E-Paper
Advertisement

వైజాగ్‌లో ‘ఢి’ షో పండు మాస్టర్‌కు కారుకు ప్రమాదం.. కాళ్లు విరిగి, హాస్పిటల్‌లో..

వైజాగ్‌లో ‘ఢి’ షో పండు మాస్టర్‌కు కారుకు ప్రమాదం.. కాళ్లు విరిగి, హాస్పిటల్‌లో..
Advertisement

Pandu Master : ప్రముఖ బుల్లితెర డ్యాన్స్ షో లో కంటెస్టెంట్ గా చేస్తున్న పండు మాస్టర్ కు ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పండు మాస్టర్ కు తీవ్ర గాయాలు అయ్యాయని సమాచారం. ఏపీ విశాఖపట్నం ఆనందపురం సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. పండు మాస్టర్ తన బృందంతో కలిసి తగరపువలసలో జరుగుతున్న అమ్మవారి ఉత్సవాల్లో డ్యాన్స్ పెర్ఫార్మన్స్ చేసి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుంది.. పలువురు డాన్సర్లు కూడా ప్రయాణిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీలోని జనాలు ఉలిక్కిపడ్డారు. పండు మాస్టర్ అభిమానులు అలాగే సన్నిహితులు మాస్టర్ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన స్థలంలోని స్థానికులు వెంటనే గాయపడిన వాళ్ళని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది. పండు మాస్టర్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయనను అబ్జర్వేషన్ లో ఉంచినట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుకున్నారు. ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు ఇంకాసేపట్లో తెలిసే అవకాశం ఉంది..

పండు మాస్టర్ కారుకు ప్రమాదం..

ఢీ షోలో కంటెస్టెంట్ గా చేస్తున్న పండు మాస్టర్ కు ఇవాళ వైజాగ్ లో రోడ్డు యాక్సిడెంట్ జరిగింది.. విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం.. విశాఖపట్నంలోని ఓ ఈవెంట్ లో డ్యాన్స్ ప్రోగ్రాం చేసి తన బృందంతో కలిసి తిరుగు ప్రయాణం ప్రారంభించారు. అయితే మార్గమధ్యలో టీమ్‌లోని ఒక సభ్యుడు అస్వస్థతకు గురికావడంతో వాహనాన్ని రోడ్డు పక్కన ఆపినట్లు తెలుస్తుంది. ఆ టైం లో పండు కారు దిగి బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కోళ్ల వ్యాన్ అదుపుతప్పి ఆయనను ఢీకొట్టినట్లు తెలుస్తోంది.. పక్కనే ఉన్న కారుని కూడా ఢీ కొట్టినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాద సమయంలో కారులో ఉన్న వాళ్లతో పాటుగా కారు కూడా వెనుక భాగంలో అయినట్లు తెలుస్తుంది.. ఇక వేగంతో ఆ వ్యాను రావడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారిస్తున్నారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

పండు పరిస్థితి ఎలా ఉందంటే..? 

Advertisement

కోళ్ల వ్యాను నేరుగా వచ్చి పండుని ఢీకొనడంతో అతను వేగంగా ఎగిరి పక్కన పడినట్లు స్థానికులు చెబుతున్నారు. పండు మాస్టర్ టీమ్ సభ్యులు స్పందించి ఆయనను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించినట్లు తెలిసింది.. అయితే ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తుంది. కానీ కాలు కు తీవ్రమైన గాయాలు తగినట్లు పోలీసులు చెబుతున్నారు.. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతుంది. ఇక పండు మాస్టర్ విషయానికొస్తే.. ‘ఢీ’ డ్యాన్స్ షో ద్వారా విపరీతమైన గుర్తింపు సంపాదించుకున్నారు. తన ప్రత్యేక డ్యాన్స్ స్టైల్, కొరియోగ్రఫీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అతను బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు స్పెషల్ ఈవెంట్లలో సందడి చేస్తున్నాడు.. ఇప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే పండు మాస్టర్ కి ఇలా జరగడంతో ఆయన అభిమానులు కంగారుపడుతున్నారు.. త్వరగా కోలుకొని ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Related News

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Big Stories

Advertisement
×