Mirai movie : గత ఏడాది సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ హనుమాన్ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన హీరో తేజ సజ్జా.. ఈ మూవీ తర్వాత ఆయన చేస్తున్న మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే హనుమాన్ మూవీ తర్వాత జై హనుమాన్ సినిమా రావాల్సి ఉంది. కొన్ని కారణాలవల్ల అది వాయిదా పడడంతో తేజ మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యాడు.. తేజా మిరాయ్ మూవీతో ఇవాళ ప్రేక్షకులను పలకరించాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలకు, థియేట్రికల్ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా కాలం తర్వాత ఒక మంచి క్వాలిటీ సినిమాని చూడబోతున్నాము అనే నమ్మకాన్ని కలిగించింది. ఇప్పటివరకు మంచి టాక్ ని సొంతం చేసుకుంది. మొదటి షో రెస్పాన్స్ పాజిటివ్ గానే వినిపిస్తుంది. అయితే ఈ మూవీకి ముందుగా అనుకున్న హీరో తేజా కాదట. మరి ఆ హీరో ఎవరు? ఎందుకు రిజెక్ట్ చేశాడో ఒకసారి తెలుసుకుందాం..
మిరాయ్ మూవీ స్టోరీని దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మూడేళ్ల కిందటే రాసుకొని సిద్ధం చేశాడట. సినిమాటోగ్రాఫర్ గా ఉన్న తనకు దర్శకత్వం వహించే అవకాశం ఇవ్వడానికి అప్పట్లో కొంతమంది హీరోలు ధైర్యం చేయలేదట. అయితే నేచురల్ స్టార్ నాని కార్తీక్ ఘట్టమనేని తో కలిసి ఈ ‘మిరాయ్’ చిత్రాన్ని చేయడానికి సిద్దపడ్డాడట.. ముందుగా కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సరే రెమ్యూనరేషన్ తక్కువ అని తప్పుకున్నాడట. ఆ తర్వాత కొన్నాళ్ళు సైలెంట్ గా తన సినిమాటోగ్రఫీ పనులు చేసుకుంటున్న కార్తీక్ ఘట్టమనేని కి, ‘హనుమాన్’ తో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్న తేజ సజ్జ కనిపించాడు.. ఆ స్టోరీ తేజాకు నచ్చడంతో స్టోరీ పట్టాలెక్కేసింది. ఇవాళ థియేటర్లలోకి వచ్చేసింది.
Also Read : శుక్రవారం సూపర్ హిట్ చిత్రాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..
విజువల్ వండర్ గా థియేటర్లలోకి వచ్చేసిన ఈ మూవీని చూసేందుకు ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. మంచి రెస్పాన్స్ ను అందుకుంటుంది. ప్రీమియర్ షోలు ప్లస్ అవుతున్నాయి. థియేటర్లలో మంచి విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ప్రేక్షకులకు ఓ భారీ సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది. నటనలో తేజా సజ్జా – మంచు మనోజ్ బెస్ట్ ఇచ్చారని పబ్లిక్ అంటున్నారు. ఇప్పటి వరకు తెరపై చూడని కథ, సన్నివేశాలకు తగ్గట్టు సాగే నేపథ్య సంగీతం, అన్నిటికీ మించి బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న మూవీ. ఇకపోతే లెంగ్త్ ఎక్కువ కావడం, కామెడీ క్లిక్ కాకపోవడం, విలన్ ఫ్లాష్ బ్యాక్‌లో స్పార్క్ మిస్ అవ్వడం వంటివి అక్కడక్కడా మిస్ అయ్యాయి. ఇక మిగితా అంతా బాగుందనే టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైన పబ్లిక్ రెస్పాన్స్ ను చూస్తుంటే మూవీ బ్లాక్ బాస్టర్ పక్కా అనే టాక్ వినిపిస్తుంది. మరి ఏ మాత్రం కాసులు కురుస్తాయో చూడాలి..