E-Paper
Advertisement

గర్ల్ ఫ్రెండ్ తో బ్రేకప్ పై స్పందించిన బిగ్ బాస్ కంటెస్టెంట్!

గర్ల్ ఫ్రెండ్ తో బ్రేకప్ పై స్పందించిన బిగ్ బాస్ కంటెస్టెంట్!
Advertisement

Eisha Singh:బుల్లితెర నటులుగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈషా సింగ్ (Eesha Singh), అవినాష్ మిశ్రా (Avinash Mishra) మధ్య బ్రేకప్ వ్యవహారం ఒక్కసారిగా అభిమానులను కలవరపాటుకు గురి చేసింది. అంతేకాదు వీరి బ్రేకప్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతూ వీరిని పదే పదే వార్తల్లో నిలిచేలా చేస్తోంది. గత కొంతకాలంగా వీరిద్దరూ విడిపోయారు అనే వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈషా చేసిన పరోక్ష వ్యాఖ్యలు, ఆమె సోదరుడు రుద్రాక్ష్ షేర్ చేసినట్లు చెబుతున్న వాట్సప్ చాట్, అవినాష్ క్షమాపణ వీడియోతో ఈ వివాదాన్ని మరింత హాట్ టాపిక్ గా మార్చేసింది. అయితే ఈ వ్యవహారానికి ముగింపు పలకాలని కోరుతూ అవినాష్ విడుదల చేసిన వీడియో మరో సంచలనానికి తెరలేపింది.

మౌనాన్ని బలహీనతగా చూడొద్దు – ఈషా సింగ్..

అసలేం జరిగింది అనే విషయానికొస్తే.. వీరిద్దరికీ బిగ్ బాస్ హిందీ సీజన్ 18 లో తొలిసారి పరిచయం ఏర్పడింది. షో లో వీరిద్దరి సాన్నిహిత్యం అభిమానులలో కూడా ఆసక్తిని పెంచింది. ఇద్దరు డేటింగ్ లో ఉన్నట్లు ప్రచారం రాగా.. తాజాగా సోషల్ మీడియాలో అన్ ఫాలోలు.. వైరల్ ఆడియో ఆరోపణలు.. క్షమాపణ వీడియోతో ఇప్పుడు అంతా ముగిసిపోయింది. నవంబర్ 22న ఈషా సింగ్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో..” సంబంధాల గురించి ప్రైవేటుగా ఉండాలని చెప్పే వారే, వాటిని బహిరంగ వినోదంగా మార్చుతున్నారు” అంటూ పరోక్షంగా విమర్శించింది . తన మౌనాన్ని బలహీనంగా భావించొద్దని ,అవసరమైతే పేర్లు, ఆధారాలతో సహా అన్నీ బయటపెడతానని హెచ్చరించింది. ఒకప్పుడు నమ్మిన వ్యక్తి తనను మోసం చేశాడని, తన ప్రశాంతత కోసం ఇంతకాలం మౌనంగా ఉన్నానని తెలిపింది. అయితే ఇందులో ఈషా ఎవరి పేరు ప్రస్తావించకపోయినా ఆమె అవినాష్ మిశ్రాను ఉద్దేశించి చేసింది అంటూ నెటిజన్స్ కూడా చర్చించుకున్నారు.

పబ్ సాంగ్ తో ఈషాకి ముడిపెడుతూ..

Advertisement

ఈ వివాదంపై ఈషా తల్లి మాట్లాడినట్లు ఒక వాయిస్ వీడియో కూడా వైరల్ అయింది. అందులో తమ కుటుంబంలో అవినాష్ ఒక వ్యక్తిగా మారబోతున్నాడు . వీరిద్దరి బంధం ముందుకు వెళ్లిన సమయంలో కుటుంబం అంగీకరించింది అని మాట్లాడినట్లు ప్రచారం జరిగింది. పైగా అదే వీడియోలో మోసం జరిగిందనే ఆరోపణలు కూడా వినిపించాయి. అయితే ఈ వాయిస్ నోట్ నిజంగానే ఈషా తల్లికి చెందిందా? అందులోని వ్యాఖ్యలు పూర్తిగా వాస్తవమేనా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. పైగా బెంగళూరులోని ఒక క్లబ్ లో అవినాష్ “బేవఫా నిక్లీ హైతు” అనే పాటను ప్లే చేసిన వీడియో వైరల్ కావడంతో మరోసారి చర్చ మొదలయ్యింది.ఈ పాటను ఈషాకి ముడిపెట్టి మరి సోషల్ మీడియాలో పలువురు పోస్ట్లు పెట్టారు.

దయచేసి ఇక్కడితో ఆపేయండి – ఈషా సింగ్ సోదరుడు..

ఈ రాద్ధాంతం అంతా జరుగుతున్న సందర్భంలో నవంబర్ 23న ఈషా సింగ్ సోదరుడు రుద్రాక్ష్ సింగ్ చౌహన్ ఈ వివాదం పై స్పందిస్తూ అవినాష్ తో జరిగినట్లు ఒక వాట్సాప్ సంభాషణ స్క్రీన్ షాట్ ను షేర్ చేశాడు. అందులో అవినాష్.. “నా తప్పును సమర్ధించుకోలేను. తప్పు జరిగింది. ఈ వివాదంపై నాకు సిగ్గుగా ఉంది. దయచేసి క్షమించండి ” అని కోరినట్లు సందేశం ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ స్క్రీన్ షాట్ నిజమైందా? అని కూడా ఆధారాలు లేవు. తర్వాత ఒక వీడియోలో రుద్రాక్ష్ మాట్లాడుతూ.. “మా కుటుంబం ఈ వివాదాన్ని మరింత పెంచాలని కోరుకోవడం లేదు. ఈషా కూడా ఈ వ్యవహారాన్ని ముగించి ముందుకు వెళ్లాలనుకుంటుంది. అయితే ఆమె మౌనాన్ని ఎవరు అనుకూలంగా ఉపయోగించుకోవద్దు” అని కూడా తెలిపారు.

Advertisement

also read:5 భాషలలో ఓటీటీలోకి ‘గరివిడి లక్ష్మి’.. అఫీషియల్ అనౌన్స్మెంట్!

నన్ను క్షమించండి..తప్పు నాదే – అవినాష్ మిశ్రా

ఇలా ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో నవంబర్ 23న రాత్రి అవినాష్ మిశ్రా ఇన్స్టాగ్రామ్ స్టోరీ లో ఒక వీడియో విడుదల చేసి వివాదానికి ముగింపు పలికారు. “పాట విషయంలో అనేక అర్ధాలు తీసుకున్నారు. ఎడిట్ లు చేస్తున్నారు. దీనివల్ల ఈషా , ఆమె కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు. జరిగిన విషయాలకు క్షమాపణలు చెబుతున్నాను. విడిపోయిన విషయంలో కూడా తప్పు నాదే. కుటుంబ సభ్యులు, స్నేహితులను ఈ వ్యవహారంలోకి లాగకండి. ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపేస్తారని భావిస్తున్నాను” అంటూ కామెంట్ చేశారు. మొత్తానికైతే ఈషా సింగ్ తో పరిచయం, ప్రేమ, బ్రేకప్ అంతా తన తప్పిదమే అంటూ అవినాష్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related News

ఇంటింటి రామాయణం పల్లవి సీరియల్స్ చేయక ముందు ఏం చేసేవారో తెలుసా?

నెటిజన్ ప్రపోజల్ కి పడిపోయిన మాధురీ రాథోడ్!

నీతో స్నేహం నాకొద్దు.. ఎప్పటికైనా సారీ చెబుతావ్ !

బిగ్ బాస్10 విన్నర్ అతడే.. రోహిత్ వెళ్ళిపోయాక షో చూడడం మానేశారు: కౌశల్

ఇదెక్కడి క్రేజ్ రా మావా.. బుల్లెట్ బండి లక్ష్మణ్ మరోసారి అదరగొట్టేశాడుగా!

డైరెక్టర్ సుజిత్ తో గొడవలు.. జగపతిబాబు షోలో బయటపెట్టిన శేష్..

చిన్న వయసులోనే వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న బుల్లితెర సెలబ్రిటీ కిడ్స్!

Big Stories

Advertisement
×