Illu Illalu Pillalu Today Episode October 29th : నిన్నటి ఎపిసోడ్ లో.. ధీరజ్ కోసం రామరాజు కుటుంబం పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. అక్కడ మా వాడు ఏ నేరం చేయలేదండి ఎంత చెప్పినా సరే.. కేసు పెట్టిన వ్యక్తి మాత్రం అస్సలు వినడు.. నా కూతురిని నేనే దగ్గరుండి మీ కొడుకు కారులో ఎక్కించాను ఆ తర్వాత నుంచి మా అమ్మాయి కనిపించడం లేదు. మీ వాడే కిడ్నాప్ చేశాడు మా అమ్మాయిని క్షేమంగా మా ఇంటికి తీసుకు రమ్మని చెప్పండి.. అప్పుడు రామరాజు మా కొడుకు ఏ తప్పు చెయ్యండి వాడికి ఇద్దరు అక్కలు ఉన్నారు అమ్మాయిలు విలువ వాడికి తెలుసు అని ఎంత చెప్పిన సరే ఆ వ్యక్తి వినడు.. రామరాజుని దారుణంగా అవమానిస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. నర్మదా ప్రేమ ఇద్దరు కూడా అక్కడ ఉన్న కానిస్టేబుల్ తో మాట్లాడుతారు. ఏంటి ఏమైంది అనేది తెలుసుకోండి బాబాయ్ గారు మీకు పుణ్యం ఉంటుంది అని బ్రతిమలాడుతారు. ఆ కానిస్టేబుల్ అసలు విషయాన్నీ కనుక్కొని వాళ్ళకి చెప్తాడు.. ధీరజ్ అన్నవరానికి క్యాబ్ బుక్ చేసుకుని ఉంది. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలోనే ఆ అమ్మాయిని అల్లరి చేయడం మొదలుపెట్టారు దాంతో అమ్మాయి బాధ పడుతుందని నేనే అమ్మాయిని మళ్లీ వాళ్ళ ఇంటిదగ్గర వదిలి పెట్టాను. అయితే ఆ తర్వాత మిస్సయింది అంటే నాకే అర్థం కావట్లేదు అని ధీరజ్ కానిస్టేబుల్ తో చెప్తాడు అదే విషయాన్ని ప్రేమ నర్మదతో చెప్తారు.
ఇక వాళ్ల గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా అమ్మాయి వాళ్ళ నాన్నని అడగాలని అనుకుంటారు. వాళ్ల నాన్న వీడే కిడ్నాప్ చేశారు మళ్ళీ వాళ్ళు ఎవరో అని అంటారేంటి ఎందుకు మీకు ఆ నెంబర్స్ అని అడుగుతాడు. మీరు ముందు ఇవ్వండి సార్ వాళ్ళ ఫ్రెండ్స్ ని అడిగి అమ్మ ఎలా వెళ్లిందో మేము చూసి చెప్తాము అని బ్రతిమలాడుతారు.. ఇక అతను ఆ నెంబర్ ఇవ్వడానికి ఒప్పుకుంటాడు.. ప్రేమ నర్మదా ఈ విషయాన్ని వెంటనే ఇంటికి వెళ్లి అత్తయ్యతో చెప్పాలి అని అనుకుంటారు.
వేదవతి దగ్గరికి వెళ్లి మేము అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు కదా.. వాళ్ళ దగ్గర నుంచి అమ్మాయిని తీసుకురావడానికి వెళ్తున్న అత్తయ్య మీరు ఈ విషయాన్ని మావయ్యకి చెప్పండి అని అంటుంది. అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు వాళ్ళ దగ్గరికి మీరు వెళ్తారు అంటారా? ఇది ఏమైనా బాగుందా భయం లేకుండా మీరు ఈ పని చేస్తారా అని వేదవతి అడుగుతుంది.. ఈ విషయం పోలీసులకు చెప్తే వాళ్లే చూసుకుంటారు కదా అని వేదవతి అంటే పోలీసులు వాళ్ల పని వాళ్ళు చేసుకుంటారు తప్ప ఇలాంటివి చెయ్యరు అని నర్మదా అంటుంది.
ని కాపాడటం మంచిపనే కదా మరి ఈ విషయాన్ని మీ మామయ్యకి చెప్తే ఏమవుతుంది మీ మామయ్య అన్ని చూసుకుంటాడు కదా అనేసి వేదవతి అంటుంది.. ఆడవాళ్లు మీరు ఇలాంటి పని చేశారంటే మావయ్య కచ్చితంగా అరుస్తారు మామకి తెలియకుండా మనం అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ నాన్నకు అప్పగించాలి అని అంటుంది. అయితే మీ వెంట నేను కూడా వస్తాను మిమ్మల్ని పంపిస్తే మీకు ఏదైనా జరిగితే ఆయన నన్ను చంపేస్తాడు అని వేదవతి వాళ్ళతో వెళ్లాలని అనుకుంటుంది.. కిడ్నాప్ అంటే రన్నింగు చేజింగ్ అన్ని ఉంటాయి. వాటన్నిటిని మీరు తట్టుకోలేరు అని నర్మదా అంటుంది.
శ్రీకృష్ణుడు కూడా యుద్ధంలో వెళ్లలేదు రధం మీద కూర్చొని ఉన్నాడు కానీ యుద్ధం గెలిచారు. ఇది గుర్తుపెట్టుకోండి నేను కూడా మీతో వస్తాను అని వేదవతి అంటుంది. శోభ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి నువ్వు ఆ అమ్మాయి గురించి నిజాలు చెప్పాలి అసలు అన్నవరం కి ఎందుకు మీరు వెళ్ళలేదు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది నర్మదా. వాళ్ళిద్దరే కిడ్నాప్ చేశారని నాకు అనుమానంగా ఉందని ఆ అమ్మాయి అంటుంది. అనుమానం కాదు అది నిజమే వాళ్ళిద్దరే కిడ్నాప్ చేశారు.. వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ల గురించి వివరాలు చెప్పు అని అడిగితే అమ్మో వాళ్ళు నన్ను ఏమైనా చేస్తారేమో అని భయపడుతుంది. నీరసం చూసి కన్నీళ్లు పెట్టుకున్న రామరాజు అతని కోసం టిఫిన్ తెచ్చి ఇస్తాడు.
నర్మదా ఆడవాళ్ళు ఇలా భయపడ్డామల్లే మగవాళ్ళు రెచ్చిపోతున్నారు.. ఆ అమ్మాయి నీ ఫ్రెండే కదా.. అమ్మాయిని కాపాడాలని నీకు లేదా ముందు ఆ నెంబర్లు చెప్పు అని అనగానే ఆ అమ్మాయి నెంబర్లు ఇస్తుంది.. బయటికి రాగానే నర్మదా ఒకరికి ఫోన్ చేస్తుంది. నాకు తెలియక అడుగుతాను కిడ్నాప్ చేసిన వాళ్ళు ఫోన్ స్విచ్ ఆన్ చేసుకుని ఉంటారా ఆఫ్ చేసి ఉంటారు కదా అని వేదవతి అంటుంది. అప్పుడే అక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దాంతో నర్మదా మీ నోరుకొక దణ్ణం తల్లి ఏమంటే అదే జరిగిపోతుంది మీరు కాసేపు నోరు మూసుకొని ఉండండి అని అంటుంది..
Also Read : పల్లవి కళ్లు తెరిపించిన కమల్.. తాగొచ్చిన శ్రీకర్, శ్రీయ.. ఇంట్లోంచి వెళ్ళిపోతార..?
అయినా చిన్న దొంగతనాలు చేసిన వాళ్లే ఊరు వదిలి పారిపోతున్నారు అలాంటిది ఇంత పెద్ద నేరం చేసిన వాళ్ళు ఫోన్ ఆన్ చేసుకుని ఎలా ఉంటారు అని అడుగుతుంది. ఫోను లాస్ట్ కాల్ లొకేషన్ ని పట్టుకొని మనం వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు కదా కానీ ప్రేమ సలహా ఇస్తుంది.. ప్రేమ సలహా విన్న వేదవతి నా కోడలు ఎంత మంచిదో నా మేనకోడలు గ్రేట్ అంటూ పొగడ్తలు వర్షం కురిపిస్తుంది. నర్మదను ఆ లొకేషన్ గురించి తెలుసుకోమని అడుగుతుంది. మొత్తానికి ఆ ఇద్దరు లొకేషన్ ని పట్టుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…