖ్యల పట్ల అనుమానం వ్యక్తం చేశారు.