BigTV English

Tv Serials : పెళ్ళైన సీరియల్ యాక్టర్స్ తాళిబొట్టును నిజంగానే మెడలోంచి తీసేస్తారా..?

Tv Serials : పెళ్ళైన సీరియల్ యాక్టర్స్ తాళిబొట్టును నిజంగానే మెడలోంచి తీసేస్తారా..?

Tv Serials : మన భారతీయ సాంప్రదాయంలో మూడుముళ్ల బంధానికి గొప్ప చరిత్ర ఉంది. ఒక్కసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత ఇక ప్రాణం పోయేంతవరకు తమ భాగస్వామి వాళ్లే అని అనుకునేవారు. ఈ మధ్య కాస్త కొన్ని కారణాలవల్ల ఈ తీరు మారింది కానీ ఆనాతి కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం ఇదే.. ఒకసారి మెడలో తాళి పడిన తర్వాత ఆ తాళిని తీయడం అపచారం అని పెద్దలు అనేవారు. అలా చేస్తే భర్తకు కీడు కలుగుతుందని భావించి మెడలో ఎప్పుడూ పుస్తెలతాడుతో కనిపించేవారు. కానీ ఈ మధ్య ట్రెండ్ మారడంతో సాంప్రదాయం కూడా మారిపోయిందనే వాదన వినిపిస్తుంది.. డ్రెస్సులకు తగ్గట్లు జ్యువలరీ వేసుకుంటున్నారు తప్ప మంగళసూత్రాలు మాత్రం ఖేతారు చెయ్యట్లేదు కొందరు మహిళలు. ఇకపోతే సినీ ఇండస్ట్రీలోని కొందరు ముద్దుగుమ్మలు పెళ్లయిన తర్వాత వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అంటే చాలామందికి ఒక అనుమానం ఉంటుంది. మిగతా వాళ్ళ సంగతి పక్కన పెడితే సినిమా వాళ్లు మంగళ సూత్రాన్నే వేసుకోరంటూ ఓ వార్త గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీని ఊపేస్తుంది. అయితే యాక్టర్స్ నిజంగానే మంగళసూత్రాన్ని తీసేస్తారా? లేదా వేసుకొని కవర్ చేసుకుంటారా అన్నది ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..


పెళ్ళైన యాక్టర్స్ తాళిబొట్టును వేసుకోరా..?

మన దేశ సాంప్రదాయకు పవిత్రతకు అద్దం పట్టేది వివాహ బంధం.. ఒక్కసారి మూడు ముళ్ళు పడిన తర్వాత ఆ బంధం భర్త బ్రతికున్నంత వరకు అలానే ఉంటుంది. భర్త చనిపోతే అతను కట్టిన తాళిని తీసేస్తారు. కానీ నటన జీవితాన్ని కొనసాగిస్తున్న కొందరు మహిళలు తాళిబొట్టును తీసేస్తున్నారు. సినిమాలోనూ లేదా సీరియల్స్లలోనూ ఆ సీన్ అయిపోయేంతవరకు ఆ తాళిబొట్టు వారి మెడలో కనిపించట్లేదు. ఆ తర్వాత కొందరు వేసుకున్న మరికొందరు మాత్రం అసలు తాళిబొట్టునే వేసుకోకుండా బయట కనిపిస్తుంటారు. ఈమధ్య ఫ్యాషన్ ఇదే కాబట్టి అందరూ దీన్ని ఫాలో అవుతుంటారు. నిజానికి మరికొందరు మాత్రం తాళిబొట్టుని మెడలోనే ఉంచుకొని కవర్ చేస్తూ తమ క్యారెక్టర్ని పూర్తి చేస్తారు. కొందరు తమ క్యారెక్టర్ ను బట్టి తాళిని వేసుకొని  నటిస్తారు. ఇక్కడ అందరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే.. మంగళ సూత్రాన్ని మెడలో నుంచి తీయడం అశుభమని పెద్దలు అంటున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల తీసిన వెంటనే పసుపు కుంకుమలు పెట్టి తమ భర్త చేత మళ్లీ మెడలో వేయించుకోవడం మంచిదని అంటున్నారు. మరి ఈ విషయాలను ఇండస్ట్రీలోని మహిళలు దృష్టిలో పెట్టుకుంటే బాగుండు అని అభిప్రాయ పడుతున్నారు..

Aslo Read : ‘మిరాయ్’ చిత్రాన్ని వదులుకున్న యంగ్ హీరో.. కారణం ఏంటంటే..?


సినిమాలు సంప్రదాయాలను పక్కనపెట్టేస్తున్నాయా?

ప్రేక్షకులను వినోదాన్ని పంచే వాటిలో సినిమాలు ఒకటి. తమ డైలాగులతో ప్రేక్షకులను నవ్వించడం మాత్రమే కాదు గుక్క తిప్పుకోకుండా ఏడిపించేస్తుంటాయి. అలాంటి సినిమాల్లో నటించే ఫిమేల్ క్యారెక్టర్ల వల్ల సాంప్రదాయాలు మూలన పడుతున్నాయని కొందరు వాదన వినిపిస్తున్నారు. మరికొందరు మాత్రం తమ వృత్తికి న్యాయం చేస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం లేదు అంటూ యాక్టర్స్ ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా కూడా ట్రెండ్ ని ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. అందుకే కొందరు కావాలనైనా మెడలో మంగళసూత్రాలు వేసుకోవడం లేదు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై సీరియల్ యాక్టర్లు ఎలా స్పందిస్తారో..? మంగళసూత్రం పై వారి అభిప్రాయం ఏంటో తెలియాలంటే దీనిపై ఎవరొకరు రెస్పాన్స్ ఇస్తారేమో చూడాలి..

Related News

Intinti Ramayanam Today Episode: అవనిని అవమానించిన అక్షయ్.. భరత్ కోసం మరో ప్లాన్.. మొగుళ్ళ కోసం తోడి కోడళ్ల ఫైట్..

GudiGantalu Today episode: రోహిణిని స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రభావతికి చుక్కలు చూపించిన సుశీల.. మీనా హ్యాపీ..

Nindu Noorella Saavasam Serial Today September 12th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రణవీర్‌ లాయరును కిడ్నాప్‌ చేసిన రౌడీలు

Illu Illalu Pillalu Today Episode: ప్రేమ మాటతో ఫ్యూజులు అవుట్.. ధీరజ్ కాపురంలో చిచ్చు.. చందుకు శాశ్వతంగా వల్లి దూరం..?

Brahmamudi Serial Today September 12th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేవతి బ్యాగ్‌ చెక్‌ చేసిన రుద్రాణి – రుద్రాణి రూంలో దొరికిన నెక్లెస్‌

Today Movies in TV : శుక్రవారం సూపర్ హిట్ చిత్రాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Trinayani Serial : ‘త్రినయని’ నయని ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Big Stories

×