Big tv Kissik Talks: బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్(Big tv Kissik Talks) కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సీరియల్ నటి విష్ణు ప్రియ(Vishnu Priya) హాజరై సందడి చేశారు. ఈమె బుల్లితెర నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎన్నో అద్భుతమైన సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా జీ తెలుగులో ప్రసారమైన త్రినయిని(Trinayani) సీరియల్ లో హాసిని(Hasini) పాత్ర ద్వారా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అలాగే జానకి కలగనలేదు సీరియల్ లో మల్లిక పాత్ర ద్వారా కూడా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా ఈ కార్యక్రమంలో భాగంగా విష్ణు ప్రియ త్రినయని సీరియల్ గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
త్రినయని సీరియల్ లో హాసిని పాత్రలో తాను నటించినందుకు చాలామంది ఎందుకు నువ్వు ఇలాంటి పాత్రలు చేస్తున్నావు అంటూ కొంత అవమానకరంగా మాట్లాడారని తెలిపారు. సీరియల్లో ప్రధాన పాత్రలలో అవకాశాలు రాకనే ఇలాంటి పాత్రలకు ఒప్పుకుంటుందా? అంటూ చాలామంది మాట్లాడారని గుర్తు చేసుకున్నారు. అయితే హాసిని పాత్ర తనకు చాలా మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చిందని, ఈ సీరియల్ కారణంగా తాను కొద్దిరోజులు ఇండస్ట్రీకి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చిందని కూడా తెలిపారు. ప్రతి ఒక్క ఆర్టిస్టు ఒకే తరహా పాత్రలో కాకుండా వేరువేరుగా నటించాలని కోరుకుంటారు.. అందుకే నేను హాసిని పాత్రలో నటించానని తెలిపారు.
ఇలా ఈ సీరియల్లో చేసిన తర్వాత నాకు వేరే సీరియల్స్ లో కూడా ఇదే తరహా పాత్రలలో అవకాశాలు ఇచ్చారు. అందుకే నాకు ఆ పాత్రలలో నటించడం ఇష్టం లేక కొద్ది రోజులు బ్రేక్ ఇద్దామని ఎలాంటి సీరియల్స్ కి కమిట్ అవ్వకుండా దాదాపు 8 నెలల నుంచి ఇంట్లోనే ఉంటున్నానని తెలిపారు.. ఇప్పుడిప్పుడే కొత్త సిరీస్ అలాగే సినిమాలను కూడా చేస్తున్నానని తిరిగి మరొక సీరియల్ కి కూడా తాను కమిట్ అయ్యానని తన కెరీర్ గురించి తెలియజేశారు. ఇలా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం గురించి కూడా ఈ సందర్భంగా విష్ణు ప్రియ మాట్లాడారు.
మన తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది టాలెంట్ కలిగిన అమ్మాయిలు ఉన్నారు. కానీ వారందరినీ కాదంటూ పక్క రాష్ట్రాల వారికి ప్రధాన పాత్రలలో అవకాశాలు వస్తున్నాయని అలా ఎందుకు జరుగుతుందో తనకు ఇప్పటికీ అర్థం కాని విషయమని విష్ణు ప్రియ వెల్లడించారు. ఇక ఈమె ప్రస్తుతం సినిమాలు సిరీస్ లను చేస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక నిత్యం ఎన్నో రకాల వీడియోలను రీల్స్ షేర్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా అభిమానులను సందడి చేయడమే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా భారీ స్థాయిలో సంపాదిస్తున్నారు. ఇక విష్ణు ప్రియ మరొక సీరియల్ నటుడు సిద్ధార్థ వర్మను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
Also Read: Raviteja: ఆ డిజాస్టర్ సినిమాలంటే ఇష్టమన్న మాస్ హీరో..ఆ డౌట్ వస్తే సినిమా పోయినట్టేనా?