Intinti Ramayanam Today Episode November 26th: కమల్ నేను ఇంట్లో ఉండను అది ఈ నెల రోజులు ఉంటుంది కదా ఈ నెల రోజులు నేను బయటకు వెళ్ళిపోతాను అని చెప్పగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయాయి కమల్లి పక్కకు తీసుకొని వెళ్తారు. అయితే కమల్ని పక్కకు తీసుకుని వెళ్లిన అవని కమల్ బయటికి వెళ్తే జరిగే పరిస్థితుల గురించి వివరించి కమల్ అవని మాట విని లోపలికి వెళ్ళిపోతాడు. చూసావా మామ నేను ఎదిగితే అస్సలు మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు అవని ఏం చెప్తే అది ఆడుతున్నాడు చూసావా అని పల్లవి భానుమతి పై సీరియస్ అవుతుంది. కానీ భానుమతి మాత్రం నీ మొగుడిని కొంగునా కట్టేసుకోవాలి అప్పుడే నువ్వు ఈ ఇంటికి మహారాణి అవుతావు లేదంటే మాత్రం నీ మొగుడు ఎప్పుడు బయటికి గెంటేస్తాడని భయపడుతూ చావాలి అంటూ పెద్దగా క్లాసులు పీకుతుంది.
కమల్ ఎలాగైనా సరే తన దారిలోకి వస్తాడు అని పల్లవి చాలా ధీమాగా ఉంటుంది. ఇక ఏం జరిగినా సరే కమల్ ని విడిచిపెట్టకూడదు తనని నా సొంతం చేసుకుంటే ఈ ఇండ్లే నా సొంతం అవుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంట్లోకి పల్లవి అడుగుపెట్టేసింది కదా ఇకమీదట తను ఇక్కడే ఉండి ఇంట్లో మనిషిగా ఉండాలి అదే నా కోరిక అని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ కమల్ మాత్రం పల్లవి ఇంట్లో ఉంటే నేను అసలు ఇంట్లో ఉండనే ఉండను అని చాలా ఆవేశంగా బయటకు వెళ్ళిపోతాడు. అవని అక్షరాలు మాత్రం పల్లవి ఏదో పెద్ద ప్లాన్ తోనే వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటారు. అసలు పల్లవిని మాత్రం ఇంట్లోనే వాళ్ళు ఎవ్వరూ కూడా పట్టించుకోకుండా ఉంటారు.. కానీ పల్లవి మాత్రం ఎలాగైనా సరే ఆ ఇంట్లో వాళ్ళందరినీ మాట్లాడించి తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేయాలని అనుకుంటుంది.
కమల్ పల్లవికి ఎలాగైనా సరే చుక్కలు చూపించాలి అని అనుకుంటాడు.. బయట డెలివరీ బై బిర్యానీ ఇచ్చాడు. దాని ఏదో ఒకటి చేసి పల్లవికి చుక్కలు చూపించాలి తనకి బుద్ధి వచ్చేలా చేయాలని కమల్ అనుకుంటాడు. ఆ బిర్యానీలో మోషన్స్ టాబ్లెట్స్ ని కలుపుతాడు. పల్లవికి కచ్చితంగా ఇప్పుడు తెలుస్తుంది ఇంట్లో వాళ్ల సంగతి గురించి పట్టించుకోకుండా తన ఇష్టం వచ్చినట్టు చేస్తుంది కదా తనకి ఇప్పుడు చుక్కలు చూపిస్తాను చూడు అని కమల్ మనసులు అనుకుంటాడు ఇక అందరూ భోజనం చేయడానికి పిలిస్తే పల్లవి మాత్రం నా డెలివరీ బాయ్ ఇంకా రాదు ఏంటి అని వెయిట్ చేస్తూ ఉంటుంది ఆర్డర్ ని కమల్ తీసుకురావడంతో పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.. కానీ బిర్యానీ గురించి అందరు వేసిన కౌంటర్లు విని పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది.
ఇక అందరూ భోజనం చేస్తూ ఉండగా అక్షయ్ ఈ మధ్యకాలంలో రెస్టారెంట్లలో ఫుడ్డు తింటే దాంట్లో ఫుడ్ పాయిజన్ ఎక్కువ అవుతుంది అని అందరూ అనుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో రెస్టారెంట్లలో కల్తీ భోజనంతో పాటుగా మాంసం కూడా కల్సి ఉంటుందని వాటి వల్ల అనారోగ్యం అవుతుంది అని అక్షయ్ అంటాడు అవును వదినా నిజమే ఈమధ్య రెస్టారెంట్ల మీద రైడ్ చేసి చాలా రెస్టారెంట్ అని మూసేశారు అని కమల్ కూడా అంటాడు. ఇక మొత్తానికి పల్లవి మాత్రం లొట్టలు వేసుకొని ఆ బిర్యాని తింటుంది అయితే అందులో కమల్ మోషన్స్ మందు కలిపాడం విషయం తెలియకుండా పొగిడేసుకుంటూ తింటుంది.. అటు సైడ్ ఏమో అవని చేసిన వంటల్ని నేర్చుకుంటూ అందరూ లొట్టలు వేసుకుని తింటారు మొత్తానికి వంటలు గురించి ఈ ఎపిసోడ్ కాస్త ఎక్కువగానే సాగదీసి మరి చెప్పేసారు. ఇక పల్లవి కూడా అవి నేను పొగుడుతుంటే చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది.
ఇంకా భానుమతి పల్లవి కాపురం ఎలాగైనా నిలబెట్టాలి అని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అయితే పల్లవి తన కాపురం తన చేతులారా నాశనం చేసుకుంది తనని ఎలాగైనా సరే మార్చాలి అని భానుమతి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్షయ్ ప్లేట్లో భోజనం తీసుకుని భానుమతి దగ్గరికి వస్తాడు. నువ్వు తినకుండా మందులు వేసుకోవడం అసలు బాగోదు అమ్మ నువ్వు కాస్త తినాలి అని అడుగుతాడు.. కానీ భానుమతి మాత్రం పల్లవి గురించి ఆలోచిస్తూ పల్లవిని ఎందుకు మీరు వద్దంటున్నారు అని అంటుంది.. పల్లవి తప్పు చేసింది అని మీరు అంటున్నారు కదా తప్పులు చేసిన వాళ్ళందరినీ వదిలేయాలని అనుకుంటున్నారు అయితే అక్షయ్ మాత్రం పల్లవి నువ్వు వదిలేయాలని మేము అనడం లేదు నానమ్మ.. తన బుద్ధి ఏంటో నీకు బాగా తెలుసు కదా తన గురించి నువ్వు ఆలోచించు అని అక్షయ అంటాడు.. ఏం జరుగుతుంది అనేది కోర్టులోనే తేల్చుకుందామని అక్షయ్ అంటాడు.
పల్లవి బిర్యానీ తిన్నప్పటి నుంచి నా పొట్టలో ఏదో తేడాగా ఉంది ఏంటి నాకు ఏదో అయినట్టు ఉంది అని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. అయితే బాత్రూం కి వెళ్ళాలి అర్జెంటుగాని పల్లవి చాలా కంగారు పడిపోతే బాత్రూం దగ్గరికి పరుగెత్తుకుంటూ వస్తుంది కానీ అక్కడ తాళం వేసి ఉండడం చూసి పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అయితే నాకు బాత్రూమ్ అర్జెంటుగా వస్తుంది నేను తాళం తీయాలి ఎవరు తాళం వేశారు అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే కమ్మలు లోపలికి వచ్చి ఇది నా బాత్రూం నా బాత్రూంలో నువ్వు వాడుకోవడానికి వీల్లేదు అని అన్నిటికీ తాళాలు వేసారు అని చెప్పగానే.. పల్లవి ఏంటి బావ నేనంటే నీకు ఇంత కక్ష నువ్వు ఇలా తాళాలు వేస్తే నేను బాత్రూంకి వెళ్ళాలి ఇవ్వు బావ ప్లీజ్ బావ అని బ్రతిమిలాడుతుంది. ఇక చివరికి పల్లవికి చుక్కలు చూపించిన తర్వాత కమల్ బాత్రూమ్ ఇవ్వడానికి ఒప్పుకుంటాడు.. పల్లవి బాత్రూంలోకి వెళ్ళగానే అక్కడ ఉన్న తన బ్రీత్ కేసులో ఏమైనా ఉన్నాయేమో అని వెతికెందుకు ప్రయత్నిస్తాడు మొత్తానికి పల్లవి బిర్యానీ వల్ల లోపలికి బయటకి తిరుగుతూ చాలా అవసరం పడుతుంది అక్కడితో ఎపిసోడ్పూ ర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో అన్నది చూడాలి..
Also Read : మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్.. టీవీల్లోకి హిట్ సినిమాలు..