Nindu Noorella Saavasam Serial Today Episode: దీపావళి సాయంత్రం దీపాల వెలుగుల్లో మిస్సమ్మ ప్రాణాలు పోయేలా ప్లాన్ చేస్తుంది మనోహరి. అందుకోసం మిస్సమ్మ శారీ తీసుకొచ్చి మండే స్వభావం ఉన్న స్ర్పేను శారీకి చేస్తుంది. మళ్లీ ఆ శారీని తీసుకెళ్లి మిస్సమ్మ రాక్‌లో పెడుతుంది. అంతా గమనించిన ఆరు భయపడుతుంది. ఎలాగైనా మిస్సమ్మను కాపాడాలని ఆలోచిస్తుంది. కానీ ఎలా కాపాడాలో అర్థం కాక బాధపడుతుంది. తర్వాత సాయంత్రం అవుతుంది.
పిల్లలు బయటకు ఇంటి ముందుకు వెళ్లి దీపాలు వెలిగిస్తుంటారు. ఇంతలో ఆకాష్ లోపలకి వెళ్లి టపాకాయలు తీసుకొస్తాడు. దీపాలు వెలిగించడం అయిపోయాక పిల్లలందరూ కలిసి టపాసులు కాలుస్తుంటారు. లోపల మిస్సమ్మ స్ప్రే చేసిన శారీని కట్టుకుని బయటుక రావడానికి రెడీ అవుతుంది. ఇంతలో ఆరు పిల్లల దగ్గరకు వెళ్లి టపాసులు కాల్చొద్దని.. దీపాల వెలిగించొద్దని చెప్తుంది. ఆరు ఎంత చెప్పినా పిల్లలకు వినిపించదు.. పైగా ఇంకా ఎక్కువ టపాసులు కాలుస్తుంటారు. ఇంతలో అమర్, మిస్సమ్మ బయటకు వస్తారు. పిల్లల దగ్గరకు వెళ్లి టపాసుల కాలుస్తుంటారు.
ఆరు బయపడుతుంది. మనోహరి వచ్చి ఇంకా మంటలు మిస్సమ్మకు అంటుకోలేదని డిసప్పాయింట్ అవుతుంది. వెంటనే అమ్మును పిలిచి గేటు దగ్గర దీపాలు ఆరిపోయాయని వాటిని వెలిగించమని చెప్తుంది. అలాగేనని అమ్ము వెళ్తుంటే.. వెనకే వెళ్తున్న చంభా అమ్ము కింద పడేలా చేస్తుంది. అమ్ము కింద పడిపోగానే.. చేతిలో దీపాలు వెళ్లి మిస్సమ్మ శారీ మీద పడతాయి. దీంతో మిస్సమ్మ శారీకి మంటలు అంటుకుంటాయి. అందరూ షాక్ అవుతారు. మనోహరి హ్యాపీగా ఫీలవుతుంది. వెంటనే అమర్ ఫైర్ ఎమర్జెన్సీ కిట్ తో మంటలు ఆర్పేసి మిస్సమ్మను లోపలికి తీసుకెళ్తాడు అమర్.
తర్వాత మిస్సమ్మ కట్టుకున్న ఆ శారీని తీసుకొచ్చి హాల్లో ఉన్న రాథోడ్‌కు ఇస్తాడు అమర్. దీన్ని తీసుకెళ్లి ఫోరెన్సీక్ ల్యాబ్ లో ఇవ్వు అని చెప్తాడు. దీంతో రాథోడ్ ఎందుకు సార్ ఏమైంది అని అడగ్గానే.. ఆ శారీతో భాగీని చంపాలని చూశారు అని అమర్ చెప్తాడు. దీంతో మిస్సమ్మ భయంతో చీరతో నన్నెలా చంపుతారండి.. అయినా అది నా ర్యాక్ ఉన్నది.. ఎవ్వరూ తీసుకోలేదు.. కదా..? అంటూ ప్రశ్నిస్తుంది మిస్సమ్మ.. దీంతో ఈ శారీని ఎవరో బయటకు తీసశారు. ఈ శారీ మీద మండే స్వభావం ఉన్న ఒక కెమికల్ ను స్ప్రే చేసి తిరిగి అక్కడే పెట్టారు…అంటూ అమర్ చెప్పగానే.. మిస్సమ్మ షాక్ అవుతుంది. నా రాక్ లో ఉన్న చీర నేను ఎలా పెట్టానో అలాగే ఉంది. కానీ దాన్ని బయటకు తీసి మరీ మళ్లీ ఎప్పటిలాగా పెట్టారా…? అని అనుమానిస్తుంది.
అవును భాగీ ఎవరో నిన్ను ఫైర్ యాక్సిడెంట్ లో చంపాలని ప్లాన్ చేశారు.. అని చెప్పగానే అందరూ షాక్ అవుతారు. పిల్లలు భయపడిపోతారు. మనోహరి భయంతో వణికిపోతుంది. ఎక్కడ తను బయట పడతానోనని మనసులో అనుకుంటుంది. ఇంతలో అమర్ ఇంట్లో ఉన్న వాళ్లందరూ వాళ్ల ఫింగర్ ఫ్రింట్స్ ఇవ్వాలి. అవన్నీ ల్యాబ్‌కు పంపించాలి. అక్కడ ఈ ఫింగర్ ఫ్రింట్స్ తో శారీ మీద ఉన్న ఫింగర్ ఫ్రింట్స్ మ్యాచ్ చేసి చూస్తారు. అప్పుడు ఎవరు స్ర్పే చేశారో తెలుసుకోవచ్చు అని అమర్ చెప్పగానే.. అందరూ ఫింగర్ ఫ్రింట్స్ ఇస్తారు. మనోహరి భయంతో అలాగే చూస్తుంటే.. రాథోడ్ పిలుస్తాడు. మనోహరి గారు మీరు ఇద్దరు కూడా వచ్చి మీ ఫింగర్ ఫ్రింట్స్ ఇవ్వండి అంటాడు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.