E-Paper
Advertisement

ఫోన్ కెమెరా బాగున్నా ఫోటోలు బాగా రావడం లేదా? ఈ తప్పులు వెంటనే మానేయండి!

ఫోన్ కెమెరా బాగున్నా ఫోటోలు బాగా రావడం లేదా? ఈ తప్పులు వెంటనే మానేయండి!
Advertisement

Mobile photography mistakes: ప్రస్తుతం అందరి చేతుల్లోనూ వేల రూపాయల విలువైన కెమెరాలతో..ఉండే స్మార్ట్‌ ఫోన్‌లు ఉంటున్నాయి. అయినప్పటికీ కొందరి ఫోటోలు మాత్రం చాలా బ్లర్‌గా లేదా డల్‌గా వస్తుంటాయి. దీనికి కారణం కెమెరా క్వాలిటీ తక్కువగా ఉండటం కాదు. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే. మీ ఫోన్‌ కెమెరా ఎంత బాగున్నా, ఈ తప్పులు మీ ఫోటోలను పాడు చేస్తున్నాయి. వాటిని వెంటనే ఎలా సరిదిద్దుకోవాలో, ప్రొఫెషనల్ ఫోటోలు ఎలా తీయాలో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం.

1. కెమెరా లెన్స్‌:

మనం రోజూ ఫోన్‌ను చేతిలో పట్టుకోవడం, టేబుల్స్ మీద పెట్టడం చేస్తుంటాం. ఈ క్రమంలో ఫోన్ వెనుక ఉండే కెమెరా లెన్స్‌పై వేలిమద్రలు, దుమ్ము, లేదా నూనె మరకలు పడిపోతుంటాయి. ఈ మురికిని క్లీన్ చేయకుండా నేరుగా ఫోటోలు తీస్తే, లైట్ రిఫ్లెక్ట్ అయి ఫోటోలు అన్నీ బ్లర్‌గా, మసకబారినట్లు వస్తాయి. కాబట్టి ఫోటో తీసే ముందు ఒక మెత్తటి క్లాత్ తో కెమెరా లెన్స్‌ను శుభ్రంగా తుడిచేయడం అలవాటు చేసుకోండి. ఈ ఒక్క చిన్న మార్పు మీ ఫోటో క్వాలిటీని రెట్టింపు చేస్తుంది.

2. డిజిటల్ జూమ్ అతిగా వాడటం :

Advertisement

కొన్నిసార్లు దూరంగా.. ఉన్న వస్తువులను లేదా వ్యక్తులను ఫోటో తీసేటప్పుడు మనం స్క్రీన్‌పై జూమ్ చేస్తుంటాం. ఆప్టికల్ జూమ్ కాకుండా.. సాధారణ డిజిటల్ జూమ్‌ను ఎక్కువగా వాడితే ఫోటోలోని పిక్సెల్స్ ఫాట అయిపోయి, ఫోటో మసకగా వస్తుంది. దీనికి బదులుగా మీరు సబ్జెక్ట్ ఉన్న దగ్గరికి.. వెళ్లడం మంచిది లేదా ఫోటో తీశాక అవసరమైన మేరకు క్రాప్చేసుకోవడం బెస్ట్ అని చెప్పొచ్చు.

3. ఫ్లాష్ లైట్ ప్రతిసారీ ఆన్ చేయడం :

చాలా మంది రాత్రి సమయంలోనే కాకుండా.. పగటి పూట లేదా ఇండోర్స్‌లో కూడా కెమెరా ఫ్లాష్ లైట్ ఆన్ చేసి ఫోటోలు తీస్తుంటారు. దీని వల్ల వస్తువులపై అతిగా వెలుగు పడి ముఖం తెల్లగా మారడం లేదా అసహజమైన నీడలు ఏర్పడడం జరుగుతుంది. ఫ్లాష్ లైట్‌కు బదులుగా నేచురల్ లైటింగ్ లేదా రూమ్ లోని ఇతర లైట్లను ఉపయోగించడం ద్వారా ఫోటోలు చాలా సహజంగా, అందంగా వస్తాయి.

4. గ్రిడ్ లైన్స్ ఆన్ చేయకపోవడం:

Advertisement

ఫోటో తీసేటప్పుడు ఫోన్ స్క్రీన్‌ను నేరుగా.. పట్టుకోలేకపోవడం వల్ల హారిజోన్ వంకరగా వస్తుంటుంది. దీనిని సరి చేయడానికి కెమెరా సెట్టింగ్స్‌లో Grid Lines ఆప్షన్‌ను ఆన్ చేసుకోవాలి. ఇది రూల్ ఆఫ్ థర్డ్స్ ప్రకారం సబ్జెక్ట్‌ను పర్ఫెక్ట్ యాంగిల్‌లో సెట్ చేయడానికి.. ఎంతగానో సహాయ పడుతుంది. ఫోటోలు ప్రొఫెషనల్ లుక్‌లో రావడానికి ఇది చాలా ముఖ్యం.

Also Read: ఫ్రిజ్ లైఫ్ పెరగాలంటే.. ఈ చిన్న పని చేయాల్సిందే!

5. ఫోకస్, ఎక్స్‌పోజర్ లాక్ చేయకపోవడం:

మనం స్క్రీన్ మీద ట్యాప్ చేయకుండానే నేరుగా షట్టర్ బటన్ నొక్కేస్తుంటాము. దీని వల్ల కెమెరా ఏ సబ్జెక్ట్‌పై ఫోకస్ చేయాలో సరిగ్గా గమనించలేదు. ఫోటో తీసే ముందు స్క్రీన్ పై మెయిన్ సబ్జెక్ట్‌ను ట్యాప్ చేసి Focus & Exposure లాక్ చేస్తే.. లైట్ సరిగ్గా సరిపోయి అద్భుతమైన క్లారిటీతో ఫోటోలు వస్తాయి.

మంచి ఫోటోలు రావడానికి కెమెరా క్వాలిటీతో ఫోన్‌లతో పాటు సరైన టెక్నిక్స్ కూడా చాలా ముఖ్యం. పైన పేర్కొన్న చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుకోవడం ద్వారా మీరు కూడా మీ స్మార్ట్‌ఫోన్‌తో ప్రొఫెషనల్ ఫోటోలను క్యాప్చర్ చేయవచ్చు. మీ ఫోటోగ్రఫీని మరింత నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లడానికి ఈ టిప్స్ కచ్చితంగా సహాయ పడతాయి.

Related News

కీబోర్డ్‌లో ‘స్పేస్ బార్’ అంత పెద్దగా ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు రహస్యం ఇదే!

ఫ్రిజ్ లైఫ్ పెరగాలంటే.. ఈ చిన్న పని చేయాల్సిందే!

స్పోర్ట్స్ ఇయర్‌బడ్స్ కొనేముందు..ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి!

చాటింగ్ సీక్రెట్స్..ఆన్‌లైన్‌లోకి రాకుండానే వాట్సాప్ మెసేలు చదవడం ఎలా?

డిలీట్ అయిన ఫోటోలు మళ్లీ కావాలా? ఈ సీక్రెట్ సెట్టింగ్ మీ కోసమే

బెస్ట్ బ్లూటూత్ స్పీకర్..ఏఐ సౌండ్‌తో ఇల్లు దద్దరిల్లిపోతుంది

పాత టీవీ రిమోట్ పారేస్తున్నారా? ఈ 6 ట్రిక్స్ తెలిస్తే.. ఇంకెప్పుడు ఆ తప్పు చేయరు!

Big Stories

Advertisement
×