BigTV English

GundeNinda GudiGantalu Today Episode : సత్యం ఆపరేషన్ సక్సెస్.. మీనా, బాలు మళ్లీ కలిసిపోతారా?

GundeNinda GudiGantalu Today Episode : సత్యం ఆపరేషన్ సక్సెస్.. మీనా, బాలు మళ్లీ కలిసిపోతారా?

Gundeninda GudiGantalu Today episode నవంబర్ 4th:  గత వారం చివరి ఎపిసోడ్ లో .. రవీతో బాలు గొడవ పడి బయటకు పంపిస్తాడు. నీకు ప్రాణాల మీద ఏ మాత్రం ఆశ ఉన్నా ఇక్కడి నుంచి వెళ్లిపో అని రవిని నెట్టేస్తాడు బాలు.. ఇక ఆపరేషన్ కోసం డబ్బులను కట్టాలని ఎంతో ప్రయత్నం చేస్తాడు. ఇక బాలు ఇష్టమైన కారును అమ్మేస్తాడు. దాంతో మూడు లక్షలు వస్తాయి.. మిగిలిన డబ్బుల కోసం ప్రయత్నాలు చేస్తారు. కానీ ప్రభావతి మాత్రం ఎక్కడా ప్రయత్నించవద్దు. ఆమె నగలను ఇస్తుంది.. ఆ డబ్బులను తెచ్చి కడతారు. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మీనా సత్యంకు ఎలాగైనా తాయత్తు కట్టాలని హాస్పిటల్ లోనే ఉంటుంది. ఇక బాలు రెండు లక్షలు డబ్బులు ఎలా కట్టాలని ఆలోచిస్తాడు. దాంతో ప్రభావతి నా నగలను తీసుకో అని మొత్తం నగలను ఇస్తుంది. నాకు ఆయనకన్నా ఈ నగలను తీసుకో.. ఆయన కొన్నవే ఇవి ఆయన ప్రాణాల కన్నా ఇవి ఎక్కువ కాదు అని అంటుంది.ఈ బంగారు తీసుకొని వెళ్లి కట్టు అని అంటుంది. ఇవి ఆయన చేయించినవే.. తీసుకెళ్ళు కట్టు సరిపోకుంటే పుస్తెలు కూడా తీసుకెళ్ళు అంటుంది. దానికి ఇంట్లో వాళ్ళందరూ ఎమోషనల్ అవుతారు. ఇక అందరు ఫీల్ అవుతారు. బాలు అమ్మ ఇచ్చిన నగలను తీసుకొని డబ్బులను తీసుకొచ్చి హాస్పిటల్ లో కడతారు. డాక్టర్ ఆపరేషన్ కు ఏర్పాటు చేస్తారు..

ఇక డాక్టర్లు ఆపరేషన్ అవ్వడానికి రెండు గంటలు పడుతుందని చెప్తారు. ఇక బాలు ఆపరేషన్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది కదా నేను వెళ్లి అమ్మ నగలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని వస్తాను అనేసి వెళ్తాడు. ఇక మనోజ్ ఆగరా నా చేయను కూడా తీసుకెళ్ళు అనేసి అంటాడు. అప్పుడు రోహిణి ఇది కూడా తీసుకెళ్ళు బాలు అని ఉంగరం తీసేస్తుంది. ఇవి సరిపోతాయి ఇవి సరిపోకపోతే నేను ఎక్కడైనా అరేంజ్ చేస్తాను ఇక చాల్లేండి అనేసి మనోజ్ కి నాన్న జాగ్రత్త అని చెప్పి వెళ్తాడు. ఇక ప్రభావతి నేను గుడికి వెళ్తానని అందరితో చెప్పి వెళ్తుంది. ఒంటరిగా ఏమి వెళ్తావు వదిన అని మీనాక్షి తోడు వెళుతుంది. ఇక రోహిణి కూడా ఇక్కడ ఉండి ఏం చేస్తాం ఆపరేషన్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది కదా నేను కూడా వస్తాను అంటుంది. మౌనిక ఇక్కడ ఉంటే నాకు భయమేస్తుంది నేను కూడా మీతో పాటు వస్తానని మౌనిక కూడా వెళ్తుంది.


అప్పటికే మీనా గుడికి వెళ్లి దేవులాంటి మామయ్యకు ఏమీ కాకూడదని దేవుణ్ణి కోరుకుంటూ ప్రభాతి వాళ్ళు రావడం చూసి అక్కడి నుంచి పక్కకు వెళుతుంది. ప్రభావతి మేమేం పాపం చేశాం ఆయనకు ఎందుకు ఇలా చేశావు అదేదో నాకు చేయొచ్చు కదా అని దేవుడి దగ్గర ఎమోషనల్ అవుతుంది . పక్కన ఉన్న మీనాక్షి ఓదారుస్తూ ఉంటుంది. బాలు డబ్బులు తీసుకొచ్చి కట్టేస్తాడు. ఆపరేషన్ థియేటర్ నుంచి వచ్చిన డాక్టర్లు ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పగానే బాలు వాళ్ళ కాళ్ళ మీద పడి మీరు దేవుళ్ళు డాక్టర్ అని అంటాడు. మీ నాన్నకి ఎటువంటి ప్రమాదం లేదు ఆపరేషన్ సక్సెస్ అయింది అనేసి డాక్టర్లు చెప్తారు. రూమ్ కి షిఫ్ట్ చేసిన తర్వాత మీరు చూడడానికి వెళ్ళండి అనేసి డాక్టర్లు అంటారు. ఆయన్ని 24 గంటలు అబ్జర్వేషన్ లో ఉంచుతున్నాం నేను లోపలికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని పిలుస్తాను మాట్లాడాలి అనేసి డాక్టర్ చెప్పి వెళ్లిపోతాడు. అందరూ లోపలికి వెళ్లి సత్యం ను చూస్తారు. బాలును డాక్టర్ పిలిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఇక సిస్టర్ మందులు తీసుకురమ్మని మనోజ్ కి చెప్తుంది. రంగా ఒక్కడే ఉండడం చూసిన మీనా తాయత్తు కట్టాలని రంగాను అడుగుతుంది.

అసలు ఏమైందమ్మా మీనా ఏం జరిగింది? ఎందుకు అందరిని ఇలా అంటున్నారు అనేసి అడుగుతాడు. ఇదంతా నాకు కర్మ బాబాయ్ రవి పెళ్లి చేసుకున్న తర్వాతే నాకు చెప్పాడు దానికి నేనే బాధ్యత అని నన్ను అందరూ అంటున్నారు అని మీనా బాధపడుతుంది. లోపలికి వెళ్లి తాయత్తు కట్టిస్తానని వెళుతుంది. ప్రభావతి వాళ్ళు రావడం చూసి రంగా మీనాకు ఫోన్ చేస్తాడు. మీనా అక్కడ నుంచి బయటకు వస్తుంది. లోపలికి వెళ్ళిన వాళ్ళు సత్యం ను చూసి బాధపడతారు. ఇక ప్రభావతి మీకు ఇలాంటి పరిస్థితి రావడానికి ఆ రవినే కారణం వాడు ఇప్పుడు కనిపిస్తే చంపేస్తాననేసి అంటుంది. ఆ మీనా ను అసలు క్షమించేది లేదు . అది ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత ఎన్ని జరిగాయ అనేసి ప్రభావతి లోపల అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో సత్యం ను ఇంటికి తీసుకెళ్తారు. నా ఇక మీదట ఏ టెన్షన్లు పెట్టుకోవద్దు అసలే చాలా డబ్బులు అయ్యాయి అనేసి మనోజ్ అంటాడు. ఆపరేషన్ కి డబ్బులు ఎలా తీసుకొచ్చారు అనేసి అడుగుతాడు. వీడు కారును అమ్మేశాడని మనోజ్ చెప్తాడు. ఇంటి పత్రాలు ఉన్నాయి కదా అవి పెట్టాల్సింది అనేసి అంటాడు. ఆ మీనా పోతూ పోతూ ఇంటి పత్రాలను కూడా తీసుకపోయిందనేసి ప్రభావతి అనగానే మీ నాన్న నాకు అదే రోజు పత్రాలు తెచ్చి ఇచ్చింది అనేసి సత్యం చెప్తాడు. ఇక బాలును మీ నాన్న తీసుకురావాలని చెప్పాడు తెగిన గాలిపటంలా నీ జీవితం మారకూడదు అంటే నువ్వు వెళ్లి మీనా అని తీసుకురావాలని అంటాడు. రేపటి ఎపిసోడ్ లో ప్రభావతి అడ్డుపడుతుందని తెలుస్తుంది మరి ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

×