Gundeninda Gudigantalu Balu : సీరియల్స్ ద్వారా ఎంతో మంది నటులు బాగా పాపులర్ అవుతున్నారు. గత కొన్నేళ్లుగా టీవీ చానల్స్ కి మంచి డిమాండ్ కూడా ఉంటుంది. ఈమధ్య సినిమా హీరోలను మించి సీరియల్ హీరోయిన్లకు, హీరోలకు ఫాలోయింగ్ కూడా ఉంటుందన్న విషయం చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న గుండె నిండా గుడి గంటలు సీరియల్ హీరో బాలు సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ని సంపాదించుకున్నాడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలుకు సంబంధించిన ఎటువంటి మేటర్ అయిన కూడా ఇట్టే వైరల్ అవుతుంది. తాజాగా బాలు తన సోషల్ మీడియాలో ఒక వీడియోని పోస్ట్ చేశాడు.ఆ వీడియో ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతుంది. ఇంతకీ ఆ వీడియోలు ఏముంది అన్నది మనం కాస్త వివరాలు తెలుసుకుందాం..
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ద్వారా ప్లీజ్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటుడు బాలు అలియాస్ విష్ణు కాంత్. తమిళనాడు అయినా కూడా అచ్చ తెలుగు కుర్రాడు లాగా అందరిని ఆకట్టుకుంటూ వస్తున్నాడు. బాలు తెలుగులో ఎలాంటి సీరియల్లో నటించిన కూడా మంచి క్రేజ్ ను కూడా సంపాదించుకుంటున్నాడు. ఇక సోషల్ మీడియాలో అయితే చెప్పనక్కర్లేదు తన గురించి ఎన్నో వీడియోలను ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను తెగ ఆకట్టుకుంటూ వస్తున్నాడు.. బాలు ఎలాంటి పోస్ట్ పెట్టిన కూడా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా బాలు షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఇంతకీ ఆ వీడియోలో బాలు పంచకట్టులో కనిపించడం హైలైట్ గా నిలిచింది దీపావళి స్పెషల్గా బాలు వేసుకున్న డ్రస్సు వీడియో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అమ్మాయిలు తెగ ఫిదా అవుతున్నారు. మరి ఆ వీడియో ఎలా ఉందో ఒకసారి ఇక్కడ చూసేయ్యండి..
?cplk=MTVsZnEwN3RydzExYg==
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన బాలు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలుగు ప్రేక్షకులను తన నటినతో బాగా ఆకట్టుకున్నాడు. ఈయన సీరియల్ వస్తుంది అంటే చిన్న పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా టీవీల ముందు కూర్చుని బాలు వేసే పంచులతో నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. తమిళ నటుడు అయ్యి ఉండి కూడా తెలుగులో తన నటనతో ఆకట్టుకున్న బాలుకి వరుసగా సీరియల్ అవకాశాలు వస్తున్నాయని తెలుస్తుంది. ఇప్పటికే తెలుగులో మా ఇంటి దేవత అనే సీరియల్ లో కూడా నటిస్తున్నాడు బాలు. ఇప్పుడు మరొక సీరియల్లో అవకాశం వచ్చింది అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి ఇందులోని నిజమేంత ఉందో తెలియదు కానీ, త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.. ఏది ఏమైనా తెలుగులో బాలుకు మంచి క్రేజ్ వచ్చింది.