Illu illaalu pillalu : స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. గత కొన్నేళ్లుగా ప్రసారమవుతున్న ఈ సీరియల్ అనేక ట్విస్టులతో ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటూ వస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో సీరియల్ కి కాస్త రేటింగ్ తగ్గిన కూడా.. మళ్లీ ఇప్పుడు మళ్లీ కడుపుతో ఉండడంతో రేటింగ్ అమాంతం పెరిగిపోయింది కూడా అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ సీరియల్ మళ్ళీ ఇప్పుడిప్పుడే ప్రేక్షకుల ఆదరణను పొందుతూ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఇలాంటి టైం లో ఈ సీరియల్ నుంచి విలన్ క్యారెక్టర్ సోషల్ మీడియాలో ఒక వార్త ప్రచారంలో ఉంది. అయితే ఈ సీరియల్ నుంచి భద్ర నిజంగానే తప్పుకుంటుందా? మరి భద్ర ప్లేస్ లో ఇంకెవరు విలన్ గా ఎంట్రీ ఇస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి నిజంగానే భద్ర ఈ సీరియల్ నుంచి తప్పుకుంటుందా లేదా అన్నది కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
తన చెల్లెలు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది అని అయితే అతను ఆ ఇంట్లో పనివాడు అని అప్పటినుంచి అతని మీద మాత్రమే కాదు.. తన చెల్లెలు మీద కూడా చాలా కోపంతో ఉండిపోతుంది ఈ సీరియల్ లో విలన్ గా నటిస్తున్న భద్రావతి. తను పెళ్లి చేసుకోవడానికి కారణమైన ఆ వ్యక్తి మీద ఎలాగైనా సరే పగ తీర్చుకోవాలి అని ఎప్పటికప్పుడు తన ప్రయత్నాలు చేస్తూ తన చెల్లెలి కుటుంబం పై పగ తీర్చుకునేందుకు సిద్ధంగానే ఉంటుంది. ఇటీవల కాలంలో భద్రావతి ఎన్ని ప్లాన్ వేసినా కూడా తన చెల్లెలు భర్త ఆయన రామరాజు కుటుంబం ఆ ప్లాన్లను తిప్పికొడుతూ భద్రకు ఎప్పటికప్పుడు షాక్ ఇస్తూనే ఉంటారు తన చెల్లెలితో పాటుగా తన మేనకోడలు కూడా ఆ ఇంట్లో వాడిని పెళ్లి చేసుకుని తనని బాగా బాధపెట్టింది. ఎలాగైనా సరే తన చెల్లెల్ని మేనకోడల్ని మళ్లీ వెనక్కి తెచ్చుకోవాలని భద్రావతి చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయిపోతుంటాయి. అయితే ఇప్పటికీ ఆ ఇంటిని వదలకుండా వాళ్లకి సుఖసంతోషాలు లేకుండా చేయాలి అని భద్ర అనుకుంటూ ఉంటుంది. అలాంటి ఒక క్యారెక్టర్ ఇప్పుడు ఈ సీరియల్ నుంచి తప్పుకుంటుందని ఒక వార్త ప్రచారంలో ఉంది. భద్రకు వేరే ఇండస్ట్రీ నుంచి అవకాశాలు క్యూ కట్టడంతోనే ఆమె ఈ సీరియల్ నుంచి తప్పుకుంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సీరియల్ లో మెయిన్ విలన్ క్యారెక్టర్ లో ఉన్న భద్ర ఈ సీరియల్ నుంచి తప్పుకుంటే.. నెక్స్ట్ ఈ సీరియల్ లో విలన్ పాత్రలో ఎవరు ఎంట్రీ ఇస్తారు అన్న ప్రశ్నలు కూడా అభిమానుల వినిపిస్తున్నాయి. మరి నిజంగానే భద్ర ఈ సీరియల్ నుంచి తప్పుకుంటుందా లేక ఇవి కేవలం సోషల్ మీడియా వార్తలేనా అన్నది ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఏది ఏమైనా కూడా ఈ సీరియల్ నుంచి భద్రతప్పుకుంటుంది అన్న వార్త మాత్రం రామరాజు అభిమానులకి ఫుల్ ఖుషి ఇస్తుంది అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ సీరియల్ లో నటిస్తున్న ప్రతి ఒక్క యాక్టర్ కూడా తమ నటనకి 100 శాతం న్యాయం చేస్తూ టీవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్నారు.. అలాంటి వారిలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ భద్రావతి కూడా ఒకరు. ఈ సీరియల్లో విలన్ గా నటిస్తూ ప్రేక్షకులని కాస్త చిరాకు తెప్పించిన కూడా ఆమె నటనకు మాత్రం ఫాన్స్ ఫిదా అయిపోతుంటారు.. భద్ర పాత్రలో నటిస్తున్న నటి అసలు పేరు దుర్గ. ఈమె గతంలో అనేక సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. సీరియల్ తో పాటుగా మరొక సీరియల్ లో కూడా ఈమె నటిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దీంతో పాటుగా మరో రెండు సీరియల్స్ ఆమెకు లైన్లో ఉండడంతో ఈ సీరియల్ నుంచి తప్పుకుంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే..ప్రస్తుతం రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగానే ఉంది. ఒక్క రోజుకి దాదాపు 20 వేల వరకు వసూలు చేస్తుందని సమాచారం.. ఈ లెక్కన ఈమె నెలకు 25 రోజులు షూటింగ్ ఉండడంతో లక్షల్లోని సంపాదిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది.
Also Read :Gundeninda GudiGantalu Today episode: అయ్యో సుమతికి ఏమైంది..? అరుణ్, బాలు గొడవ.. ఏడ్చిన ప్రభావతి..