Hyderabad Accident: పోలీసులు పదేపదే చెబుతున్నా వాహనదారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఊహించని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఎల్‌బీనగర్ పరిధిలో రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. అసలేం జరిగింది?
ప్రమాదం ఎలా జరిగింది?
ఎల్‌బీనగర్ ఏరియాలో పరిధిలోని బీఎన్‌రెడ్డినగర్ సమీపంలో గుర్రంగూడ వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంజాపూర్ నుంచి గుర్రంగూడ వైపు వెళ్తోంది ఓ కారు. అయితే కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతో అతివేగంగా వెళ్లడం మొదలుపెట్టాడు.
అదే సమయంలో అదుపు తప్పి కారు, ముందు వెళ్లున్న బైక్ కి ఢీ కొట్టింది. బైక్‌పైవున్న ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలు అయ్యాయి. అనంతరం డివైడర్ దాటి మరో కారును ఢీ కొట్టింది కారు. చివరకు మూడు పల్టీలు కొట్టి వాహనం నుజ్జనుజ్జు అయ్యింది. కారులో డ్రైవర్, ఓనర్ తలకు తీవ్రగాయాలయ్యాయి. మరో కారులోని ఇద్దరు గాయపడ్డారు. వారి దినేష్, శివలు గుర్తించారు.
మద్యమే కారణమా?
ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అంబులెన్సులు అక్కడికి చేరుకున్నాయి. కొందర్ని ఉస్మానియా, మరికొందర్ని సమీపంలో ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. రోడ్డుపై నున్న వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
ALSO READ: ఆ రెండు జిల్లాలకు శుభవార్త.. ఇంక్యుబేషన్ కేంద్రాలు ఏర్పాటు