Spacebar Design: కీబోర్డ్‌పై అన్ని బటన్లూ చిన్నగా ఉన్నప్పుడు ఒక్క స్పేస్ బార్ (Spacebar) మాత్రం ఎందుకంత పెద్దగా ఉంటుంది? అన్న ప్రశ్న ప్రతీ ఒక్కరికి ఎప్పుడోకప్పుడు ఎదురయ్యే ఉంటుంది. మరీ ముఖ్యంగా రోజూ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు వాడే వారిని ఈ సందేహం వెంటాడుతూనే ఉంటుంది. అయితే ఇది కేవలం కీబోర్డ్ డిజైన్ కోసం చేసిన మార్పు కాదు. దీని వెనుక అత్యంత ఆచరణాత్మకమైన, ఆసక్తికరమైన సైంటిఫిక్ కారణాలు ఉన్నాయి. అవేంటో ఈ కథనంలో చూద్దాం.
సాధారణంగా భాష తీసుకున్న రాసేటప్పుడు ప్రతి పదానికీ మధ్య స్పేస్ ఇవ్వడం తప్పనిసరి. కాబట్టి టైప్ చేయాల్సి వచ్చినప్పుడు అత్యధికంగా వాడే బటన్ స్పేస్ బారె. రెండు చేతులతో వేగంగా టైప్ చేస్తున్నప్పుడు చేతి వేళ్లు కీబోర్డ్ మధ్య భాగంలో కదులుతుంటాయి. ఈ సమయంలో రెండు చేతుల బొటనవేళ్లు (Thumbs) సహజంగానే కీబోర్డ్ కింద భాగానికి ఎలాంటి పనిచేయకుండా ఊరికే ఉండిపోతాయి. కాబట్టి స్పేస్ బార్ పెద్దగా ఉండటం వల్ల టైపింగ్ స్పీడ్ దెబ్బతినకుండా ఏ చేతి బొటనవేలితోనైనా సులభంగా నొక్కిందేకు ఈ పెద్ద స్పేస్ బటన్ ఉపయోగపడుతుంది.
అయితే ఈ పెద్ద స్పేస్ బార్ డిజైన్ ఇప్పటిది కాదు. 19వ శతాబ్దంలో టైప్‌రైటర్ల తయారీ నుంచే ప్రారంభమైంది. మొదటి తరం టైప్‌రైటర్లలో ప్రతి అక్షరం తర్వాత కాగితం ఒక అడుగు ముందుకు జరగడానికి ఒక మెకానికల్ లివర్‌ను వాడేవారు. కాలక్రమేణా టైపింగ్ చేసే వ్యక్తి ఏ క్షణంలోనైనా, కీబోర్డ్‌ను చూడకుండానే స్పేస్ ఇవ్వడానికి వీలుగా కీబోర్డ్ అడుగు భాగం మొత్తాన్ని ఒక పెద్ద బార్‌లా మార్చారు. అదే కంప్యూటర్ కీబోర్డ్‌లలోనూ కొనసాగుతూ వస్తోంది.
కీబోర్డుపై మిగతా అక్షరాల కీస్ ను గమనిస్తే అవి చిన్నగానే ఉంటాయి. వాటిని పూర్తి స్థాయిలో ఒకవేలితో నొక్కాల్సి ఉంటుంది. అటు స్పేస్ బార్ తరచుగా వాడే కీ కాబట్టి ప్రతిసారీ దానికోసం వేళ్లను వెతుక్కునే పనిలేకుండా కీబోర్డ్ కింద చాలా పెద్ద ప్లేస్ ను కేటాయించారు. దీనివల్ల వేగంగా టైప్ చేస్తున్నప్పుడు పొరపాటున పక్క కీలను నొక్కే ప్రమాదం ఉండదు.
Also Read: కైలాస పర్వతంపై అంతుచిక్కని 8 రహస్యాలు.. సైన్స్‌కే సవాల్ విసురుతున్న శివుని ఆవాసం!
మనిషి చేతుల ఆకృతికి సరిపోయేలా సాధనాలను రూపకల్పన చేయడాన్నే ‘ఎర్గోనామిక్స్’ అంటారు. టైప్ చేస్తున్నంత సేపు మిగతా వేళ్లు వేగంగా కదులుతున్నా, బొటనవేళ్లు మాత్రం కీబోర్డ్ దిగువన కదలకుండా ఉంటాయి. స్పేస్ బార్ అంత పొడవుగా ఉండటం వల్ల బొటనవేలికి ఎక్కువ ఒత్తిడి కలగకుండా కీబోర్డ్‌ను చూడకుండానే స్పేస్‌ను నొక్కడం సాధ్యమవుతుంది.
Also Read: పాత టీవీ రిమోట్ పారేస్తున్నారా? ఈ 6 ట్రిక్స్ తెలిస్తే.. ఇంకెప్పుడు ఆ తప్పు చేయరు!