Illu Illalu Pillalu Today Episode October 12th: నిన్నటి ఎపిసోడ్ లో.. బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయాన్ని మాట్లాడుకుంటారు. సేన రావడం చూసి ఊరి పెద్దలు మీరు బావ మరదలు కలిసి దసరా ఉత్సవాలను జరిపించాలని కోరుతారు. ఇద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది.. వేదవతి పై రామరాజు సీరియస్ అవుతాడు. సందు దొరికితే ఏదో ఒకటి అనాలని శ్రీవల్లి ఎదురుచూస్తుంది. శ్రీవల్లి మళ్లీ మీ చొక్కా చించేసినంత పని అయిందా మామయ్య గారు మిమ్మల్ని అవమానించారా అని కావాలనే రెచ్చగొడుతుంది. మీరు ఎలా ఊరుకున్నారు మావయ్య గారు అని రామరాజుతో శ్రీవల్లి అంటుంది. వైపు వేదవతి సైలెంట్ గా ఉండమని అంటున్న సరే శ్రీవల్లి వినకుండా మాటలతో రెచ్చగొడుతుంది. నర్మదా ప్రేమలను రామరాజు దగ్గర అడ్డంగా ఇరికిస్తుంది శ్రీవల్లి. భాగ్యం బజ్జీలు చేసుకుంటూ రామరాజుకి దొరికిపోతుంది. రామరాజు అన్న మాటలకి ప్రేమ నర్మదా ఇద్దరు బాధపడుతూ ఉంటారు. శ్రీవల్లి మాత్రం నేనే అసలు సిసలైన కోడల్ని ఆ ఇద్దరికీ చుక్కలు చూపిస్తానని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ప్రోమో విషయానికి వస్తే.. నర్మదా ప్రేమ ఇద్దరు కూడా రామరాజు అన్న మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటారు. ఇద్దరు కోడళ్ళు నా ఇంటి పరువును తీస్తున్నారు అన్నారని బాధపడతారు. శ్రీవల్లి అమూల్యను తీసుకొని వస్తానని విశ్వంతో అంటుంది. అమూల్యని అక్కడ వదిలేసి శ్రీవల్లి వెళ్ళిపోతుంది. విశ్వం అమూల్య దగ్గరకొచ్చి పులిహోర కలుపుతూ ఉంటాడు. బలవంతంగా నీకు గాజులు కొనిస్తాను అని అంటాడు.. కామాక్షి ఎక్కడికొచ్చిందా చెల్లి చెయ్యి పట్టుకుంటావా నీకు ఎంత ధైర్యం రాని అంటుంది. వాళ్ళ ఆయన తీసుకొని వచ్చి కొట్టిస్తానని అంటుంది. కానీ విశ్వం ని చూసిన అతను అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడు..
నర్మదా ప్రేమ దగ్గరకు వచ్చి మావయ్య గారు అన్న విషయాలు పట్టించుకుంటే బాధగానే ఉంటుంది. వాటిని పక్కన పెట్టి నువ్వు ధీరజ్ ని ప్రేమించడం ఎలా? నీ ప్రేమను చెప్పడం ఎలా? అని ఆలోచించు అంటూ నర్మదా సలహా ఇస్తుంది.. నువ్వు వెళ్లి అర్జెంటుగా ధీరజ్ కి నీ ప్రేమ విషయం చెప్తావా లేదా అంటూ నర్మదా అడుగుతుంది. అక్క నాకు టెన్షన్ గా ఉంది అక్క వాడికి నేను ఎలా చెప్పాలి అని అనుకుంటుంది. నువ్వేమీ చెప్పద్దు మౌనంగా ఉండు అదే జరిగిపోతుంది అంతేనా అని నర్మదా ప్రేమకు సర్ది చెప్పి ధీరజ్ దగ్గరికి పంపిస్తుంది.
ప్రేమ ధీరజ్ దగ్గరికి వెళ్లి సిగ్గుతో మెలికలు తిరుగుతూ ఉంటుంది. ప్రేమను అలా చూసిన ధీరజ్.. నువ్వు సిగ్గు పడుతుంటే ఏదోలా ఉంది. ఇంతకుముందు కోతి లాగా మీద పడిపోయే దానివి ఇప్పుడు ఎందుకు కొత్తగా సిగ్గుపడుతున్నావని అడుగుతాడు. ప్రేమను చూసిన ధీరజ్ సెటైర్ల మీద సెటైర్లు వేస్తాడు. కానీ ప్రేమ మాత్రం ధీరజ్ కి తన మనసులోని మాటని చెప్పలేక పోతుంది. నువ్విలా సిగ్గుపడుతూ ఉంటే చూడలేకపోతున్నాను నువ్వు ఎందుకు వచ్చావు అది చెప్పు అని ధీరజ్ ఎంతగా అడుగుతున్నా సరే ప్రేమ మాత్రం మౌనంగా సిగ్గుపడుతూ ఉండిపోతుంది.
ప్రేమ తన మనసులోని మాటని చెప్పే టైం కి గుడిలో పాప తప్పిపోయింది అంటూ అనౌన్స్మెంట్ రావడంతో ఇద్దరు టెన్షన్ పడిపోయి ఆ పాపను వెతకడానికి వెళ్తారు. మొత్తానికి పాపని తన తల్లిదండ్రుల దగ్గరికి క్షేమంగా తీసుకొని వెళ్లి ఇస్తారు. ఇక ఆ తర్వాత గుడికి కలెక్టర్ వస్తున్నారని తెలియడంతో అందరూ పక్కన ఉంటారు. కలెక్టర్ రాగానే ఆయన చూసి అందరూ నమస్కారం చేస్తూ ఉంటారు. ముఖ పరిచయమున్న రామరాజు కలెక్టర్ తో మాట్లాడడానికి ముందుకు వెళ్తాడు. కానీ ఆయన పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు.
Also Read: సీరియల్స్ చేస్తున్న స్టార్ హీరోయిన్స్ ఎవరో తెలుసా..?
అక్కడే ఉన్న నర్మదా కలెక్టర్ ని పలకరిస్తుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో నిజాయితీగా పనిచేసే అవార్డు తీసుకునింది మీరే కదా అని కలెక్టర్ అడుగుతాడు. అవార్డు మాత్రమే కాదు సార్ నాకు ప్రమోషన్ కూడా వచ్చింది. అని నర్మదా అనగానే ఆయన వెరీ గుడ్ అమ్మ నువ్వు ఇలానే పని చేసుకుంటూ వెళ్లి మంచి అవార్డులను తీసుకోవాలి అని కోరుకుంటున్నా అని కలెక్టర్ అంటాడు. కలెక్టర్ తో నర్మద మాట్లాడడం చూసిన రామరాజు షాక్ అయిపోతాడు. ఇక నర్మదా మీరు ఏమనుకోనంటే మా కుటుంబాన్ని పరిచయం చేస్తాను అని అంటుంది. రామరాజుని కలెక్టర్ కి పరిచయం చేస్తుంది. కొద్ది నిమిషాల ముందు నా పరువును తీస్తున్నారు అన్న మాటలని రామరాజు జీర్ణించుకోలేకపోతాడు. శ్రీవల్లి మాత్రం రామరాజు నర్మదను పొగడడం చూసి కుళ్ళుకుంటుంది అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్లో నర్మదపై అందరూ ప్రశంసలు కురిపిస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..