Bigg Boss Telugu 10 Mic Bag:తెలుగు ఆడియన్స్ ని గత తొమ్మిది సీజన్స్ గా అలరిస్తూ పదో సీజన్ లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఇపుడు మరింత జోష్ తో దూసుకుపోతున్న సంగతి తెల్సిందే.అయితే మనం ఎప్పుడూ కంటెస్టెంట్స్ హౌస్ లో ఆడే ఆటలు, చేసే టాస్క్ లు ,ఇచ్చే ఎంటర్ టైన్ మెంట్ పైనే ఫోకస్ పెట్టె మనం వాళ్ళ మెడలో వేలాడే ఒక ఒక బ్యాగ్ ని మాత్రం పెద్దగా పట్టించుకోము.
కానీ ఆ బ్యాగే హౌస్ లో కంటెస్టెంట్స్ కి చాలా ఇంపార్టెంట్ అన్న విషయం మీకు తెలుసా.మరింతకీ ఆ బ్యాగ్ ఏంటో ..అందులో ఏమేం ఉంటాయో ,అసలు దాన్ని ఏమంటారో చూసేద్దాం.
కంటెస్టెంట్స్ మెడలో వేలాడే ఆ బ్యాగ్ ని మైక్ ఫ్యాక్ లేదా మైక్రోఫోన్ ట్రాన్స్‌మిటర్ ప్యాక్’ లేదా ‘ట్రాన్స్‌మిటర్ బ్యాగ్’ అని అంటారు.ఇందులో స్పెషల్ గా డిసైన్ చేయబడిన మైక్రో ఫోన్ సిస్టమ్ ఉంటుంది.దీనిలో వైర్ లెస్ మైక్రో ఫోన్ కి సంబంధించిన ట్రాన్స్ మీటర్ యూనిట్,ఇక ఆ మైక్రో ఫోన్ పనిచేసేందుకు కావలసిన బ్యాటరీస్,అలాగే కావలసిన కనెక్షన్స్ ఉంటాయి.
వీటిద్వారానే కంటెస్టెంట్స్ హౌస్ లో ఏం మాట్లాడుకుంటున్నారు ,వాళ్ళ మధ్య ఏం జరుగుతుంది,హౌస్ లో ఏమైనా గొడవలు జరుగుతున్నాయా,మాట్లాడే గొంతు ఎవరిది? ఇలా అన్ని విషయాలు ఈ మైక్ ప్యాక్ ద్వారానే రికార్డ్ అవుతుంటాయి.
ఇక కంటెస్టెంట్స్ కాలర్ దగ్గరకాని,చాతి దగ్గర కాని సెట్ చేసుకునే మైక్ కి మైక్ ఫ్యాక్ నుండి కనెక్షన్ ఉంటుంది.దీని వల్లే కంటెస్టెంట్స్ నడిచినా,కూర్చున్నా,మాట్లాడినా, ఎం చేసినా ఆడియో క్యాప్చర్ అయ్యి మైక్ ప్యాక్ కి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి ఆ ఆడియో సిగ్నల్ ట్రాన్స్‌మిటర్ ద్వారా ప్రొడక్షన్ టీమ్‌కు చేరుతుంది. దీంతో హౌస్‌లో ఉన్న ప్రతి కంటెస్టెంట్‌కు సంబంధించిన ఆడియోను ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తుంది ప్రొడక్షన్ టీమ్ .
కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఈ మైక్ ఫ్యాక్ తలా ఒకటి మెడలో వేసేస్తారు .హౌస్ లో నుండి కంటెస్టెంట్స్ బయటికి వెళ్ళేంత వరకు ఇది వాళ్ళ మెడలో ఉండి తీరాల్సిందే.స్నానం చేసేటప్పుడు కాని ,లేదా స్విమ్మింగ్ పూల్ లోకి దూకినప్పుడు తప్ప మిగతా సమయాల్లో ఎప్పుడు కూడా ఇది కంటెస్టెంట్స్ మెడలో ఉంది తీరాల్సిందే.ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము.ఉదయం పూట మాములుగా మొదలైన డిస్కషన్ కూడా కాసేపు గడిచేసరికి పెద్ద గొడవకి దారి తీయొచ్చు.అందుకే ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడుకున్నారన్న విషయాలు కూడా మిస్ చేయకుండా మైక్ ప్యాక్ సహాయంతో రికార్డ్ చేస్తారు.
అయితే హౌస్ లో నార్మల్ గా సాగుతున్నప్పుడు కాకుండా ఎవరి మధ్య అయినా గొడవలు జరుగుతున్నప్పుడే చూసే ఆడియన్స్ కి క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది.అలాంటి సమయంలో ఈ మైక్ ఫ్యాక్ లో రికార్డ్ అయ్యే ఆడియోనే ఆ క్యూరియాసిటీని మరింత పెంచేస్తుంది,ఇక ఇందులో తోటి కంటెస్టెంట్స్ తమ తమ ఫ్యామిలీ గురించి గుర్తు చేసుకోవడం వంటివి ఎమోషనల్ టచ్ ఇస్తాయి. మొత్తంగా మైక్ ప్యాక్ అనేది కంటెస్టెంట్స్ కి కవచకుండలాల లెక్క అన్నమాట !
also read :67 ఏళ్లకే ప్రెగ్నెన్సీ అంటూ ట్రోలింగ్.. నీనా గుప్తా దిమ్మతిరిగే కౌంటర్!