Tollywood Heroines: సినిమాల్లో అవకాశాలు రావడం కష్టం. వచ్చిన అవకాశాలను నిలబెట్టుకోవడం మరింత కష్టం. ఒకప్పుడు హీరోయిన్లుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోలు అందరు సరసన నటించిన కొందరు హీరోయిన్లు ప్రస్తుతం బుల్లితెరపై స్పందన చేస్తున్నారు.. సినిమాలతో ఎంత పేరు తెచ్చుకున్నా సరే.. అభిమానులకి పెద్దగా కనెక్ట్ అవ్వలేకపోతున్నాము అని చాలామంది సీనియర్ హీరోయిన్లు సీరియల్స్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు.. ఈమధ్య బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు టాప్ సీరియల్స్లలో సీనియర్ హీరోయిన్లు ఎక్కువగా కనిపిస్తున్నారు. మరిక ఆలస్యం ఎందుకు..? ప్రస్తుతం టీవీ సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నా ఒకటి స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసుకుందాం..
మావిచిగురు, శుభలగ్నం, జంబలకడిపంబ ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ముద్దుగుమ్మ ఆమని.. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పట్లో హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఈమె ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరి సరసన నటించింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి కీలక పాత్రలో నటిస్తూ వస్తుంది. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్న సరే మరోవైపు బుల్లితెరపై సీరియల్స్లలో నటిస్తోంది. ఆమని ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో మెయిన్ లీడ్ రోల్లో నటిస్తుంది.
టాలీవుడ్ హీరోయిన్ రాశి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. శ్రీకాంత్, జగపతిబాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సరసన నటించిన హీరోయిన్ రాశి ఈమధ్య బుల్లితెరపై సీరియల్స్లలో నటిస్తూ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది. జానకి కలగనలేదు అనే సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైంది ఈమె.. ప్రస్తుతం సినిమాలు, సీరియల్స్ తో బిజీగా గడుపుతుంది.
ఒకప్పుడు తమిళ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన హీరోయిన్లలో రాధిక ఒకరు. కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు తెలుగులో కూడా స్టార్ హీరోలు అందరి సరసన నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు అవకాశాలు తగ్గడంతో వెండి నుంచి బుల్లితెరకు జంప్ అయింది.. ఈమె బుల్లితెరపై కూడా ఎన్నో సీరియల్స్ లలో నటించి బాగా ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం సినిమాలతో పాటుగా సీరియల్స్ చేస్తూ బిజీగా గడుపుతుంది.
Also Read: గాంధీపై నటుడు అసభ్యకరమైన వ్యాఖ్యలు.. ఆ సినిమా బ్యాన్..?
వీళ్లు మాత్రమే కాదు రమ్యకృష్ణ, కుష్బూ,మీనా, దేవయాని, భానుప్రియ వంటి హీరోయిన్లందరూ కూడా సీరియల్స్ చేస్తూ బాగా ఫేమస్ అవుతున్నారు. కేవలం హీరోయిన్లు మాత్రమే కాదు కొందరు హీరోలు కూడా ప్రస్తుతం సీరియస్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు.. వెండి ధరపై అయితే ఎప్పుడో ఒక సినిమాతో మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చేవారు. ఈమధ్య వయసు అయిపోవడంతో హీరోయిన్ల పాత్రలకు వీళ్ళు సెట్ అవ్వట్లేదు.. కేవలం తల్లి పాత్రలోనో తండ్రి పాత్రలోను నటిస్తూ వస్తున్నారు. అది బుల్లితెరపై అయితే ఆ పాత్రల్లో చేసిన సరే ఆ క్యారెక్టర్ కు మంచి వెయిట్ ఉంటుంది. దాంతో వీళ్ళు ప్రేక్షకులకు బాగా దగ్గరవుతున్నారు అని చెప్పడంలో సందేహం లేదు.