E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode November 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అపర్ణ ను భయపెట్టిన భ్రమరాంబ 

Brahmamudi Serial Today Episode November 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అపర్ణ ను భయపెట్టిన భ్రమరాంబ 
Advertisement

Brahmamudi serial today Episode:  ఎవరో కొరియర్‌లో రాజు చిన్నప్పటి ఫోటోలు అపర్ణకు పంపిస్తారు. ఆ ఫోటోలు చూసిన అపర్ణ షాక్‌ అవుతుంది. ఈ ఫోటోలు పంపిచారు అంటే ఎవరో రాజును ఫాలో అవుతున్నారు. అసలు ఎవరు పంపించి ఉంటారు. వాళ్ల అడ్రస్‌ ఏమైనా రాశారా..? అంటూ చూసి ఫ్రమ్‌ అడ్రస్‌ కూడా లేదే అసలు ఎవరు పంపించి ఉంటారు అనుకుంటూ కంగారు పడుతుంటే.. అప్పుడే భ్రమరాంబ వచ్చి అదేంటి అపర్ణ గారు కొరియర్‌ వచ్చినప్పటి నుంచి మీరు భయపడినట్టు ఉన్నారు.. ఏం ఉంది కొరియర్‌లో అని అడుగుతుంది. ఆ కొరియర్‌ ఏంటో చూడనివ్వండి అంటూ తీసుకోబోతే అపర్ణ ఏం చూడొద్దు అంటూ పక్కకు లాక్కుంటుంది.

దీంతో భ్రమరాంబ మీకు అయిన వాళ్లు అందరూ చనిపోయారు. ఉన్న ఒక్క మనవరాలు ఇంట్లోనే ఉంది. మరి ఎవరు పంపించారు మీకు ఒకసారి చూడనివ్వండి అంటూ తీసుకోబోతే.. అపర్ణ కోపంగా తిడుతూ భ్రమరాంబ పక్క వాళ్లకు వచ్చిన కొరియర్‌ చూడకూడదని ఇంగితజ్ఞానం కూడా లేదా నీకు అంటూ కోపంగా తిడుతుంటే.. భ్రమరాంబ ఉత్తి కొరియర్‌కే ఏంటి ఇలా అయిపోతున్నారు అంటూ అనుమానంగా అడిగితే.. నేనేం అయిపోలేదు నువ్వు అయిపోతున్నావు.. అంటూ కొరియర్‌ తీసుకుని రూంలోకి వెళ్లిపోతుంది అపర్ణ. ఉత్తి దానికే ఏంటి ఇలా అయిపోతుంది. అసలు ఆ కవర్‌లో ఏముందో తెలుసుకోవాలి అని భ్రమరాంబ అనుకుంటుంది.

Advertisement

రూంలోకి వెళ్లిన అపర్ణ, తనకు వచ్చిన కోరియర్‌ కవర్‌ను సుభాష్‌కు చూపిస్తుంది. అందులోని ఫోటోలు చూసి సుభాష్‌ షాక్‌ అవుతాడు. అసలు ఈ ఫోటోలు ఇప్పుడు నీకెందుకు పంపించారు అని అడిగితే.. మనకే తెలిసిన రహస్యాన్ని మనకే గుర్తు చేశారు. అంటే ఇది ఎవరో మన గురించి బాగా తెలిసిన వాళ్లే అయి ఉంటారండి.. అది కూడా రాజు ఇంటికి వచ్చిన తర్వాత పంపించారు. అంటే ఈ రాజే ఆ రాజు అని వాళ్లకు కూడా తెలిసి ఉండాలి.. మనల్ని ఎవరో బెదిరించాలని చూస్తున్నారండి అంటూ అపర్ణ చెప్పగానే.. సుభాష్‌ షాక్‌ అవుతుంది. ఇన్నేళ్లు సీక్రెట్‌గా ఉన్న ఈ రహస్యాన్ని ఎవరు తెలుసుకుని ఉంటారు.. అప్పట్లో రుద్రాణి, ఇప్పుడు రేఖ తప్ప మనకు అన్యయం చేయాలని చూసేవాళ్లు ఎవరుంటారు అంటే.. అదే గుర్తు రావడం లేదండి ఎంత ఆలోచించినా గుర్తు రావడం లేదు అంటూ అపర్ణ చెప్తుంది.

తర్వాత అందరూ భోజనం చేస్తుంటే.. అపర్ణ మూడీగా ఉంటుంది. ఇందు కూర వేయమని అడిగితే పప్పు వేస్తుంది. దీంతో ఇందు ఏంటి నాన్నమ్మ  ఎక్కడున్నారు మీరు అంటే.. కొరియర్‌ దగ్గర అంటూ భ్రమరాంబ చెప్తుంది. కొరియర్‌ ఏంటని ఇందు అడిగితే.. జరిగింది మొత్తం భ్రమరాంబ చెప్తుంది. అమ్మమ్మ ఏం కొరియర్‌ వస్తే నీకేంటి అత్తా అంటూ రాజు అడ్డుపడతాడు. అప్పుడే రేఖ ఏంటి కొరియర్‌ మాకు కూడా చెప్పరా..? అంటే ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అంటూ ఇందు అంటే.. మన ఇంట్లో జరిగే విషయాలు మనం తెలుసుకోకూడదా..? అంటూ భ్రమరాంబ అడిగితే.. మీ ఇల్లు కాదు మాది ఇల్లు మీరు చాపకింద బొద్దింకల్లా దూరారు అంటూ అపర్ణ తిడుతుంది. రాజు ఏం మాట్లాడకుండా భోజనం చేయండి అంటాడు. అందరి మధ్య గొడవ జరుగుతుంది. మధ్యలో కల్పించుకున్న శేషు వాడి వేడిగా ఉన్న వాతావరణాన్ని కామెడీగా మార్చేస్తాడు.

Advertisement

తర్వాత రూంలోకి వెళ్లిన అపర్ణ భోజనం దగ్గర విషయం సుభాష్‌కు చెప్తుంటే.. ఇందు వెళ్తుంది. ఇందుకు రాజు ప్రాణగండం ఇంకా తప్పలేదని స్వామిజీ చెప్పిన విషయం చెప్తారు. అలాగే స్వామిజీ చెప్పిన హోమం, మంద్రదీక్ష గురించి చెప్తారు. అయితే రాజు వీటికి ఒప్పుకుంటాడా..? అని అపర్ణ, సుభాష్‌ అనుమానపడితే తాను రాజును ఒప్పిస్తానని ఇందు మాటిస్తుంది.

రేఖ రూంలో ఆలోచిస్తూ కూర్చుని ఉంటే భ్రమరాంబ వచ్చి అపర్ణ నువ్వు ఇక్కడున్నావా..? ఆ అపర్ణ రూంలో ఉన్నావేమో అనుకున్నాను అంటుంది. నేను అక్కడెందుకు ఉంటానని రేఖ అడిగితే.. నువ్వు నేను అనుకున్నట్టు అంత అమాయకురాలేం కాదు ఆ అపర్ణ. చాలా సైలెంట్‌ కిల్లర్‌ అని చెప్తుంది. ఆవిడ గురించి నీకు తెలియకపోవచ్చు కానీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అంటూ రేఖ చెప్తుంది. అయినా వినకుండా భ్రమరాంబ ఆవిడ ఏదో పెద్ద రహస్యమే దాచిపెడుతుంది అంటూ చెప్తుంటే.

రేఖ తిట్టి నన్ను విసిగించకు వదిన తప్పుకో అంటూ రేఖ వెళ్లిపోతుంది. మరోవైపు రాజు దగ్గరకు వెళ్లి ఇందు పూజ గురించి చెప్పి హోమాలు చేయడానికి ఒప్పిస్తుంది. తర్వాత రాజును హాస్పిటల్‌కు తీసుకెళ్తుంది. ఎందుకు హాస్పిటల్‌కు తీసుకొచ్చావు అని రాజు అడిగితే.. అంతకన్నా ముందు నీకో విషయం చెప్పాలి మన కొటేషన్‌ లీక్‌ చేసింది మన డిజైనర్‌ ప్రశాంత్‌ అని చెప్తుంది. అందుకు రాజు కోపంతో ప్రశాంత్‌ను పోలీసులకు పట్టిద్దామని అంటే దానికంటే ముందు మనం ఒక పని చేయాలి పద అంటూ రిసెప్షన్‌ దగ్గరకు వెళ్లి ప్రశాంత్‌ వాళ్ల అమ్మ ఆపరేషన్‌ కు కావాల్సిన డబ్బులు ఫే చేస్తానని చెప్తుంది. రాజు షాక్‌ అవుతాడు. ఇంతలో  ఇవాళ్టీ బ్రహ్మముడి ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Podarillu Today Episode : మహాకు సారీ చెప్పిన విక్కీ.. మహా మాటతో విక్కీ షాక్.. చక్రీ, మహా కలిసిపోతారా..?

Illu Illalu Pillalu Today Episodes: నర్మదా పై వేదవతి సీరియస్.. అంజలి పై చందు ఫైర్.. ధీరజ్ కు దొరికిన చందు..

Intinti Ramayanam Today Episode: కమల్ దెబ్బకు ఝలక్.. అవనిపై ప్రశంసలు.. ఇది కదా అసలు ట్విస్ట్..

Thursday TV Movies : మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్.. టీవీల్లోకి హిట్ సినిమాలు..

గర్ల్ ఫ్రెండ్ తో బ్రేకప్ పై స్పందించిన బిగ్ బాస్ కంటెస్టెంట్!

ఇంటింటి రామాయణం పల్లవి సీరియల్స్ చేయక ముందు ఏం చేసేవారో తెలుసా?

నెటిజన్ ప్రపోజల్ కి పడిపోయిన మాధురీ రాథోడ్!

Big Stories

Advertisement
×