Karthika Deepam Deepa : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ రేటింగ్ సీరియల్ అంటే టక్కున గుర్తొచ్చేది కార్తీకదీపం. ఈమధ్య ఈ సీరియల్ ని మించి వేరే ఏ సీరియల్ డిఆర్పి రేటింగ్ ని సొంతం చేసుకోలేదు. స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ వస్తుంది. ఇందులో నటించిన వంటలక్క పేరు మాత్రం ప్రతి ఇంట్లో వినిపిస్తుంది.. కేరళకు చెందిన నటి అయినా కూడా తెలుగులో ఎంతో చక్కగా హవ భావాలను వ్యక్తపరుస్తూ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది.. ఈమె రియల్ లైఫ్ గురించి ఈమధ్య రోజుకో వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. తాజాగా ఈయన భర్త గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.. ఆయన ఎవరు? ఏం చేస్తారో ఒకసారి తెలుసుకుందాం..
వంటలక్కగా తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ అయ్యింది ఈ కేరళ కుట్టి ప్రేమి విశ్వనాథన్.. గతంలో వచ్చిన కార్తీకదీపం సీరియల్ ద్వారా తెలుగులోకి అడుగు పెట్టింది. ఈ సీరియల్ మంచి సక్సెస్ ని అందుకోవడంతో ప్రస్తుతం దీనికి సీక్వల్గా సీజన్ 2 ప్రసారం అవుతుంది. మొదటి పార్ట్ కంటే రెండు పార్టీలో స్టోరీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇందులో కూడా వంటలకు పాత్రలో ప్రేమీ విశ్వనాధ్ నటిస్తున్నారు.. విశ్వనాథన్ భర్త గురించి చాలా మందికి తెలియదు. కానీ ఇండస్ట్రీలో అతడు కూడా చాలా ఫేమస్. దేశ వ్యాప్తంగా చాలా పేరున్న వ్యక్తి.. డాక్టర్ వినీత్ భట్ ప్రముఖ జ్యోతిష్య నిపుణులు.. 2017లో వరల్డ్ బెస్ట్ ఆస్ట్రాలజర్ గా గుర్తింపు పొందారు. అలాగే మలయాళీ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా పనిచేశారు..
సినీ నిర్మాతగా ఆయన పలు సినిమాలను నిర్మించారు..ప్రస్తుతం ఈరోజు నటిగా తాను మంచి పేరు తెచ్చుకోవడానికి కారణం తన భర్త వినీత్ అని చాలాసార్లు చెప్పుకొచ్చారు ప్రేమి విశ్వనాథ్.. అతని లేకపోతే నేను తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందే దాని కాదు అని గతంలో చాలా ఇంటర్వ్యూలలో వంటలక్క బయటపెట్టింది. తన భర్తకే నా క్రెడిట్ దక్కుతుందని చెప్తుంది. ఇక ఈమె ప్రస్తుతం కార్తీకదీపం 2 సీరియల్ కు లక్షకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఇకపోతే సోషల్ మీడియాలో ఈమె ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన కొడుకుతో ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. కేరళ అమ్మాయి అయ్యింది తెలుగులో ఇంతగా ఫేమస్ అవడం మామూలు విషయం కాదు.. యాంకర్ సుమ తర్వాత ఎక్కువగా వంటలక్క వేరే వినిపిస్తుంది.. ఎందుకంటే ఈమె అంతగా పాపులర్ అయింది. ఈమధ్య బోల్డ్ లుక్ లో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు ఇప్పటికీ ట్రోల్స్ ను అందుకుంటున్నాయి.. ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ లో మాత్రమే నటిస్తోంది. ఇక పండగ స్పెషల్ గా వచ్చిన బుల్లితెర ఈవెంట్లలో ఈమె సందడి చేస్తూ వస్తుంది..