OTT Movie : గ్రామీణ భారతదేశంలో మత దురాచారాలపై విమర్శనాత్మకంగా ఒక సినిమా తెరకెక్కింది. సుష్మితా సేన్, మిథున్ చక్రవర్తి అద్భుతంగా నటించినా కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ బాంబ్ గా నిలిచింది. అయితే ఈ సినిమా ఆర్ట్ సినిమా ప్రియులను ఆకట్టుకుంది. ఈ కథ వేశ్యల జీవితాలు, మత దురాచారాల చుట్టూ తిరుగుతుంది. ఈ స్టోరీ ఒక వేశ్య తన జీవితంలో ఎదుర్కునే సంఘటనల చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
రంగ్‌పూర్ గ్రామంలో, బడ్లాపూర్ జిల్లాలో, బసంతి తన కూతురు తితలీతో కలిసి లాల్ బట్టీ అనే వేశ్యల వీధిలో జీవిస్తుంటుంది. ఆమె జీవితంలో ఎన్నో అవమానాలు పడుతుంది. కానీ ఆమె తన కూతురికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటుంది. ఒకరోజు గ్రామంలో కొత్తగా నియమితుడైన పోస్ట్‌మాన్ చందన్ మిశ్రా రాకతో, ఆమె చీకటి జీవితంలోకి ఒక వెలుగు వస్తుంది. నారాయణ అనే పోస్ట్‌మాస్టర్ ఆధ్వర్యంలో చందన్ పని చేస్తుంటాడు. అతను గ్రామంలోని వేశ్యలతో దూరంగా ఉండమని చందన్ కు సలహా ఇస్తాడు. అయితే చందన్ తితలీతో స్నేహం చేసి, బసంతి బాధలను చూసి ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు. వీళ్ళు ప్రేమలో కూడా పడతారు. బసంతితో మీకు మంచి జీవితం ఇస్తానని చందన్ మాట ఇస్తాడు. అయితే గ్రామంలోని కాళీ దేవి ఆలయ పూజారి భువన్ పండా, అఘోరి రిచ్యువల్స్ ను చేస్తుంటాడు. అంతే కాకుండా అతను బసంతికి రెగ్యులర్ కస్టమర్.
అతను గ్రామస్తులను మతం పేరుతో భయపెడుతూ పబ్బం గడుపుకుంటూ ఉంటాడు. చందన్ ప్రేమ అతనికి అసూయ పుట్టిస్తుంది. వీళ్ళ సంబంధాన్ని నాశనం చేయడానికి ఒక దుర్మార్గమైన పథకం రూపొందిస్తాడు. అతను చందన్‌ను హత్య చేస్తాడు. బసంతి వివాహం కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఇలా జరగడంతో ఆమె హృదయం విరిగిపోతుంది. ఈ దుర్ఘటన బసంతిలో తీవ్ర ఆవేశంతో రగిలిపోతుంది. భువన్ పండాపై రివేంజ్ తీర్చుకోవాలనుకుంటుంది. చివరికి ఆమె రివేంజ్ తీర్చుకుటుందా ? వేశ్యగానే బతుకుతుందా ? అనే విషయాలను ఈ సినిమాని చూసి తెలుసుకోండి.
‘చింగారి’ (Chingaari) 2006లో విడుదలైన హిందీ సోషల్ డ్రామా చిత్రం. ఇది కల్పనా లాజ్మీ దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రం భూపెన్ హజారికా రాసిన ‘The Prostitute and the Postman’ నవల ఆధారంగా తీయబడింది. ఇందులో సుష్మితా సేన్, మిథున్ చక్రవర్తి, అనుజ్ సాహ్నీ, ఇలా అరుణ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా 2006 ఫిబ్రవరి 17న థియేటర్లలో విడుదలై, ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, షెమరూమీలో హిందీ అడియోతో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది.