Sai Sudharsan Catch: టీమ్ ఇండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య ప్రస్తుతం రెండో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియా అద్భుతంగా రాణిస్తుంది. ఇప్పటికే మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా డిక్లేర్ చేసి, వెస్టిండీస్ కు బ్యాటింగ్ కూడా ఇచ్చింది. అయితే ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆటగాడు సాయి సుదర్శన్ పట్టిన క్యాచ్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఫ్రంట్ లో ఫీల్డింగ్ చేసి అద్భుతమైన క్యాచ్ పట్టాడు. అయితే ఈ క్యాచ్ పట్టిన తర్వాత అతనికి తీవ్రమైన గాయం కూడా అయింది. అనంతరం గ్రౌండ్ వీడి డగౌట్ లో కూర్చున్నాడు.
టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో అద్భుతమైన క్యాచ్ పట్టాడు సాయి సుదర్శన్. బ్యాటింగ్ తో పాటు తన ఫీల్డింగ్ లో సత్తా చాటుతున్నాడు. అయితే తాజాగా వెస్టిండీస్ ఇన్నింగ్స్ ఏడవ ఓవర్ లో జాన్ కాంప్‌బెల్ ( John Campbell ) ఇచ్చిన క్యాచ్ ను అద్భుతంగా అందుకున్నాడు. ఈ ఓవర్ లో రవీంద్ర జడేజా ఓ అద్భుతమైన బంతి వేశాడు. దాన్ని స్వీప్ షాట్ ఆడేందుకు జాన్ క్యాంప్ బెల్ ప్రయత్నించాడు. అయితే ఫ్రంట్ ఫీలింగ్ చేస్తున్న సాయి సుదర్శన్ అద్భుతంగా అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే ఈ క్యాచ్ అందుకున్న సాయి సుదర్శన్ చేతుకు మాత్రం తీవ్రమైన గాయమైంది. దీంతో అతడు వెంటనే గ్రౌండ్ విడి ప్రథమ చికిత్స తీసుకున్నాడు. ప్రస్తుతం అతడు ఫీల్డింగ్ చేయడం లేదు. డగౌట్ లోనే రెస్ట్ తీసుకుంటున్నాడు.
ఢిల్లీ టెస్టులో వెస్టిండీస్ బౌలింగ్ తో పాటు ఇప్పుడు బ్యాటింగ్ లో కూడా తడబడుతోంది. నిన్న ఆట ముగిసే సమయానికి 43 ఓవర్లు ఆడిన వెస్టిండీస్ నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ నేపథ్యంలోనే 140 పరుగులు మాత్రమే చేయగలిగింది వెస్టిండీస్. కరేబియన్ జట్టు కెప్టెన్ రోస్టన్ డక్ అవుట్ అయ్యాడు. ఓపెనర్లు ఇద్దరు కూడా విఫలమయ్యారు. అయితే షై హోప్ 31 పరుగులతో ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్నాడు. అతనితో పాటు వికెట్ కీపర్ కూడా బ్యాటింగ్ లో ఉన్నాడు. ఇక అంతకుముందు టీమిండియా 518 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసిన సంగతి తెలిసిందే. టీమిండియా ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ అలాగే గిల్ ఇద్దరు సెంచరీలు నమోదు చేశారు. అయితే, మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ 175 పరుగుల చేసి, రనౌట్ అయ్యాడు. గిల్ కారణంగా, యశస్వీ జైస్వాల్ పెవిలీయన్ కు వెళ్లాడు.
Also Read: IND-W vs SA-W: రీల్స్ పైన ఉన్న ఫోకస్, బ్యాటింగ్ పైన లేదు…లేడీ కోహ్లీ అనుకుంటే, నట్టేట ముంచింది!
What a grab by Sai Sudharsan! Unbelievable 🤯
Sunil Gavaskar in the commentary background: 'He caught it, he caught iitttt!pic.twitter.com/7cVpUn48mo
— GillTheWill (@GillTheWill77) October 11, 2025