Gundeninda GudiGantalu Today episode November 26th : అసలు ఏమైందిరా తాగుడు కి బానిస అవ్వకూడదు అని నేను ఎన్ని సార్లు చెప్పిన వినలేదు.. కానీ ఈ మధ్య నీ అంతటి నువ్వే తాగడం లేదు కదా.. మళ్లీ ఎందుకు ఈ కొత్త అలవాటు అని సత్యం బాలుని పదేపదే అడుగుతాడు.. కానీ బాలు మాత్రం అస్సలు ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. మీరేమీ కష్టపడకండి నేను అసలు నిజం చెప్తాను అని నేను అంటుంది. అసలేమైందో చెప్పమ్మా ఎందుకు వాడు అలా తాగి వచ్చి రచ్చ చేసాడు అని సత్యం అడుగుతాడు. సుమతీ ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవద్దు అని నేను అంటున్నాడు అని మీనా అనగానే.. నన్ను ఎందుకు చెడ్డగా చూపిస్తున్నావు నేనేమన్నా అంత దుర్మార్గుడిన అని బాలు చాలా సీరియస్ అవుతాడు.
బాలు వాడు ఒక మంచి వాడు కాదు అని నేను ఎంత చెప్తున్నా సరే వీళ్ళు మాత్రం అస్సలు నా మాట వినడం లేదు సుమతి అంటే నాకు ఏమైనా కక్ష ఉందా అని బాలు అడుగుతాడు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు కానీ సుమతికి మంచి జీవితం ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. సుమతి సంతోషంగా ఉండడమే నాకు కావాలి కాబట్టి తన సంతోషాన్ని నేను ఎప్పుడూ కాదనను అని అంటాడు. అతను మంచివాడు కాదు పేరుకే పోలీస్ అయినా అతను ప్రవర్తన వేరేలా ఉంది కాబట్టే నేను వద్దు అని అంటున్నాను అని బాలు అంటాడు. మీనా మాత్రం తన గురించి ఒకసారి ఆలోచించమని ఎంత చెప్పినా వినట్లేదు మామయ్య అని అంటుంది ఇంకా ఆ మాటతో మీనా తో గొడవపడి బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు బాలు. సుమతి ఇలా బాధపడుతుంది అని ఎంత చెప్పినా సరే బాలు మాత్రం తన మాటే వినాలి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు.
పార్వతీ ఫోన్ చేయడంతో బాలు మీ అమ్మ ఫోన్ చేస్తుంది ఏంటో కనుక్కో అనేసి ఫోన్ ఇస్తాడు. అయితే పార్వతి టెన్షన్ పడిపోతూ మీనా సుమతి కళ్ళు తిరిగి పడిపోయింది. తనకి ఏదో అయినట్టుంది. తనని హాస్పిటల్ జాయిన్ చేసాము అని చెప్పగానే బాలు మీనా ఒక్కసారిగా షాక్ అవుతారు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని వెంటనే పరిగెడుతూ హాస్పిటల్ కి వెళ్ళిపోతారు. సుమతిని చూసి బాలు మీనా ఇద్దరు బాధపడిపోతారు. పార్వతి నా కూతురికి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని అనగానే.. బాలు నావల్ల మీ కూతురికి లాంటి పరిస్థితి వచ్చింది అంటున్నారా ఏం మాట్లాడుతున్నారు మీరు అని ఒక్కసారిగా కోపంగా ఫీల్ అవుతాడు. పార్వతి మాతతో బాలు చాలా ఫీల్ అయిపోతాడు. ఆయన కూడా సుమతీ విషయం బాలు అంత కోపంగా ఉండడం చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు..
బాలు మాట్లాడుతూ ఉండగా అరుణ్ సడన్గా హాస్పిటల్ లోకి ఎంట్రీ ఇస్తాడు. హాస్పిటల్లోకి రాగానే సుమతి ఎవరు అని అక్కడ వాళ్ళు అడుగుతారు. అయితే తను నాకు కాబోయే భార్య నేను తనకి కాబోయే భర్తను అని చెప్పగానే అరుణ్ మాటతో బాలు చాలా సీరియస్ అవుతాడు. చూసావా వాడు వద్దు అని ఎంత చెప్తున్నా సరే తనకు కాబోయే భార్య అని అందరితో చెబుతున్నాడో వాడికి కొంచెం కూడా బుద్ధి లేదు అంటూ బాలు ఇంకాస్త సీరియస్ అవుతాడు. ఇక కష్టపడి సుమతిని చూడడానికైనా లోపలికి వస్తాడు. మూతిని ఆ పరిస్థితిలో చూసి అరుణు చాలా ఫీల్ అయిపోతాడు.. అసలు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు ఎవర్రా నువ్వు ఇక్కడికి రావడానికి అని బాలు ఆ హాస్పిటల్లో అరుణ్ తో గొడవపడతాడు మీనా అలాగే శివ వాళ్ళని విడిపిస్తారు.
వాడు ఎంతకి తెగించాడో చూసావా మీనా తన భార్య అని అందరితో చెప్పుకుంటున్నాడు. వాడు చేసిన దాంట్లో తప్పేముందండి తను ప్రేమించిన అమ్మాయికి ఏమైందో అని కంగారు పడిపోతూ అక్కడికి వచ్చారు. తన వల్ల తప్పేమీ జరగలేదు మీరే సుమతి అరుణ్ని కలవనివ్వకుండా చేస్తున్నారు అని మీనా చాలా సీరియస్ అవుతుంది. అయితే మీనా ఆ మాట అనగానే బాలు చాలా సీరియస్ అవుతాడు అంటే నిన్నగాక మొన్న వచ్చిన వాడే నీకు ఎక్కువైపోయాడా..? వాడి కోసమే ఇదంతా చేస్తున్నారా? అయితే నువ్వు వాడితోనే మాట్లాడుకో పో నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు.. నీ చెల్లెల్ని వాడికే ఇచ్చి పెళ్లి చెయ్యి మధ్యలో నా గురించి ఏది మాట్లాడాల్సిన అవసరం లేదు అని సీరియస్ అయ్యి వెళ్ళిపోతాడు. అయితే బాలు మీ మెడలో తాళి కట్టిన పాపానికి నేను నిన్ను తీసుకుని వెళ్తాను అని అంటాడు.
ఇక మనోజ్ జ్యూస్ తాగడానికి చాలా కష్టపడి పోతూ ఉంటాడు. అయితే రోహిణి తనకి ఇంకొక జ్యూస్ తీసుకుని వచ్చి ఇస్తుంది. రోహిణి అలా జ్యూస్ తెచ్చి ఇవ్వడంతో మనోజ్ నేను ఒకటే తాగలేకున్నాను ఇంకొకటి ఎందుకు అన్నట్టుగా మాట్లాడుతాడు.. అయితే ప్రభావతి ఏంటే వాడు ఏం మాట్లాడుతున్నాడు అని రోహిణి అడుగుతుంది. నన్ను కూడా తనతో పాటు షో రూమ్ కి రమ్మని పిలుస్తున్నాడు అత్తయ్య అని రోహిణి ఎంత చెప్తున్నా సరే ప్రభావతి మాత్రం అస్సలు నమ్మదు కానీ మనోజ్ పరిస్థితిని చూసి ఇక పర్వాలేదులే అని అనుకుంటుంది. మొత్తానికి రోహిణి ప్లాన్ అయితే సక్సెస్ అవుతుంది. ఇక రోహిణి షో రూమ్ కి వెళ్లడానికి ఒప్పుకుంటుంది కానీ మీనా ఇంకా రాలేదని అరుస్తూ ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..