Singer Jhansi Mother: తెలుగు బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 10 తెలుగు కార్యక్రమం ఎంతో ఘనంగా ప్రారంభమై మొదటి వారం పూర్తి చేసుకుని 16 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి వారం హౌస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ఇకపోతే ఈ వారం 11 మందికి నామినేషన్ లో ఉన్నారు. ఇక ఈవారం ఎవరు హౌస్ నుంచి బయటకు రాబోతున్నారనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఎప్పటిలాగే ఈ సీజన్ లో కూడా సెలబ్రిటీలతో పాటు కామన్ మ్యాన్ క్యాటగిరిలో భాగంగా అగ్నిపరీక్ష ద్వారా కామనర్స్ ను ఎంపిక చేసి హౌస్ లోకి ఆరుగురు కంటెస్టెంట్లను పంపించారు.
ఇలా కామనర్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన వారిలో రైతు బిడ్డ ఝాన్సీ(Jhansi) ఒకరు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఈమె తన తండ్రికి చేదోడువాదోడుగా పొలం పనులుచేస్తూనే మరోవైపు ఉన్నత చదువులు చదువుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఝాన్సీ అగ్నిపరీక్ష ద్వారా బిగ్ బాస్ కార్యక్రమానికి ఎంపిక అయ్యారు. అగ్నిపరీక్ష కార్యక్రమంలో తన ఆటతీరుతో అందరిని మెప్పించిన ఈమె డైరెక్ట్ గా బిగ్ బాస్ టికెట్ అందుకొని హౌస్ లోకి ఎంటర్ ఇచ్చారు. అయితే హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఈమె ఆట తీరు పూర్తిగా మారిపోయిందని, కట్టప్ప కంటే దారుణంగా వెన్నుపోటు పొడుస్తుంది అంటూ ఈమె పట్ల విమర్శలు వస్తున్నాయి.
ఝాన్సీ ఆటతీరు చూసి రైతుబిడ్డ పేరుతో సింపతి డ్రామాలు చేస్తున్నారని, పల్లవి ప్రశాంత్ చెల్లెలు అంటూ ఈమె పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ విమర్శలపై ఝాన్సీ తల్లి హేమలత (Hemalatha) స్పందిస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తన కుమార్తె ఝాన్సీ చాలా అద్భుతంగా ఆట ఆడుతుందని రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని లక్షల మంది తన కూతురిని అబిమానిస్తున్నారు. కానీ కొంతమంది మాత్రమే తనని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నా కూతురిని విమర్శించేముందు తన స్థానంలో మీ అక్క లేదా చెల్లెలు ఉంటే ఇలాగే విమర్శలు కురిపిస్తారా అంటూ మండిపడ్డారు.
కొన్ని లక్షల మంది తన కూతురుని అభిమానిస్తున్నారని వారి ఆశీర్వాదాలే తనని గెలిపిస్తాయని తెలిపారు. ఇలా తన కూతురు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం పట్ల హేమలత సంతోషం వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుంచి కూడా ఝాన్సీ ఎంతో కష్టపడి తత్వం కలదని, ఆ కష్టపడే స్వభావమే తనని ఈ స్థాయిలో నిలబెట్టింది అంటూ హేమలత తెలిపారు. ఇలా తన కూతురి గురించి వస్తున్న విమర్శలపై ఈమె స్పందిస్తూ కామెంట్లు చేయడంతో నెటిజన్స్ మీ కూతురిని ఎవరు కావాలని విమర్శలు చేయరు మీ కూతురు ఆట తీరు చూసే విమర్శిస్తున్నారు, ఈమె తొందరలోనే హౌస్ నుంచి బయటకు వస్తుంది అంటూ విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు.
Also Read: లండన్ లో జంటగా త్రిష విజయ్..త్రిష స్థానంలో నేనుంటే ఆ పని చేయను.. నటి ఫైర్!