OTT Movie : మలయాళం సినిమాల్లో ఎక్స్‌పెరిమెంటల్ కామెడీ థ్రిల్లర్‌గా ‘Adventures of Omanakuttan’ సినిమా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో ఓమనకుట్టన్ పాత్రలో జీవించాడనే చెప్పాలి. సేల్స్‌మ్యాన్ గా ఉంటూ ఒక యాక్సిడెంట్ లో గతం మరచిపోతాడు. ఆ తర్వాత కథ మరింత ఎక్సైటింగ్‌గా మారుతుంది. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలు తెలుసుకుందాం పదండి.
ఓమనకుట్టన్ మైసూరులోని క్లింటోనికా హెయిర్ ఆయిల్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తూ ఉంటాడు. ఇతనికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. అందుకే ఒంటరి తనంతో ఇబ్బంది పడుతుండాడు. తన బాస్ చంద్రశేఖర్ సలహా మేరకు, తనను తాను మార్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఫోన్ లో రకరకాల పేర్లతో మహిళలతో చాటింగ్ చేస్తాడు. ఇందులో భాగంగా, పల్లవి అనే ఒక పారా సైకాలజీ స్టూడెంట్ తో, ఓమనకుట్టన్‌తో చాట్ చేస్తాడు. వీళ్ళు కొద్ది రోజులు బాగా మాట్లాడుకుని ఫ్రెండ్స్ అవుతారు. కానీ ఆమెకు ఓమనకుట్టన్ ఎలా ఉంటాడో కూడా తెలియదు. ఒక రాత్రి పని నుండి తిరిగి వస్తుండగా, టాక్సీ డ్రైవర్ ఓమనకుట్టన్ తలకు ఆక్సిడెంట్ చేసి పారిపోతాడు.
ఓమనకుట్టన్ అమ్నీషియాతో ఒక డంప్ యార్డ్‌లో మేల్కొంటాడు. అతను గతం మరచిపోతాడు. తనని తానూ గుర్తు గుర్తుచేసుకోలేక, ఫోన్‌లోని నంబర్లు డయల్ చేస్తాడు. కానీ ప్రతి ఒక్కరూ అతన్ని వేర్వేరు పేర్లతో పిలుస్తారు. ఇది అతన్ని మరింత గందరగోళానికి గురిచేస్తుంది. హైవేలో నిలబడి లిఫ్ట్ కోరుతూ, పల్లవి కారులోకి ఎక్కుతాడు. ఆమె అతన్ని చారిటీ కేస్‌గా తీసుకుని, ఆమె ఇంటికి తీసుకెళ్తుంది. కానీ ఆమెకు అతను తన చాటింగ్ పార్ట్‌నర్ అని తెలియదు.
ఇప్పుడు ఇద్దరూ కలిసి తన ఐడెంటిటీ కోసం పోరాడతారు. పల్లవి తన వారసత్వం పొందడానికి ఓమనకుట్టన్‌తో ఫేక్ మ్యారేజ్ చేసుకుంటుంది. కానీ ఆమె తల్లిదండ్రులకు విషయం తెలియడంతో సమస్యలు మొదలవుతాయి. ఓమనకుట్టన్ తన మెమరీ లాస్ వల్ల, పల్లవి ఆమె స్నేహితులు సహాయంతో తన గతాన్ని ట్రేస్ చేస్తాడు. ఓమనకుట్టన్ తన ఫేక్ ఐడెంటిటీల మధ్య చిక్కుకుని, పల్లవితో రొమాన్స్, మిస్టరీ ఎలిమెంట్స్ మిక్స్ అవుతాయి. క్లైమాక్స్‌లో ట్విస్ట్‌లు రివిలేషన్స్ అవుతాయి. చివరికి ఓమనకుట్టన్ కి గతం గుర్తుకు వస్తుందా ? పల్లవితో అతని సంబంధం డెవలప్ అవుతుందా ? అనే ప్రశ్నలకు సమాధానాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
‘ఓమనకుట్టన్ సాహసాలు’ (Adventures of Omanakuttan) 2017లో విడుదలైన మలయాళం కామెడీ-థ్రిల్లర్ చిత్రం. రోహిత్ వి.ఎస్. దర్శకత్వంలో, 4ఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఆంటనీ బినాయ్, బిజు పులికల్ నిర్మించారు. ఈ చిత్రంలో అసిఫ్ అలీ (ఓమనకుట్టన్), భవన (పల్లవి), అజు వర్గీస్ (శివ), సైజు కురుప్ (ఫిలిప్), సిద్దీక్ (చంద్రశేఖర్), కలభవన్ షాజాన్ (వినాయక్ హెగ్డే), శ్రింద (మల్లిక), వి.కె. ప్రకాష్ (పల్లవి తండ్రి), ఆర్యా రోహిత్ (పల్లవి తల్లి) ప్రధాన పాత్రల్లో నటించారు. 2017మే 19న విడుదలైన ఈ చిత్రం, 2 గంటల 46 నిమిషాల రన్‌టైమ్ తో IMDb 6.2/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం Sun NXTలో మలయాళంలో, తెలుగు సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్‌లో ఉంది.
Read Also : శవాన్ని దాచడానికి మాస్టర్ ప్లాన్… చెఫ్‌తో పెట్టుకుంటే ఇదే గతి… గ్రిప్పింగ్ కన్నడ క్రైమ్ థ్రిల్లర్