Producer Nagavamsi : బ్లాక్ బస్టర్ మూవీ ‘మ్యాడ్’ (Mad)కి సీక్వెల్ గా తెరపైకి రాబోతోంది ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square). మూవీ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మోస్ట్ అవైటింగ్ మూవీ ప్రెస్ మీట్ ను నిన్న నిర్వహించారు. ఈ సందర్భంలోనే నిర్మాత నాగ వంశీ (Nagavamsi) ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ (Kalyan Shankar) పై అందరి ముందు ఫైర్ అయ్యారు. ఆయన ఈ డైరెక్టర్ పై స్టేజ్ పైనే కోప్పడడానికి కారణం ఏంటి? వీరిద్దరి మధ్య అసలు ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళితే…
డైరెక్టర్ ఏమన్నారంటే?
మూవీ ప్రమోషన్ లో భాగంగా డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ మాట్లాడుతూ “ఒకటైతే ప్రామిస్ చేయగలను మ్యాడ్ మూవీని మీరు చూసి ఎంజాయ్ చేశారు కదా… దానికి కచ్చితంగా 10 టైమ్స్ ఉంటుంది మ్యాడ్ స్క్వేర్. ప్రతి సీన్ సినిమాలో ఎంటర్టైన్ చేస్తుంది. వంశీ అన్న వచ్చి, ఇందులో కథ లేదు అంటాడేమో… కానీ ఈసారి ఉంది. కథ మాత్రమే కాదు పాయింట్ కూడా ఉంటుంది. కచ్చితంగా మార్చ్ 29 మనం మళ్లీ మాట్లాడుకుందాం. ఈరోజు ఏదైతే నేను చెప్తున్నానో 10 టైమ్స్ అని, అది ఉందో లేదో మూవీ చూశాక మీరే చెప్పాలి” అంటూ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
నోటికి వచ్చింది వాగుతావ్ అంటూ ఫైర్
ఆ తర్వాత నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ “మ్యాడ్ మూవీలోనే కాదు మ్యాడ్ స్క్వేర్ లో కూడా స్టోరీ ఉండదు. లాజిక్ లు వెతక్కుండా కేవలం నవ్వుకోవడానికి మాత్రమే థియేటర్ కి రండి. ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుకుని, ఇంజనీరింగ్ కు సంబంధించిన ఉద్యోగం చేయకూడదు అనుకునే ముగ్గురు ఎదవలు ఒక మంచోడిని ఎదవని చేసే స్టోరీ ఇది. హైదరాబాద్ లో వీళ్ళ అరాచకాలు అయిపోవడంతో గోవాకి షిఫ్ట్ చేశామంతే. రెండు గంటలు ఫన్ మాత్రమే ఉంటుంది. ఇది మిస్ అయింది, అది మిస్ అయింది అని దర్శకుడిని, ప్రొడక్షన్ హౌస్ ని అనడానికి ఏమీ లేదు. ఎందుకంటే మేమే చెప్తున్నాం కదా… కథ లేదు నవ్వుకోడానికి మాత్రమే రండి అని. నలుగురు ఫ్రెండ్స్ హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి మాత్రమే రండి అంతే.
ఈ ప్రెస్ మీట్ తో డైరెక్టర్ కళ్యాణ్ కి ఇవ్వాలి. మైక్ పట్టుకుని బ్లాక్ బస్టర్లు, 10 టైమ్స్ ఉంటాయి అని వాగొద్దని ఎన్నిసార్లు చెప్పినా ఆగట్లేదు కదా మరి. డైరెక్టర్ మైక్ పట్టుకొని బ్లాక్ బస్టర్ అని వాగకూడదు అని 100 సార్లు చెప్పాను” అంటూ నాగవంశీ నవ్వుతూనే సీరియస్ లుక్ ఇచ్చారు డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ వైపు. దీంతో కళ్యాణ్ శంకర్ కి నిర్మాత నాగ వంశీ వార్నింగ్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇదిలా ఉండగా మూవీ ఫస్ట్ పార్ట్ లో హీరోలుగా నటించిన నార్నే నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్, విష్ణు సీక్వెల్ లో కూడా ప్రధాన పాత్రలో పోషిస్తున్నారు. కళ్యాణ్ మార్క్ 9న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.