Anchor Sreemukhi: బుల్లితెరపై యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో శ్రీముఖి(Sreemukhi) ఒకరు. పటాస్ అనే కార్యక్రమంలో యాంకర్ గా పరిచయమైన ఈమె అనంతరం తన మాటతీరుతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. బుల్లితెర రాములమ్మగా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న శ్రీముఖి ప్రస్తుతం వరుస కార్యక్రమాలకు యాంకర్ గా కొనసాగుతున్నారు. ముఖ్యంగా స్టార్ మా లో ప్రసారమవుతున్న కార్యక్రమాలకు యాంకర్ గా కొనసాగుతూ కెరియర్ పరంగా క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఇకపోతే దీపావళి పండుగ(Diwali Festival) సందర్భంగా ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రిటీలు వారి దీపావళి సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే శ్రీముఖి సైతం తన ఇంట్లో దీవాలి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలకు సంబంధించిన వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో భాగంగా తన తల్లిదండ్రులతో కలిసి ఈమె ప్రత్యేక పూజ హోమ కార్యక్రమాలలో పాల్గొన్నారని తెలుస్తుంది. ఇలా సాంప్రదాయబద్ధంగా ఈ పూజ వేడుకలను నిర్వహించారు. అయితే ఇందుకు సంబంధించిన ఈ వీడియోని శ్రీముఖి తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. హ్యాపీ దీవాలి.. ఈ దీపావళి పండుగ చాలా స్పెషల్ అని.. ఈ పండుగ ఎందుకు స్పెషల్ అనేది త్వరలోనే తాను డీటెయిల్ గా చెబుతానంటూ శ్రీముఖి తెలిపారు.
ఇలా ఈ పండుగ తనకు చాలా స్పెషల్ త్వరలోనే అసలు విషయం చెబుతానని ఈమె పోస్ట్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా ఈ పోస్టుపై విభిన్న రీతిలో చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే పూర్తి విషయాన్ని తెలియజేస్తానని శ్రీముఖి చెప్పడంతో కచ్చితంగా ఈమె తన పెళ్లికి సంబంధించిన విషయాన్ని చెప్పబోతున్నారంటూ అభిమానులు భావిస్తున్నారు. కొద్ది రోజులుగా శ్రీముఖి పెళ్లి (Sreemukhi Marriage)చేసుకోబోతోంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
?rpxt=MXF6MmM0YjFobDM4Mw%3D%3D
ఇలా తన పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని అయితే శ్రీముఖి ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదని సమాచారం. దీపావళి సందర్భంగా శ్రీముఖి ఈ పండుగ తనకు చాలా ప్రత్యేకం అంటూ మాట్లాడటంతో కచ్చితంగా ఈమె తన పెళ్లి విషయమే చెప్పబోతున్నారని త్వరలోనే అందరికీ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారంటూ అభిమానులు భావిస్తున్నారు. మరి నిజంగానే శ్రీముఖి పెళ్లి గురించి చెప్పి అందరిని సర్ప్రైజ్ చేస్తుందా లేదంటే మరి ఏదైనా గుడ్ న్యూస్ రాబోతోందా అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం శ్రీముఖి యాంకర్ గా కొనసాగుతూనే మరో వైపు సినిమాలలో కూడా నటిస్తున్నారు అదేవిధంగా రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
Also Read: ఆరోజుల్లో సోషల్ మీడియా లేకపోవడం మా అదృష్టం..నాగార్జున కామెంట్స్ వైరల్!